SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మాళవ్య మహాపురుష రాజయోగం ఎఫెక్ట్‌.. నవంబర్ 22 నుంచి ఈ రాశులకు కాసుల వర్షం!

Malavya Raj Yoga Effect: శుక్రుడి సంచార ప్రభావంతో ఎంతో శక్తివంతమైన మాళవీయ మహాపురుష రాజయోగం ఏర్పడిపోతుంది. దీనికి ఆనందంగా నవంబర్ 22వ తేదీ నుంచి కొన్ని రాశుల వారి జీవితాల్లో అద్భుతమైన మార్పులు రాబోతున్నాయి. కోరుకుంటున్న కోరికలు కూడా నెరవేరబోతున్నాయి.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 08, 2026, 09:15 AM IST | Updated: Nov 08, 2026, 09:17 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Malavya Raj Yoga Effect: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం శుక్ర గ్రహాన్ని సంతోషంతో పాటు శ్రేయస్సు, సంపద, విలాసం, ప్రేమకు సూచికగా భావిస్తూ ఉంటారు. అందుకే ఈ గ్రహ సంచారం చాలా ప్రత్యేకమైనదిగా భావిస్తూ ఉంటారు. శుక్రుడు జాతకంలో శుభ స్థానంలో ఉన్న రాశుల వారికి ఎల్లప్పుడూ మేలు జరుగుతూనే ఉంటుంది. అంతేకాకుండా సంతోషం, శ్రేయస్సు పెరగడమే కాకుండా వైవాహిక జీవితంలో ఎంతో బాగుంటుంది. ఇదిలా ఉంటే ధన త్రయోదశి రోజున శుక్రుడు కన్యారాశిలోకి ప్రవేశించాడు. ఆ తర్వాత నవంబర్ 22వ తేదీ వరకు అదే రాశిలో ఉండి, ఆ తర్వాత తులా రాశిలోకి వెళ్తాడు.. ఈ సమయంలోనే మాళవీయ మహాపురుష రాజయోగం ఏర్పడుతుంది. ఈ గ్రహం తులా రాశిలోకి వెళ్లడం కారణంగా జీవితంలో సంతోషం విపరీతంగా పెరుగుతుంది. అంతేకాకుండా వ్యాపారాలపరంగా విశేషమైన లాభాలు కూడా కలుగుతూ ఉంటాయి. సామాజిక సంబంధాలు కూడా చాలావరకు మెరుగుపడతాయి. ఇదిలా ఉంటే 2027 సంవత్సరం జనవరి 1వ తేదీ వరకు తులారాశి లోనే సంచార దశలో కొనసాగుతూ ఉంటాడు.

వీరికి లాభాలే లాభాలు:
మేషరాశి 
శుక్రుడు తులా రాశిలోకి ప్రవేశించడం కారణంగా మేషరాశి వారికి కూడా ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఈ శక్తివంతమైన మాలవ్య రాజయోగం ప్రభావంతో ఈ రాశి వారికి మేలు జరుగుతుంది. ఆర్థిక పరిస్థితులు కూడా చాలావరకు మెరుగుపడతాయి.. వ్యాపార రంగాల్లో ఉన్న వ్యక్తులకు కొత్త వ్యాపారాలు ప్రారంభించే అవకాశాలు కూడా లభిస్తాయి. అంతేకాకుండా ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలు లభించడం విశేషం. ప్రేమ, జీవితం కూడా చాలా బాగుంటుంది. వైవాహిక జీవితంలో మాధుర్యం విపరీతంగా పెరిగే అవకాశాలు ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజ శర్మ తెలుపుతున్నారు.

మిథున రాశి 
మాలవ్య రాజయోగం ఎఫెక్ట్‌తో మిథున రాశి వారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా వీరికి నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆర్థిక విషయాల్లో కూడా సానుకూలమైన నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయాల్లో షేర్ మార్కెట్ వంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం చాలా మంచిదని జ్యోతిష్యులు చెబుతున్నారు. అంతేకాకుండా కొన్ని పెట్టుబడుల్లో మాత్రం ఆలోచించి ఆచితూచి వ్యవహరించాలని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతూ ఉన్నారు. ప్రేమ జీవితం కూడా చాలా మధురంగా మారుతుందని.. మార్కెటింగ్ రంగాల్లో ఉన్న వ్యక్తులకు విశేషమైన లాభాలు చేకూరే అవకాశాలు కనిపిస్తున్నాయి.

సింహరాశి 
సింహరాశి వారికి కూడా ఆత్మవిశ్వాసంతో పాటు సామాజిక బంధాన్ని మరింత బలపడే అవకాశాలు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రంగాల్లో భారీ లాభాలు కలగడమే కాకుండా ఉద్యోగ వ్యాపారాల్లో అనుకున్న ప్రయోజనాలు పొందగలుగుతారు. ఈ సమయంలో చాలాకాలం నిలిచిపోయిన డబ్బులు కూడా మళ్లీ తిరిగి ప్రారంభమవుతాయి. ఉద్యోగస్తులకు మంచి సపోర్టు లభించి విశేషమైన ధనలాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలు చేసే వ్యక్తులకు కూడా ఈ సమయం ఎంతో అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా కొత్త కస్టమర్లతో విశేషమైన లాభాలు కలిగే అవకాశాలు ఉన్నాయి. కుటుంబ సభ్యులతో మంచి మంచి సంబంధాలు ఏర్పడి.. అద్భుతమైన ప్రయోజనాలు సొంతం చేసుకోగలుగుతారు.
NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES