• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Diwali Bonus 2026: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 30 రోజుల దీపావళి బోనస్‌కు ఆమోదం

Diwali Bonus 2026: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 30 రోజుల దీపావళి బోనస్‌కు ఆమోదం

Government Employees Diwali Bonus: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు యోగి ఆదిత్యనాథ్ సర్కార్ తీపి కబురు అందించింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి 30 రోజుల బోనస్ చెల్లింపునకు ఆమోదం తెలిపింది. బోనస్‌లో 25 శాతం నగదు రూపంలో.. మిగిలిన 75 శాతం పీఎఫ్ ఖాతాల్లో జమ చేయనున్నారు.

Written ByAshok Krindinti
Published: Nov 06, 2026, 11:51 AM IST|Updated: Nov 06, 2026, 11:53 AM IST
joinshare
Diwali Bonus 2026: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 30 రోజుల దీపావళి బోనస్‌కు ఆమోదం
Image Credit: Government Employees Diwali Bonus (Source: AI Generated)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుడు మరణిస్తే.. ఆ కుటుంబం డబ్బులు ఎలా పొందాలి? సింపుల్ స్టెప్స్‌!

పోస్ట్ ఆఫీస్ ఖాతాదారుడు మరణిస్తే.. ఆ కుటుంబం డబ్బులు ఎలా పొందాలి? సింపుల్ స్టెప్స్‌!

2

ఆస్ట్రిచ్ ఎఫెక్ట్.. మీరు కళ్ళు మూసుకుంటే పులిలా వెంటాడే సమస్య మిమ్మల్ని వదిలేస్తుందా?

3

Diwali Bonus 2026: ఈ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. 30 రోజుల దీపావళి బోనస్‌కు ఆమోదం

4

అమెరికా పొలిటికల్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ ట్విస్ట్.. ఒక్క ఎన్నికతో మారిన 10 రికార్డులు..!!

5

బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Government Employees Diwali Bonus: దీపావళి పండుగకు ముందు ప్రభుత్వ ఉద్యోగులకు యోగి సర్కార్ గుడ్‌న్యూస్ చెప్పింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి అర్హులైన ఉద్యోగులకు 30 రోజుల వేతనానికి సమానమైన బోనస్ చెల్లించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాన్ గెజిటెడ్ ప్రభుత్వ ఉద్యోగులతోపాటు విద్యా సంస్థలు, స్థానిక సంస్థలు, జిల్లా పంచాయతీల అర్హులైన ఉద్యోగులకు కూడా ఈ బోనస్ అందించనుంది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రోజువారీ వేతనంపై పనిచేసే ఉద్యోగులకు సైతం బోనస్ ఇవ్వాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఈ కేటగిరీ ఉద్యోగులకు గరిష్ఠంగా రూ.1,184 వరకు బోనస్ లభించనుంది.

బోనస్ చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక విధానాన్ని ఖరారు చేసింది. మొత్తం బోనస్‌లో 25 శాతం మొత్తాన్ని ఉద్యోగులకు నగదు రూపంలో చెల్లించనుంది. మిగిలిన 75 శాతం డబ్బును వారి పీఎఫ్‌ అకౌంట్‌లో జమ చేయనుంది. అయితే ఇప్పటికే పదవీ విరమణ చేసినవారికి.. త్వరలో రిటైర్ కానున్న ఉద్యోగులకు మాత్రం పూర్తి బోనస్ మొత్తాన్ని నగదు రూపంలోనే అందించనున్నారు. దీంతో అర్హులైన ఉద్యోగులకు పండుగ సమయంలో అదనపు ఆర్థిక ప్రయోజనం కలగనుంది.

మరోవైపు ధన్‌తేరస్, దీపావళి వేడుకల సందర్భంగా స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించాలని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 'వోకల్ ఫర్ లోకల్' నినాదాన్ని ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. బహుమతుల కొనుగోలు సమయంలో వన్ డిస్ట్రిక్ట్ వన్ ప్రొడక్ట్ ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. దీనివల్ల స్థానిక కళాకారులు, చేతివృత్తుల వారికి ఉపాధి, ఆదాయం పెరుగుతాయని పేర్కొన్నారు.

"ప్రధాని నరేంద్ర మోదీ 'వోకల్ ఫర్ లోకల్' దార్శనికతను స్వీకరిస్తూ.. ఈ ధంతేరస్ సందర్భంగా దయచేసి ఓడీఓపీ వస్తువులను గిఫ్ట్స్‌గా ఇవ్వండి. మీరు చేసే ఒక్క కొనుగోలు.. ఒక నైపుణ్యం గల కుటుంబంలో సరికొత్త వెలుగుని తీసుకువస్తుంది. మనమందరం 'లోకల్ దీపావళి'ని జరుపుకుందాం.. 'ఆత్మనిర్భర్' ఉత్తర ప్రదేశ్ నిర్మాణానికి మన వంతు సహకారం అందిద్దాం.." యోగి పిలుపునిచ్చారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
National News
Telugu News