• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /ఒక్కసారిగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. సామాన్యులపై ధరాఘాతం..

ఒక్కసారిగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. సామాన్యులపై ధరాఘాతం..

Prices of essential commodities: వాతావరణంలో మార్పులతో ఎల్‌నినో ప్రభావం ప్రజానీకాన్ని ముప్పు తిప్పలు పెట్టిస్తోంది. నిన్న మొన్నటిదాకా ఎండలు మండిపోయాయి. ఆ తర్వాత మోస్తరు వర్షాలు కురిశాయి. అక్టోబరు నెలాఖరున అర్నబ్ తుపాన్, నవంబరు తొలి వారంలో మురసు తుఫాన్ బీభత్సం సృష్టించింది. వాతావరణంలో మార్పులతో రకరకాల ఇబ్బందులు తలెత్తుతాయనే ప్రచారంతో నిత్యావసరాల ధరలు అమాంతంగా పెరిగిపోయాయి.

Written ByTA Kiran Kumar Sharma
Published: Nov 12, 2026, 05:25 AM IST|Updated: Nov 12, 2026, 05:25 AM IST
joinshare
ఒక్కసారిగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. సామాన్యులపై ధరాఘాతం..
Image Credit: Daily Kirana Rates hike (Source/AI)

About the Author

TA Kiran Kumar Sharma

TA Kiran Kumar Sharma

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
కాకా వర్సెస్ విశ్వంభర.. సంక్రాంతి బరిలో చిరుకు చిరు సినిమానే పోటీ..?

కాకా వర్సెస్ విశ్వంభర.. సంక్రాంతి బరిలో చిరుకు చిరు సినిమానే పోటీ..?

2

డబ్బు గురించి చాణక్యుడు చెప్పిన అతి ముఖ్యమైన సూత్రాలు.. అసలు మిస్ కావొద్దు..

3

బంగాళాఖాతంలో అక్వాన్ పేరుతో మరో తుపాను..? మూడు రోజుల్లో క్లారిటీ.. ?

4

ఒక్కసారిగా పెరిగిన నిత్యావసరాల ధరలు.. సామాన్యులపై ధరాఘాతం..

5

బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి..? ఈ సమయానికున్న ప్రాముఖ్యత..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Price Hikes: వర్షాభావ పరిస్థితులతో పంటల దిగుబడి తగ్గుముఖం పడుతుందనే ప్రచారంతో మార్కెట్లో బియ్యం ధరలు పెరిగిపోయాయి. అదే క్రమంలో పప్పు దినుసులు, నూనెలు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. పెరిగిన ధరలతో సామాన్యులు, మధ్య తరగతి కుటుంబీకులు సతమతమవుతున్నారు. ఎల్ నినో ప్రభావంతో ధరలు ఇంకా పెరుగుతాయా ? ఎల్‌నినో అప్రమత్తత కోసం చేసిన ప్రచారం వ్యాపారులు అక్రమంగా సొమ్ముచేసుకుంటున్నారు.  

30 శాతం పడిపోయిన దిగుబడులు.. 
ప్రపంచ వ్యాప్తంగా  ఎల్ నినో  తీవ్రత ఇబ్బందికరంగా మారింది. అకాల వర్షాలు, పండగల రద్దీ, వాతావరణ మార్పుల ధాటికి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో నిత్యావసర సరుకుల ధరలు భగ్గుమంటున్నాయి. వర్షాభావం వల్ల టమోటా, ఉల్లి, పచ్చిమిర్చి వంటి కూరగాయల సాగు తగ్గి ధరలు అమాంతం పెరిగాయి. ఆహార ధాన్యాలు, పప్పు దినుసులు దిగుబడులు 30-40శాతం మేర పడిపోయే ప్రమాదం ఉందని రైతుల్లో ఆందోళన నెలకొంది. ఎల్‌నినో ప్రభావంతో ప్రజలు అప్రమత్తం కావాలనే హెచ్చరికలు వ్యాపార వర్గాలకు లాభదాయకంగా మారాయి.

ఆకాశాన్ని తాకిన నిత్యావసరాలు..

ఎల్‌ నినో ఇంకా పూర్తి స్థాయిలో తన సామర్ధ్యం చూపకముందే నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని తాకాయి. చరిత్రలో ఎప్పుడూ కనీవినీ రీతిలో బియ్యం ధరలు ఆకాశాన్ని తాకాయి.  ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం నివేదిక ప్రకారం.. అంతర్జాతీయ, స్థానిక మార్కెట్లలో బియ్యం ధరలు 30 శాతం నుండి 50 శాతం వరకు పెరిగే అవకాశం ఉందనే అంచనాలున్నాయి.. ఎల్ నినో పేరుతో ప్రధాన రకాల ధరలు కిలోకు రూ.25లు పెరిగాయి. బియ్యం ధరలు పెరిగిన నేపథ్యంలో రేషన్ షాపుల ద్వారా ఉచితంగా పంపిణీ చేస్తున్న బియ్యం నాణ్యతపై ఓ మోస్తరుగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.  

నెల రోజుల వ్యవదిలో క్వింటాల్ పై రూ. 2 వేల పెరుగుదల.. 
బహిరంగ మార్కెట్లో కిలో సన్న బియ్యం నెల రోజుల వ్యవధిలోనే క్వింటాధరపై రెండు వేలరూపాయలకు పైగా పెరిగాయి. నెల రోజుల క్రితం 26 కిలోల బియ్యం బస్తా రూ.1650లు ఉండగా.. ఇపుడు రూ.2250లకు అమ్మకాలు సాగిస్తున్నారు. అదే క్రమంలో పప్పు దినుసులు, కూరగాయల ధరలు పెరిగిపోయాయి. కందిపప్పు, ఇతర పప్పు ధరల కిలోపై రూ.30ల నుంచి రూ.50లు పెరిగాయి. రోజు వారి మార్కెట్లో టమోటా, పచ్చిమిర్చి, ఉల్లి, ఆలుగడ్డల ధరలు పెరిగిపోయాయి. నెలరోజుల క్రితం కిలో  రూ.40లు ఉన్న ఉల్లిపాయలు ఇపుడు కిలో రూ.60లకు విక్రయాలు జరుపుతున్నారు. రూ.40లున్న కిలో పచ్చిమిర్చి ఇపుడు 80రూపాయలకు అమ్ముడవుతోంది. ఎల్‌ నినో కంటే ముందే పండించిన బియ్యం ధరలే ఇలా ఉంటే, ఎల్‌ నినో తర్వాత బియ్యం, ఇతర నిత్యావసర వస్తువుల ధరలు ఎలా ఉంటాయో అని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు.

పాల ధరల పెంపు..

నిత్యావసరాల ధరల మోతతో ఇప్పటికే సతమతమవుతున్న సామాన్యుడికి మరో షాక్ తగలబోతోంది. ప్రముఖ పాల సరఫరా సంస్థ మదర్ డెయిరీ పాల ధరలను పెంచింది. లీటరుకు రూ.2 నుంచి రూ.4 వరకు పెంచుతున్నట్లు ప్రకటించింది. పెరిగిన ఈ కొత్త ధరలు నవంబర్ 12 నుంచి అమల్లోకి రానున్నాయి. రైతుల నుంచి పాలు సేకరించే ఖర్చులు, ఇతర ముడిసరుకు వ్యయాలు పెరగడం వల్లే ధరలను సవరించాల్సి వచ్చిందని మదర్ డెయిరీ వివరణ ఇచ్చింది. అదే తరహాలో ఇతర పాల ఉత్పత్తి సంస్థలు ధరలను పెంచే యోచనలో ఉన్నాయి.

ఎల్‌నినో ప్రభావంతో ఇబ్బందికర పరిస్థితులు..

ఎల్ నినో ప్రభావంతో ఇబ్బందికర పరిస్థితులు వస్తాయని ముందే చేసిన హెచ్చరికలతో అటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణలో ప్రభుత్వ ప్రతినిధులు ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. నీటి పొదుపు, దుబారా ఖర్చులు తగ్గించుకోవాలని ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు సూచనలు చేశారు. ఎల్ నినో ప్రభావాన్ని సమర్థ వంతంగా ఎదుర్కోడానికి అనుసరించాల్సిన విధి విధానాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ప్రపంచ వ్యాప్తంగా వణికిస్తున్న ఎల్ నినో ప్రభావంపై హైదరాబాద్ లో నిర్వహించబోతున్న గ్లోబల్ సమ్మిట్ లోనూ ప్రత్యేకంగా చర్చించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.


సబ్సిడీకి సరుకుల కౌంటర్లు.. 
పెరుగుతున్న ధరల వల్ల ప్రజల్లో వ్యతిరేకత రాకుండా, ఆంధ్రప్రదేశ్‌లో సబ్సిడీ సరుకుల కౌంటర్లు, తెలంగాణలో సబ్సిడీ కిట్ల పంపిణీకి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. తెలంగాణలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజల అసంతృప్తిని చల్లబరిచేందుకు ఏకంగా రేషన్ కార్డుదారులకు  ప్రత్యేక నిత్యావసరాల కిట్ల పంపిణీకి శ్రీకారం చుట్టే దిశగా అడుగులు వేస్తోంది. కేవలం బియ్యం మాత్రమే కాకుండా, పప్పు దినుసులు, వంటనూనెలు, గోధుమపిండి, చక్కెర వంటి 6 రకాల నిత్యావసరాలతో కూడిన సబ్సిడీ కిట్లను అందించడం ద్వారా పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించేందుకు పౌరసరఫరాల శాఖ ప్రణాళికలు సిద్ధం చేసింది. బహిరంగ మార్కెట్లో ధరలను విచ్చలవిడిగా పెంచే వ్యాపారుల నిర్బంధ తనిఖీలతో పాటు, ప్రభుత్వం నేరుగా ఈ సబ్సిడీ కిట్లను ఇవ్వడం ద్వారా క్షేత్రస్థాయిలో ప్రజల్లో సానుకూలత తెచ్చుకోవాలని భావిస్తోంది.

ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం, పెరుగుతున్న ధరల నుంచి సామాన్యుడిని కాపాడేందుకు ప్రత్యేక కౌంటర్లు, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్‌ను పూర్తిస్థాయిలో రంగంలోకి దించింది. నెలకు సుమారు రూ. 100 కోట్ల వరకు అదనపు భారాన్ని ప్రభుత్వమే భరిస్తూ, బహిరంగ మార్కెట్ ధరల కంటే చాలా తక్కువకే నిత్యావసరాలను అందుబాటులోకి తెస్తోంది. రూ.100కే కిలో కందిపప్పు, రూ.125కే లీటర్ పామాయిల్, రూ.25కే గోధుమపిండి అందించడంతో పాటు, ధరణి  బ్రాండ్ బియ్యాన్ని ప్రత్యేక వాహనాల ద్వారా అందుబాటులోకి తెస్తూ మార్కెట్ ధరలపై ఒత్తిడి పెంచి అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేస్తోంది.ద్రవ్యోల్బణం: తెలంగాణలో రిటైల్ ఆహార ద్రవ్యోల్బణం పెరిగి సామాన్య, మధ్యతరగతి ప్రజలపై తీవ్ర భారం పడుతోంది.

ప్రభుత్వ చర్యలు: ఈ ధరల పెరుగుదలను నియంత్రించడానికి మరియు అక్రమ నిల్వలను అరికట్టడానికి ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు సమీక్షలు నిర్వహిస్తూ చర్యలు చేపడుతున్నాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Andhra Pradesh
AP News
Telugu News