SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

దీపావళి తర్వాత ఈ 4 రాశులకు జాక్‌పాట్.. నవంబర్ 14 నుంచి శుక్రుడి అనుగ్రహంతో పట్టిందల్లా బంగారమే!

Venus Transit November 2026: శుక్ర గ్రహం సక్రమ మార్గంలోకి రావడం కారణంగా ఈ కింది రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ఆర్థిక పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోయి.. కొన్ని రకాల లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 07, 2026, 03:58 PM IST | Updated: Nov 07, 2026, 04:00 PM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Venus Transit November 2026 Telugu: దీపావళి తర్వాత పలు రాశుల వారికి అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. శుక్ర గ్రహ మార్పుల కారణంగా కొన్ని రాశుల వారికి మంచి రోజులు రాబోతున్నాయి.. శుక్ర గ్రహ గమనంలో మార్పులు చేర్పులు కాబోతున్నాయి. శుక్రుడిని సంపద, ప్రేమతో  పాటు వైవాహిక జీవితం, సుఖానికి ప్రతీకగా చెప్పుకుంటూ ఉంటారు. దీని కారణంగా 12 రాశుల వారిని అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు.

అక్టోబర్ 3వ తేది మధ్యాహ్నం 12:45 గంటలకు శుక్రుడు వక్రగతిలో సంచార దశలో కొనసాగుతున్నాడు. నవంబర్ 14న ఉదయం 5:57 గంటలకు.. శుక్రుడు మళ్ళీ వక్రగతి నుంచి సక్రమ మార్గంలోకి రాబోతోంది. ఒక గ్రహం వక్రగతిని వదిలి పెట్టి.. సక్రమ మార్గంలోకి రావడం వల్ల కొన్ని రాశులవారికి బంపర్‌ లాభాలు కలుగుతాయి. శుక్రుని వక్రగతి ప్రేమ, సంపద, వైవాహిక జీవితం, సౌకర్యం వంటి అంశాలను ప్రభావితం చేస్తుంది.. ఇప్పుడు శుక్రుని వక్రగతి కారణంగా ఏయే రాశులవారికి శుభప్రదంగా ఉంటుందో ఇప్పుడు తెలుసుకుందాం..

ఈ రాశులవారికి బంపర్‌ లాభాలు:
మేషరాశి
శుక్రుడు సక్రమ మార్గంలోకి వెళ్లడం కారణంగా అనేక ఆర్థిక ఇబ్బందులు కూడా తొలగిపోతాయి. ముఖ్యంగా పై అధికారుల నుంచి కూడా మంచి సపోర్ట్‌ లభిస్తుంది. వీరికి పనుల్లో ప్రశంసలు కూడా లభిస్తాయి. అలాగే కుటుంబ జీవితంలో సంతోషం కూడా రెట్టింపు అవుతుంది. ఆదాయ వనరులు కూడా రెట్టింపు అవుతాయి. పొదుపు చేసిన డబ్బుల నుంచి భారీ మొత్తంలో లాభాలు కూడా కలుగుతాయి.

కన్యారాశి
శుక్రుని ప్రభావంతో కన్యా రాశివారికి కూడా అద్భుతమైన ప్రయోజనాలు కలిగే అవకాశాలు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా ఉద్యోగాలు చేసేవారికి కూడా తప్పకుండా కీలక బాధ్యతలు కూడా సులభంగా లభించే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వ్యాపారాలు చేయాలనుకునేవారికి బోలెడు లాభాలు కలుగుతాయి. వీరు తప్పకుండా అనవసర ఖర్చులు మానుకోవాల్సి ఉంటుంది.

కుంభరాశి
శుక్రుడు సక్రమ మార్గంలోకి రావడం కారణంగా కుంభ రాశివారికి కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి ఉద్యోగాల పరంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోయి. పదోన్నతులు కూడా లభిస్తాయి. అంతేకాకుండా సంపాదించడానికి కొత్త అవకాశాలు కూడా రావడం ప్రారంభమవుతాయి. వ్యాపారవేత్తలు పెద్ద పెద్ద ఒప్పందాలు కూడా సులభంగా కుదుర్చుకుంటారు. అంతేకాకుండా ఈ సమయంలో పెట్టుబడులు పెట్టడం వల్ల భారీ ప్రయోజనాలు పొందుతారు.

తులారాశి
శుక్రుడు తులా రాశివారికి అధపతి కావడం వల్ల తులా రాశివారికి కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది. అంతేకాకుండా శుక్రుడి అద్భుతమైన ప్రభావంతో ఆత్మవిశ్వాసం కూడా రెట్టింపు అవుతుంది. పని ప్రదేశాల్లో కూడా అద్భుతమైన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు. ఆర్థిక పరిస్థితులు కూడా చాలా వరకు మెరుగుపడతాయి. దీంతో పాటు వ్యాపారాలు కూడా లాభసాటిగా మారే ఛాన్స్‌లు ఉన్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. 
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES