Dhanatrayodashi: ధన త్రయోదశి వేళ యమదీపం విశిష్టత..?.. నియమాలు..?.. ఏ సమయంలో వెలిగించాలి..?
Yama deepam 2026: యమదీపంను వెలిగించడం వల్ల ఇంట్లోని వారందరికి అపమృత్యు దోషాలు అన్ని తొలగిపోతాయని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఈ రోజున కొన్ని నియమాలు పాటిస్తే ఇంట్లోని నెగెటివ్ ఎనర్జీ దూరమవుతుంది.
Yama deepam 2026 date muhurat rituals tradition: దేశ వ్యాప్తంగా దీపావళి సంబరాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా దీపావళి పండగను మూడు రోజులు పాటు ఘనంగా జరుపుకుంటారు. ఈ సారి మనం నవంబరు 6 నుంచి మూడు రోజుల పాటు ధన త్రయోదశి, నరక చతుర్దశి, దీపావళి పండగల్ని మనం జరుపుకుంటాం. అనాదీగా ధన త్రయోదశి రోజున యమదీపంను వెలిగించడంను సంప్రదాయంగా పాటిస్తున్నారు. ఈసారి ధన త్రయోదశి అనేది నవంబర్ 6న ఉదయం 11 గంటలకు వచ్చి మరుసటి రోజున అంటే నవంబర్ 7న ఉదయం 10.30 వరకు ఉండటం వల్ల రెండు రోజులు కూడా ధన త్రయోదశిని జరుపుకొవచ్చు .
ఈ రోజున కొంచెమైన బంగారం కొనుగోలు చేయాలని కొంత మంది నియమంగా పాటిస్తారు. ఇక యమదీపం అనేది తప్పకుండా వెలిగించాలని పండితులు చెబుతున్నారు. నవంబరు 6 ప్రదోష సమయంలో లేదా శనివారం బ్రాహ్మీమూహుర్తంలో అయిన యమదీపం వెలిగించుకొవచ్చు..
యమదీపం ఎలా వెలిగించాలి..
గోధుమ పిండి తీసుకుని దానిలో పసుపు నీళ్లు వేసి ముద్దులా చేసుకొవాలి. ఆతర్వాత ఇంటి గుమ్మం ప్రధాన ద్వారంకు కుడివైపున నెల మీద శుభ్రం చేసి అష్టాదళ పద్మం ముగ్గువేయాలి. దాని మీద 8 తమలపాకులు పెట్టాలి. ఆ తర్వాత బియ్యం లేదా ఉప్పును వేయాలి. దాని మీద గోదుమ పిండితో చేసిన దీపంను పెట్టాలి. వత్తిని ఎర్రగా చేసి నువ్వుల నూనె పోసి దీపంను వెలిగించాలి. దానిలో ఒక రాగి లేది ఇత్తడి కాయిన్ వేయాలి. ఆ దీపం కింద నల్లని నువ్వులు వేయాలి.
దీపం ముఖం దక్షిణం వైపు ఉండేలా చూసుకొవాలి. దక్షిణం వైపుకు అధిపతి సూర్యపుత్రుడు యముడు. అందుకే ఆయన అనుగ్రహం కోసం యమదీపంను దక్షిణం వైపుకు వెలిగించాలని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇంట్లోని పెద్దవారు ఈ యమదీపంను వెలిగించాలని దీని వల్ల ఇంట్లో వారి అపమృత్యు దోషాలన్ని పోతాయని అనాదీగా జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.