SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ధనత్రయోదశి రోజే శుక్రుడి సంచారం.. ఈ 4 రాశుల వారికి బంపర్‌ గుడ్‌న్యూస్‌!

Venus Transit: ధనత్రయోదశి రోజునే శుక్రుడు సంచారం చేయడంతో ఈ కింది రాశులవారికి చాలా రకాల లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. ముఖ్యంగా ఆర్థికంగా వస్తున్న సమస్యలు కూడా తొలగిపోతాయి. అనుకున్న పనుల్లో విజయాలు కూడా సాధిస్తారు.

Written By Dharmaraju Dhurishetty
Published: Nov 06, 2026, 10:13 AM IST | Updated: Nov 06, 2026, 10:14 AM IST
Image Credit: ZEE TELUGU NEWS
Join

Venus Transit Effect: ధనత్రయోదశి రోజు అనేక గ్రహాల మార్పులు జరగబోతున్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. దీని కారణంగా కొన్ని రాశులవారికి ఈ సమయం చాలా శుభప్రదంగా ఉంటుంది. ఇదిలా ఉంటే సంపద, విలాసం, ప్రేమకు సూచికగా భావించే శుక్రుడు ఇదే రోజు రాశి సంచారం చేయడం విశేషం.. దీంతో నాలుగు రాశులవారిపై శుక్రుడి అద్బుతమైన శుభప్రభావం పడుతుంది. దీంతో ఆయా రాశులవారికి అద్భుతమైన ఆనందంతో పాటు పురోగతి కూడా లభిస్తుంది.

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని అత్యంత శుభగ్రహంగా పరిగణిస్తూ ఉంటారు. అయితే, జాతకంలో ఈ గ్రహం శుభస్థానంలో ఉంటే అద్భుతమైన లాభాలు కలుగుతాయి. అంతేకాకుండా ఆర్థికంగా అనేక రకాల సౌకర్యాలు పెరుగుతూ వస్తాయి. ముఖ్యంగా ధనత్రయోదశి రోజే ఈ గ్రహం సంచారం జరగడం విశేషం.. అయితే, ఈ సమయంలో కొన్ని రాశులవారికి చాలా శుభప్రదంగా ఉంటుంది.

ఏ 4 రాశులవారికి లాభాలు?
కర్కాటక రాశి
ధనత్రయోదశి రోజునే శుక్రుడి ప్రభావం కారణంగా కర్కాటక రాశివారికి కూడా ఈ సమయం చాలా బాగుంటుంది. వీరికి జీవితంలో ఆనందాన్ని, శ్రేయస్సు కూడా లభించే ఛాన్సులు కనిపిస్తున్నాయని జ్యోతిష్యులు తెలుపుతున్నారు. ముఖ్యంగా కొత్త ఉద్యోగాలు చేరాలనుకునేవారికి కూడా బంపర్‌ లాభాలు కలుగుతాయి. అలాగే కుటుంబంలో కూడా ఆనందం కూడా రెట్టింపు అవుతుంది. ఈ సమయం చాలా వరకు సంతోషకరంగా మారుతుంది.

తులారాశి
శుక్ర గ్రహ సంచారంతో తులారాశివారికి కూడా చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. వీరికి ఆదాయం కూడా విపరీతంగా పెరుగుతుంది. ఉద్యోగాలు చేయాలనుకునేవారికి తప్పకుండా మంచి మంచి అవకాశాలు కూడా లభిస్తాయి. అలాగే వీరు అద్భుతమైన విలాసవంతమైన వస్తువులు కూడా కొనుగోలు చేసే ఛాన్స్‌లు ఉన్నాయి. వ్యాపారం కూడా చాలా వరకు లాభసాటిగా మారుతాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి.

మేష రాశి
శుక్రుడి ప్రభావంతో మేష రాశివారికి ధనత్రయోదశి నుంచి అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వీరికి ఆర్థిక పరిస్థితులు మెరుగుపడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. అంతేకాకుండా నిలిపోయిన డబ్బులు కూడా భారీ మొత్తంలో తిరిగి వస్తాయి. పనుల్లో అద్భుతమైన లాభాలు కలిగే అవకాశాలు కూడా ఉన్నాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు. వ్యాపారాలు చేసేవారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది.

సింహ రాశి
శుక్ర గ్రహ సంచారం సింహ రాశి వారికి కూడా శుభప్రదంగా మారబోతోందని జ్యోతిష్యులు చెబుతున్నారు. వీరికి డబ్బులు సంపాదించేందుకు ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది. అలాగే వీరికి ఆర్థికంగా కూడా చాలా వరకు కనిసివస్తుంది. ఉద్యోగంలో గౌరవం, ప్రతిష్ట విపరీతంగా పెరుగుతాయి.. అంతేకాకుండా పెట్టుబడులు పెట్టాలనుకునేవారికి ఈ సమయం లాభసాటిగా మారుతుంది. వ్యక్తిగత జీవితంలో కూడా అద్భుతమైన లాభాలు కలుగుతాయని జ్యోతిష్యులు నాగరాజు శర్మ తెలుపుతున్నారు.

NOTE:

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దురిశెట్టి ధర్మరాజు జీ తెలుగు న్యూస్ (zee telugu news)లో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఆయనకు దాదాపు జర్నలిజంలో ఐదు సంవత్సరాల పాటు అనుభవం ఉంది. ఇక్కడ సోషల్, ఆస్ట్రాలజీ, టెక్నాలజీ, ఆటోమొబైల్స్‌, బిజినెస్, జాతీయం అంశాలకు సంబంధించిన తాజా వార్తలతో పాటు విశ్లేషణ పూరితమైన కథనాలను అందిస్తారు. అలాగే ఆయనకు వెబ్‌సైట్‌కు సంబంధించిన వీడియో కంటెంట్‌పై కూడా అవగాహన ఉంది..

ZEENEWS TRENDING STORIES