SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IPL 2027 Auction: ఐపీఎల్‌ ఎంట్రీకి అండర్-19 ఆసియా కప్ హీరో రెడీ.. వేలంలోకి సెహ్వాగ్ వారసుడు..!

Aaryavir Sehwag IPL 2027 Mini Auction: అండర్-19 ఆసియా కప్‌లో తన బ్యాటింగ్‌తో అదరగొట్టి ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచిన వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్.. ఇప్పుడు ఐపీఎల్ వేలంలో తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు. మరోవైపు భారత మాజీ కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ మాత్రం ఈసారి వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు.

Written By Ashok Krindinti
Published: Nov 25, 2026, 17:22 IST | Updated: Nov 25, 2026, 17:23 IST
Image Credit: IPL 2027 Mini Auction (Source: X)
Join

Aaryavir Sehwag IPL 2027 Mini Auction: ఐపీఎల్ 2027 మినీ వేలం కోసం క్రికెట్ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ క్రికెటర్లు తమ పేర్లను నమోదు చేసుకోగా.. ఈసారి యువ ఆటగాళ్లు కూడా వేలానికి రెడీ అయ్యారు. భారత మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఐపీఎల్ వేలానికి తన పేరు నమోదు చేసుకున్నాడు. ఇటీవల జరిగిన అండర్-19 ఆసియా కప్‌లో అద్భుత ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించిన ఈ యువ బ్యాటర్.. ఇప్పుడు ఐపీఎల్ ఫ్రాంచైజీలను ఆకట్టుకోవాలని చూస్తున్నాడు. మరోవైపు మాజీ భారత కెప్టెన్ రాహుల్ ద్రవిడ్ కుమారుడు అన్వయ్ ద్రవిడ్ మాత్రం వేలంలో పాల్గొనడం లేదు.

వీరేంద్ర సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్ సెహ్వాగ్ ఇటీవల అండర్-19 ఆసియా కప్‌లో ఓ రేంజ్‌లో బ్యాటింగ్ చేశాడు. టీమిండియా ట్రోఫీ గెలవడంలో కీ రోల్ ప్లే చేశాడు. మొత్తం ఐదు మ్యాచ్‌లు ఆడి.. ఏకంగా 361 పరుగులు సాధించాడు. 90.25 సగటుతో పాటు 95.50 స్ట్రైక్ రేట్ నమోదు చేశాడు. ఇందులో ఒక సెంచరీ, మూడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. ఈ ప్రదర్శనతో టోర్నీ ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్ అవార్డును కూడా అందుకున్నాడు.

నేపాల్‌తో జరిగిన మ్యాచ్‌లో 70 పరుగులు చేసిన ఆర్యవీర్.. యూఏఈపై ఏకంగా 160 పరుగులతో చెలరేగాడు. అఫ్గానిస్థాన్‌తో జరిగిన సెమీఫైనల్‌లో 51 పరుగులు చేశాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌లోనూ 58 పరుగులు సాధించి జట్టు విజయంలో తన వంతు పాత్ర పోషించాడు. ఇప్పుడు ఈ ప్రదర్శనతో ఐపీఎల్ ఫ్రాంచైజీల దృష్టిని ఆకర్షించేందుకు రెడీ అవుతున్నాడు. వేలంలో తన కనీస ధరను రూ.30 లక్షలుగా నిర్ణయించుకున్నాడు.

మరోవైపు భారత మాజీ కెప్టెన్, కోచ్ రాహుల్ ద్రవిడ్ తనయుడు అన్వయ్ ద్రవిడ్ మాత్రం ఐపీఎల్ 2027 వేలం కోసం తన పేరును నమోదు చేసుకోలేదు. అండర్-19 ఆసియా కప్‌లో భారత జట్టులో భాగంగా ఉన్న అన్వయ్.. ఈసారి వేలానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. భారత అండర్-19 జట్టు కెప్టెన్ లక్ష్య రాయ్‌చందానీ కూడా వేలం జాబితాలో తన పేరును నమోదు చేయలేదు. మరో ఆటగాడు మనల్ చౌహాన్ కూడా ఈసారి వేలానికి దూరంగా ఉన్నాడు.

అండర్-19 ఆసియా కప్ ఫైనల్‌లో పాకిస్థాన్‌పై భారత్ విజయంలో కీలకంగా నిలిచిన మొహిత్ ఉల్వా కూడా ఐపీఎల్ వేలంలో తన అదృష్టం పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యాడు. తన కనీస ధరను రూ.30 లక్షలుగా నిర్ణయించుకున్నాడు. పాకిస్థాన్‌తో జరిగిన ఉత్కంఠభరిత ఫైనల్‌లో చివరి బంతికి భారత్ విజయానికి 3 పరుగులు అవసరమైన సమయంలో బౌండరీ బాది జట్టుకు టైటిల్ అందించాడు. ఈ ప్రదర్శనతో మొహిత్ ఒక్కసారిగా వార్తల్లో నిలిచాడు.

ఐపీఎల్ 2027 వేలం కోసం ఈసారి మొత్తం 1,220 మంది క్రికెటర్లు పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 939 మంది భారత ఆటగాళ్లు కాగా.. 17 దేశాలకు చెందిన 281 మంది విదేశీ క్రికెటర్లు ఉన్నారు. గోవాలో డిసెంబర్ 16న ఈ వేలం జరగనుంది. పది ఫ్రాంచైజీలకు కలిపి మొత్తం 66 ఆటగాళ్ల స్థానాలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఇందులో 25 స్థానాలు విదేశీ ఆటగాళ్ల కోసం కేటాయించారు. డిసెంబర్ 1 నాటికి ఫ్రాంచైజీలు తమకు ఆసక్తి ఉన్న ఆటగాళ్ల జాబితాను సమర్పించాల్సి ఉంటుంది. అనంతరం తుది వేలం జాబితా సిద్ధమవుతుంది. అయితే వేలం కోసం పేరు నమోదు చేసుకున్నంత మాత్రాన ఆటగాడికి తుది వేలంలో అవకాశం లేదా ఐపీఎల్ కాంట్రాక్ట్ ఖరారైనట్లు కాదు. ఫ్రాంచైజీలు ఆసక్తి చూపితేనే బిడ్డింగ్‌లోకి వచ్చే అవకాశం ఉంటుంది. మరి సెహ్వాగ్ తనయుడు ఆర్యవీర్‌కు ఏ జట్టు అవకాశం ఇస్తుందో చూడాలి.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES