SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

తిరోగమనంలోకి శుక్రుడు.. 42 రోజుల పాటు ఈ 3 రాశులకు డబ్బే డబ్బు.. మీ రాశి ఉందా?

Venus Retrograde 2026: 42 రోజుల పాటు శుక్రుడు తిరోగమనంలో ఉండడం వల్ల కొన్ని రాశులవారికి బంపర్‌ ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. వీరికి ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. అంతేకాకుండా అనుకున్న ధన లాభాలు కూడా సొంతం చేసుకుంటారు.

Reported By Dharmaraju Dhurishetty Written By Dharmaraju Dhurishetty
Published: Sep 22, 2026, 10:22 AM IST | Updated: Sep 22, 2026, 10:25 AM IST
Image Credit: Source: Zee Telugu News
Join

Venus Retrograde 2026 Effect: జ్యోతిష్య శాస్త్రంలో శుక్రగ్రహానికి చాలా ప్రత్యేకమైన ప్రాముఖ్యత ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. ఈ గ్రహాన్ని భౌతిక సుఖాలు, సౌందర్యంతో పాటు లగ్జరీ జీవితం, సంపదలకు సూచికగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ గ్రహం కదలికల కారణంగా అన్ని రాశులు ప్రభావితమవుతాయి. అంతేకాకుండా ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే డబ్బు సంబంధిత సమస్యలు కూడా తీరిపోతాయి. ఇదిలా ఉంటే శుక్రగ్రహం త్వరలోనే తిరోగమనం చేయబోతోంది.

అక్టోబర్ 3వ తేదీ మధ్యాహ్నం నుంచి మొదలు కాబోతున్న ఈ తిరోగమనం.. నవంబర్ 14వ తేదీ తెల్లవారుజాము వరకు కొనసాగుతుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా దాదాపు 42 రోజుల పాటు శుక్రుడు ఈ వక్ర స్థితిలోనే సంచరించడం వల్ల ద్వాదశ రాశులు ప్రభావితమయ్యే ఛాన్స్‌లు కూడా కనిపిస్తున్నాయి. గ్రహాల వక్ర ప్రభావం అన్ని రాశులకి ప్రతికూల ప్రభావాన్ని అందిస్తూ ఉంటాయి. అయితే, ఈసారి శుక్రుడి చేసే తిరోగమనం మాత్రం కొన్ని రాశులవారికి అద్భుతమైన ఫలితాలను అందిస్తుందని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అయితే, ఈ సమయంలో ఏయే రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుందో? అద్భుతమైన లాభాలు పొందే రాశులేవో పూర్తి వివరాలు జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావురి నాగరాజు శర్మ అందించిన సమాచారం ప్రకారం తెలుసుకుందాం..

మిథున రాశి (Gemini):
మిథున రాశివారికి అక్టోబర్ 3వ తేదీ నుంచి శుక్రుడి ప్రభావంతో బంపర్‌ లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. అంతేకాకుండా వ్యాపారాల పరంగా వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా డిజిటల్‌ మార్కెటింగ్‌తో పాటు కంటెంట్ క్రియేటింగ్, IT, బిజినెస్‌ చేసేవారికి అద్బుతమైన ప్రయోజనాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. శుక్రుడి ఎఫెక్ట్‌తో సృజనాత్మకత కూడా విపరీతంగా పెరుగుతుంది. గతంలో నిలిచిపోయిన పనులు మొండి బకాయిలు కూడా చేతికి అందే ఛాన్స్‌లు కనిపిస్తున్నాయి. పాత అప్పుల నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది.

మేష రాశి (Aries):
మేష రాశివారికి శుక్రుడి ప్రభావంతో విశేషమైన లాభాలు కలుగుతాయి. వీరికి వైవాహిక బందంతో పాటు భాగస్వామ్య వ్యాపారాల్లో వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. గత కొన్ని రోజుల నుంచి వస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు తంజావురి నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా అనేక రకాలయ మనస్పర్థాలు కూడా సులభంగా తొలగిపోయి.. దంపతులు చాలా సంతోషంగా ముందుకు సాగుతారు. అలాగే నిరుద్యోగులకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో విశేషమైన ప్రయోజనాలు కలుగుతాయి.

కర్కాటక రాశి (Cancer):
కర్కాటక రాశివారికి నాలుగవ స్థానంలో శుక్రుడు తిరోగనంలో ఉండడం వల్ల అనేక రకాల లాభాలు కలుగుతాయి. వీరికి దిమ్మతిరిగే ధన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. వీరికి కుటుంబంలో పండగ లాంటి వాతావరణం నెలకొంటుంది. అంతేకాకుండా చాలా రోజులుగా వేధిస్తున్న సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. అలాగే రియల్ ఎస్టేట్‌తో పాటు నిర్మాణ రంగాల్లో పనులు చేస్తున్నవారికి బంపర్‌ లాభాలు చేకూరుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు. ముఖ్యంగా వ్యాపారాల్లో అనుకున్నంత స్థాయిలో లాభాలు రావడం కూడా ప్రారంభమవుతాయి.

నోట్‌: జ్యోతిష్య ఫలితాలు వ్యక్తిగత జాతకం, జన్మకుండలిలోని రాశులు ఆధారంగా హెచ్చుతగ్గులు వస్తూ ఉంటాయి.. ముఖ్య నిర్ణయాలు తీసుకునే ముందు నిపుణులను సంప్రదించడం శ్రేయస్కరమని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలిపారు.

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

గమనిక..

Also Read: Mercury Transit 2026: బుధుడి శక్తివంతమైన ప్రభావం.. మార్చి 13 నుంచి ఈ రాశుల వారికి ఊహించని సంపాదన!

 

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook ..

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES