• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /వినోదం
  • /కాకా వర్సెస్ విశ్వంభర.. సంక్రాంతి బరిలో చిరుకు చిరు సినిమానే పోటీ..?

కాకా వర్సెస్ విశ్వంభర.. సంక్రాంతి బరిలో చిరుకు చిరు సినిమానే పోటీ..?

Kaakaa Vs Vishwambhara: కాకా, విశ్వంభర సినిమాల రిలీజ్ విషయంలో మేకర్స్ తగ్గేదేలే అన్నట్లు మొండి పట్టుదలకు పోతున్నారా..? మిగతా సంక్రాంతి మూవీస్ ప్రమోషన్స్ జోరుగా సాగుతుంటే కాకా టీమ్ మాత్రం కేవలం ఒక్క టీజర్‌తోనే సరిపెట్టి సైలెంట్ అయిపోవడం వెనుక ఉన్న ప్లాన్ ఏంటి..? మరోవైపు ఓటిటి డీల్ ప్రెజర్‌తో విశ్వంభర మేకర్స్ డైలమాలో ఉన్నారా..? వీటి మధ్య చిరు లేటెస్ట్ నెట్‌ఫ్లిక్స్ టాక్ షో మెగావర్స్ సంగతులేంటి..?

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 12, 2026, 07:02 AM IST|Updated: Nov 12, 2026, 07:03 AM IST
joinshare
కాకా వర్సెస్ విశ్వంభర.. సంక్రాంతి బరిలో చిరుకు చిరు సినిమానే పోటీ..?
Image Credit: Kaaka Vs Vishwambhara (Source/File movie Pics)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
కాకా వర్సెస్ విశ్వంభర.. సంక్రాంతి బరిలో చిరుకు చిరు సినిమానే పోటీ..?

కాకా వర్సెస్ విశ్వంభర.. సంక్రాంతి బరిలో చిరుకు చిరు సినిమానే పోటీ..?

2

డబ్బు గురించి చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన సూత్రాలు.. అసలు మిస్ కావొద్దు..

3

బంగాళాఖాతంలో అక్వాన్ పేరుతో మరో తుపాను..? మూడు రోజుల్లో క్లారిటీ.. ?

4

ఒక్కసారిగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. సామాన్యులపై ధరాఘాతం..

5

బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి..? ఈ సమయానికున్న ప్రాముఖ్యత..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Chiranjeevi Vs Megastar: సంక్రాంతి బరిలో చిరంజీవి నటించి ‘కాకా’ రావడం గ్యారంటీ అని చెబుతున్న అందుకు తగ్గట్టు ప్రమోషన్స్ కనిపించడం లేదు. కానీ పొంగల్ రేసులో  ఉన్న మిగిలిన సినిమాలన్నీ బ్యాక్ టు బ్యాక్ అప్‌డేట్స్ ఇస్తూ ప్రమోషన్స్‌తో అదరగొడుతున్నాయి. కాకా మూవీ నుంచి మాత్రం ఇప్పటివరకు ఒక్క టీజర్ మాత్రమే బయటకు వచ్చింది. ఈ సినిమా ఫస్ట్ సింగిల్ డిసెంబర్‌లో రాబోతుందని తమన్ చెప్పడంతో.. బాబీ అండ్ టీమ్ రిలీజ్‌కు సరిగ్గా నెల రోజుల ముందు మాత్రమే తమ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తున్నారని విషయం క్లారిటీ ఇచ్చినట్టు అయింది.

విశ్వంభర సినిమా రిలీజ్ వ్యవహారం అయితే మేకర్స్‌కు పెద్ద సవాల్‌లాగా మారిపోయింది. ముందే కుదుర్చుకున్న ఓటీటీ డీల్ ప్రకారం ఈ సినిమాను కచ్చితంగా జనవరి 13 లోపే థియేట్రికల్  రిలీజ్ చేయాల్సి ఉండటంతో డెడ్ లైన్ ప్రెజర్‌లో పడిపోయారు దర్శక నిర్మాతలు. ఈ రెండు భారీ సినిమాల క్లాష్ నివారించడానికి మేకర్స్ మధ్య ఇంకా ఏవైనా చర్చలు జరుగుతున్నాయా అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ రిలీజ్ టెన్షన్స్ అన్నీ పక్కనపెడితే.. చిరంజీవి మాత్రం నెట్‌ఫ్లిక్స్ కోసం చేస్తున్న మెగావర్స్ టాక్ షో పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ షో కోసం ఇప్పటికే నాగార్జునతో కలిసి అదిరిపోయే ఫస్ట్ ఎపిసోడ్‌ను కూడా చిరు షూట్ పూర్తి చేసారని తెలుస్తుంది. మరోవైపు రజినీకాంత్, కమల్ హాసన్‌లతో చిరు ఎపిసోడ్ కూడా పూర్తి కావొచ్చింది.  ఒకవైపు కొత్త టాక్ షోతో మెగాస్టార్ ఓటీటీ ఎంట్రీ ఇస్తుంటే.. మరోవైపు కాకా, విశ్వంభర సినిమాల ఫ్యూచర్ ఏంటో త్వరలోనే తేలనుంది. చిరంజీవి మాత్రం ఈ సినిమాల చేయడం వరకే తన బాధ్యత అని.. రిలీజ్ డేట్స్ ఆయా నిర్మాతలే తేల్చుకోవాలని స్పష్టం చేసినట్టు తెలుస్తుంది. ఈ పోరులో మెగాస్టార్ సినిమాతో మెగాస్టార్ సినిమానే పోటీకి దిగుతుందా లేదా అనేది వెయిట్ అండ్ సీ.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Tollywood
Telugu News
Telugu Movie