• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?

బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?

బెంగళూరులో ఘోర విషాదం వెలుగులోకి వచ్చింది. ఒకే కుటుంబానికి చెందిన 7 గురిని ఒక క్యాబ్‌ డ్రైవర్‌ అత్యంత దారుణంగా గ్రైండింగ్‌ రాయితో కొట్టి చంపాడు. ఇందుశేఖర్‌ అనే క్యాబ్‌ డ్రైవర్‌ను పోలీసులు అరెస్ట్‌ చేస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఆ పూర్తి వివరాలు తెలుసుకుందాం.

Written ByRenuka Godugu
Published: Nov 06, 2026, 10:16 AM IST|Updated: Nov 06, 2026, 10:18 AM IST
joinshare
బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?
Image Credit: Bengaluru Mass Murder: X twitter

About the Author

Renuka Godugu

Renuka Godugu

రేణుక గొడుగు జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా 2024 నుంచి పనిచేస్తున్నారు. హెల్త్‌, లైఫ్‌స్టైల్‌, ఆస్ట్రోలజీ, బ్రేకింగ్, వైరల్‌ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన 6 ఏళ్ల అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?

బెంగళూరులో ఘోరం.. భార్యతోపాటు ఏడుగురిని గ్రైండింగ్ రాయితో కొట్టి చంపిన క్యాబ్ డ్రైవర్! సహకరించిన కూతురు?

2

ధనత్రయోదశి రోజే శుక్రుడి సంచారం.. ఈ 4 రాశుల వారికి బంపర్‌ గుడ్‌న్యూస్‌!

3

దీపావళి ధమాకా.. కేవలం రూ.100కే 10 రకాల కూరగాయలు.. రాష్ట్ర ప్రభుత్వం బంపర్ ఆఫర్..!!

4

నవంబర్ 12 వరకు ఈ 4 రాశులకు కుజుడి అనుగ్రహం.. ఉద్యోగం, వ్యాపారాల్లో భారీ లాభాలు!

5

Video: టిక్కెట్‌ లేకుండానే ఏసీ కోచ్‌లోకి ప్రవేశం.. చిర్రెత్తుకొచ్చి రిజర్వ్‌డ్‌ ప్యాసింజర్లు ఏం చేశారంటే?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bengaluru Mass Murder Case: బెంగళూరులో 7 గురు కుటుంబ సభ్యుల హత్య సంచలనం రేపుతోంది. వీరంతా ఒకే కుటుంబానికి చెందినవారు. మొదటగా క్యాబ్‌ డ్రైవర్‌పై అనుమానపడ్డ పోలీసులు ఆ తర్వాత తమదైన స్టైల్‌ విచారిస్తే సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి.

పోలీసుల ప్రకారం.. బెంగళూరు రాజాజీ నగర్‌ ప్రాంతానికి చెందిన క్యాబ్ డ్రైవర్‌ ఇందు శేఖర్‌కు సునీతకు 20 ఏళ్ల కిందటే వివాహం జరిగింది. అయితే, వీరి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఆ సమయంలో కూతురుకు మద్ధతుగా పుట్టింటివారు ఉండేవారు. శ్రీరాంపురానినిక చెందిన సునీత పుట్టింటివారు అడ్డుగా ఉన్నారని వారిపై కక్ష పెంచుకున్నాడు ఇందుశేఖర్‌. తనతో గొడవలు పడుతూనే తనకు నచ్చని భార్య పుట్టింటివారితో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం నచ్చలేదు. సునీత తల్లి, సోదరులపై కక్ష కూడా పెంచుకున్నాడు. దీంతో ముందస్తు ప్లాన్‌ కూడా వేసుకున్నాడు. మొదట తన భార్యను గ్రైండింగ్‌ రాయితో తల పగులగొట్టి హత్య చేశాడు. ఏమీ తెలియనట్లు ఆమె స్నేహితులను విహారయాత్రకు వెళ్లిందని చెప్పసాగాడు. వెంటనే మళ్లీ అనుమానం రాకుండా భార్య సోదరులను కూడా మందు పార్టీ ఇస్తా అని ఇంటికి పిలిపించి వారిని కూడా అలాగే హత్య చేశాడు. ఆ తర్వాత అత్త, సునీత వదినలు అయిన నళిని, దివ్యతోపాటు ఏడేళ్ల బాబు అయిన పునీత్‌ను కూడా అత్యంత దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో ఈ క్యాబ్‌ డ్రైవర్‌ ఒప్పుకున్నాడు.

అయితే, ముందుగా నళిని కూడా ఇలా కనిపించకపోవడంతో ఆమె తల్లి వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసుల నమోదు చేసుకున్న పోలీసులు ఆమెను వెతకడం ప్రారంభించినప్పుడు అసలు విషయం బయటపడింది. నంది హిల్స్‌ సమీపంలో బాలుడు పునీత్‌ మృతదేహం కనిపించింది. దీంతో వెంటనే పోలీసులు ఇందు శేఖర్‌ను ప్రశ్నించారు. అయితే, విచారణ సమయంలో పొంతనలేని సమాధానం చెప్పాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన స్టైల్‌లో విచారిస్తే అసలు విషయం వెలుగులోకి వచ్చాయి.

ఇక ఈ ఏడుగురు కుటుంబసభ్యులను హత్య చేసిన తర్వాత నిందితుడు ఆ మృతదేహాలను చిక్కబళ్లాపూర్‌లోని నంది హిల్స్‌ ప్రాంతంలో పడేసినట్లు సమాచారం. దీంతో వెంటనే పోలీసులు ఆ డెడ్‌బాడీల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. హత్యకు వాడిన కారు, వస్తువులను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

 

Horror in Bengaluru! Cab driver, Indushekar arrested for murdering 7 people of a family including his wife & 7 year-old boy. Cops suspect he lured victims to his home & bludgeoned them with a grinding stone. Bodies dumped at different locations around Nandi Hills. Probe on. https://t.co/cyWY25Z1L9

— Deepak Bopanna (@dpkBopanna) November 6, 2026

 

అయితే, ఇందులో మరో సంచలన విషయం ఏంటంటే? నిందితుడి కుమార్తె కూడా తండ్రికి సహకరించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఇంటర్‌ చదువుతోంది. ఎందుకంటే ఇందు శేఖర్‌ కూతురును హత్య చేయలేదు. బెంగళూరువ్యాప్తంగా ఈ హత్యలు సంచలనంగా మారడంతో పోలీసు ఉన్నతాధికారులు సైతం లోతైన దర్యాప్తు చేసి సరైన ఆధారాలు కూడా వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
National News
Crime News
Telugu News