SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి..? ఈ సమయానికున్న ప్రాముఖ్యత..

Brahmi Muhurtham: సాధారణంగా ఋషులు, సాధు పుంగవులు, యోగులు, పెద్దలు ఎక్కువగా బ్రాహ్మీ ముహూర్తంలోనే స్నానం చేస్తుంటారు. అసలు బ్రాహ్మీ ముహూర్తంలో చేసే స్నానం వలన కలిగే ప్రయోజనాలు ఏమిటి.. ? ఆ సమయంలో పెట్టే దీపారాధన ఫలితాలు..

Written By TA Kiran Kumar Sharma
Published: Nov 12, 2026, 04:50 AM IST | Updated: Nov 12, 2026, 04:51 AM IST
Image Credit: Brahmi Muhartam (Source/AI)
Join

Brahmi Muhurtham: తెల్లవారు జామున 3 గంటల నుండి 6 గంటల వరకు ఉన్న ముహూర్తాన్నే బ్రహ్మ ముహూర్త కాలంగా పరిగణిస్తారు. కాల సమయం దాదాపు 2 గంటలకు పైగా ఉంటుంది . ఈ రెండు గంటల  సమయములో ఓజోన్ అనేటటువంటిది గాలిలో ఎక్కువగా ఉంటుందట. ఇది శరీరానికి తగలడం వలన శరీరానికి  ఉత్తేజిత మవుతుందట.  కనుక అందరూ తెల్లవారు జామున అనగా ఉదయం 3 నుంచి 6 గంటల లోపల స్నానం చేస్తే విస్తృత ప్రయోజనాలు అందుకోవచ్చని శాస్త్ర వచనంతో పాటు శాస్త్రీయంగా నిరూపతమైంది. దీని వెనకాల మరో  కారణం కూడా ఉంది . ఆ బ్రహ్మముహూర్త కాల సమయంలో దేవతలు భూలోక సంచారం చేస్తుంటారట.

అందువలన ఆ సమయంలో చేసే స్నాన ధ్యానాదులతో  భగవంతుడు ప్రసన్నడవుతాడని శాస్త్రాలు చెబుతున్న మాట. అందుకే మన హిందూ సంప్రదాయ దేవాలయాలన్ని బ్రాహ్మి ముహూర్త కాలాంలోనే భగవంతుడి మేలు కొలుపు, సుప్రపాతం వంటివి చేస్తుంటారు. ఈ సమయంలో నిద్ర లేస్తే మనసు ఉల్లాసంగా ఉంటుందట.  అందువలన దీక్ష కాలమున బ్రహ్మ ముహూర్తమున నిద్రలేచి శిరస్నానమాచరించి స్వామిని సేవిస్తుంటారు.

వత్తులు :- ఒక వత్తితో దీపం పెట్టడం వలన సామాన్య శుభం.. రెండు వత్తులు : కుటుంబ సౌఖ్యం..  మూడు వత్తులు : పుత్ర సుఖం...
ఐదు వత్తులు : ధనం , సౌఖ్యం , ఆరోగ్యం , ఆయుర్ధాయం, అభివృద్ధి దీపారాధనకు పత్తితో చేసిన వత్తి శ్రేష్ఠము.

దీపారాధన విధానం.. ఆవు నెయ్యి : ఆవునెయ్యితో  దీపారాధన చేసిన ఇంటిలో సర్వ సుఖాలు సౌభాగ్యాలు కలుగును .అదే సమయంలో నువ్వుల నూనె : నువ్వుల నూనెతో దీపారాధన చేసిన సమస్త దోషములు , పీడలు తొలగిపోవును.

ఆముదం : ఆముదముతో దీపారాధన చేసిన , దేదీప్యమానమగు జీవితం , బంధుమిత్రుల వలన శుభం కలగబోతుంది. దాంపత్య సుఖం వృద్ధియగును.

వేరుశెనగ నూనె : వేరుశెనగనూనెతో దీపారాధన చేసి నిత్య ఋణములు , దు:ఖం , చోర భయం , పీడలు మొదలగునవి జరుగును .
నెయ్యి , ఆముదం , వేప నూనె , కొబ్బరి నూనె , యిలప నూనె కలిపి 48 రోజులు దీపారాధన చేసిన వారికి దేవీ అనుగ్రహం  సిద్ధించును. 
వేపనూనె , నెయ్యి , యిలపనూనె మూడు కలిపి దీపారాధన చేసిన ఐశ్వర్యం సంప్రాతిస్తుందనేది శాస్త్రం చెబుతున్న మాట.  

దీపాల యొక్క దిక్కుల ఫలితములు :-

తూర్పు దిక్కున దీపం పెట్టడం వలన: కష్టములు తొలగును , గ్రహదోషములు తొలిగిపోవును.. 
పశ్చిమం : అప్పుల బాధలు , గ్రహదోషములు , శనిదోషములు తొలిగిపోవును..

దక్షిణం : ఈ దిక్కున దీపము వెలిగించరాదు కుటుంబమునకు కష్టము కలుగును.

ఉత్తరం : ధనాభివృద్ధి , కుటుంబములో శుభకార్యములు జరుగును.

దీప వత్తుల యొక్క ఫలితములు : పత్తి పత్తితో దీపము వెలిగించినదో ఆయుషు పెరుగును . 
అరటినార :-ఆరటి నారతో దీపము వెలిగించినదో చేసిన తప్పులు తొలగి కుటుంబమునకు శాంతి కలుగును. 
జిల్లేడినార:- జిల్లేడినారతో దీపము వెలిగించినచో భూత , ప్రేత , పిశాల బాధలు ఉండవట. 
తామర నార :-పూర్వ జన్మలో చేసిన పాపములు తొలగును. ధనవంతు లగుదురు .
నూతన పసుపు వస్త్రముతో  దీపం వెలిగించడం వలన అమ్మవారి అనుగ్రహమునకు పాత్రులగుదురు. 
నూతన ఎరుపు వస్త్రము :- పెళ్ళిళ్ళు అగును , గొడ్రాలికి సంతానము కల్గునట. 
నూతన తెల్ల వస్త్రము : పన్నీరులో ముంచి ఆరబెట్టి దీపము వెలిగించిన శుభకార్యములు జరుగును. సాయ కాలం సమయములందు శ్రీ మహాలక్ష్మికి దీపారాధన చేసి పసుపు కుంకుమతో అర్చన చేస్తే కుటుంబ క్షేమం , సౌభాగ్యం కలుగనని శాస్త్ర చెబుతున్న మాట.  

గమనిక (Disclaimer): ఇది కేవలం మన ధర్మ శాస్త్రాల్లో ప్రస్తావించిన అంశాలు.. ధర్మ సింధువు, నిర్ణయ సింధువులోని అంశాలనే మేము ప్రస్తావించాము. జీ న్యూస్ ఈ వార్తను ధృవీకరించడం లేదు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES