• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఆంధ్రప్రదేశ్
  • /బంగాళాఖాతంలో అక్వాన్ పేరుతో మరో తుపాను..? మూడు రోజుల్లో క్లారిటీ.. ?

బంగాళాఖాతంలో అక్వాన్ పేరుతో మరో తుపాను..? మూడు రోజుల్లో క్లారిటీ.. ?

Another big Cyclone: బంగాళాఖాతంలో మరో తుఫాను ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. అర్నబ్, మురసు తుపానుల తర్వాత ఇప్పుడు 'అక్వాన్' పేరుతో మరో తుఫాన్ రూపుదిద్దుకునే సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ చెబుతోంది.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 12, 2026, 06:01 AM IST|Updated: Nov 12, 2026, 06:01 AM IST
joinshare
బంగాళాఖాతంలో అక్వాన్ పేరుతో మరో తుపాను..?  మూడు రోజుల్లో క్లారిటీ.. ?
Image Credit: Akvaan Cyclone (Source/AI)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
కాకా వర్సెస్ విశ్వంభర.. సంక్రాంతి బరిలో చిరుకు చిరు సినిమానే పోటీ..?

కాకా వర్సెస్ విశ్వంభర.. సంక్రాంతి బరిలో చిరుకు చిరు సినిమానే పోటీ..?

2

డబ్బు గురించి చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన సూత్రాలు.. అసలు మిస్ కావొద్దు..

3

బంగాళాఖాతంలో అక్వాన్ పేరుతో మరో తుపాను..? మూడు రోజుల్లో క్లారిటీ.. ?

4

ఒక్కసారిగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. సామాన్యులపై ధరాఘాతం..

5

బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి..? ఈ సమయానికున్న ప్రాముఖ్యత..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Akvan Toofan: అక్వాన్ తుఫాన్ పూర్తి స్థాయిలో ఏర్పడే విషయంలో ఇంకా స్పష్టత రాలేదని.. మరో మూడు, నాలుగు రోజుల్లో క్లారిటీ వస్తుందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. బంగాళాఖాతంలో తుఫాన్ ఏర్పడితే దానికి అక్వాన్ పేరు పెడతారని.. ఈ పేరును ఇరాన్ సజెస్ట్ చేసినట్టు భారత వాతావరణ శాఖ తెలిపింది.

2026, నవంబర్ 13వ తేదీ నాటికి దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. ఈ అల్పపీడనం వాయుగుండంగా మారిన.. ఆ తర్వాత తుపాన్ గా మారుతుందా అనేది 15వ తేదీ నాటికి క్లారిటీ వస్తుందని తెలిపారు. తుఫాన్ ఏర్పడితే మాత్రం దానికి అక్వాన్ అనే పేరు ఉంటుందని వెల్లడించింది వాతావరణ శాఖ.

అయితే నవంబర్ 13వ తేదీన అల్పపీడనం ఏర్పడినంత మాత్రానా.. అది తుపానుగా మారుతుందని ఇప్పుడే చెప్పలేమని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకు సముద్రంలోని వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండాలని వెల్లడించారు అధికారులు. ఈ వ్యవస్థ ముందుకు వెళ్లే తీరుపై ప్రస్తుతం మూడు అవకాశాలు ఉన్నాయని వాతావరణ నిపుణులు చెబుతున్న మాట.

మొదటి అవకాశంగా అల్పపీడనం బలపడి తమిళనాడు, దక్షిణ తీర ఆంధ్రప్రదేశ్ దిశగా కదలడం. రెండో అవకాశంగా దక్షిణ పశ్చిమ బంగాళాఖాతానికి చేరుకున్న తర్వాత సముద్రంలోనే దిశ మార్చుకోవడం. మూడో అవకాశంగా బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం బలపడే సమయంలో దిశ మార్చుకుని మయన్మార్ తీరం వైపు వెళ్లడం. ఈ మూడు అంశాలను పరిగణలోకి తీసుకోవటం జరుగుతుందని వాతావరణ శాఖ నిపుణులు చెబుతున్నారు. 2026 అక్టోబర్ నెల చివరి వారంలో అర్నబ్ తుఫాను ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకింది. ఆ తర్వాత నవంబర్ ప్రారంభంలో మురసు తుపాను కూడా ఏపీలోని తూర్పు తీరాన్ని ప్రభావితం చేసింది. ఇప్పుడు వరుసగా మూడో తుపాను ఏర్పడే సూచనలు కనిపించడంతో అధికారులు ఎప్పటికపుడు వాతావరణ శాఖకు సంబంధించిన వివరాలపై నిఘా పెంచారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
AP Weather
Weather Update
Rain News
AP News