• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Asian Games 2026: ఆర్సీబీ టీమ్ రికార్డు బ్రేక్ చేసిన శ్రీలంక..కేవలం 45 పరుగులకే ఆలౌట్..ఫైనల్‌కు టీమ్ఇండియా!

Asian Games 2026: ఆర్సీబీ టీమ్ రికార్డు బ్రేక్ చేసిన శ్రీలంక..కేవలం 45 పరుగులకే ఆలౌట్..ఫైనల్‌కు టీమ్ఇండియా!

Asian Games 2026 Indian Team: ఆసియా క్రీడల్లో భారత పురుషుల క్రికెట్ జట్టు రాణిస్తోంది. ఇప్పటికే సెమీఫైనల్ చేరుకున్న టీమ్ఇండియా.. ఈ మ్యాచ్‌లో శ్రీలంకను కేవలం 45 పరుగులకే చిత్తు చేసింది. ఈ మ్యాచ్ గెలుపుతో ఫైనల్‌కు చేరిన భారత జట్టు, పాకిస్థాన్‌తో బంగారు పతకం కోసం పోటీ పడనుంది.

Written ByHarish Darla
Published: Oct 01, 2026, 01:01 PM IST|Updated: Oct 01, 2026, 01:05 PM IST
joinshare
Asian Games 2026: ఆర్సీబీ టీమ్ రికార్డు బ్రేక్ చేసిన శ్రీలంక..కేవలం 45 పరుగులకే ఆలౌట్..ఫైనల్‌కు టీమ్ఇండియా!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Asian Games 2026 Indian Team: జపాన్ వేదికగా జరుగుతోన్న ఆసియా క్రీడల్లో భారత క్రికెట్ జట్టు మెరిసింది. నేడు శ్రీలంకతో జరిగిన సెమీఫైనల్ మ్యాచ్‌లో టీమ్ఇండియా జట్టు విజయభేరి మోగించింది. శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోని భారత జట్టు.. గురువారం నిస్షిన్‌లోని కొరోగి స్పోర్ట్స్ పార్క్‌లో శ్రీలంకను 124 పరుగుల తేడాతో ఓడించి ఆసియా క్రీడల టీ20 ఫైనల్‌లోకి దూసుకెళ్లింది.

ఈ మ్యాచ్‌లో వికెట్ కీపర్ ఇషాన్ కిషన్ అద్భుతమైన ఇన్నింగ్స్, మరోవైపు బౌలర్ల ప్రదర్శనతో భారత పురుషుల క్రికెట్ జట్టు ఈ ఆసియా కప్ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు చేరింది. ఫైనల్లో దాయాది దేశమైన పాకిస్థాన్‌లో టీమ్ఇండియా తలపడనుంది. అయితే ఈ ఫైనల్ మ్యాచ్ ఆదివారం అనగా అక్టోబరు 4న జరగనుంది. 

అయితే ఆసియా కప్‌ క్వార్టర్ ఫైనల్లో జపాన్‌తో ఆడాల్సి ఉండగా.. అదికాస్త వర్షం కారణంగా రద్దైంది. భారీ వర్షం తర్వాత బరిలోకి దిగిన భారత్.. సెమీఫైనల్‌లో క్లిష్టమైన పిచ్‌ కండిషన్‌ను ఎదుర్కొంది. సెమీఫైనల్లో భాగంగా శ్రీలంక మొదట బౌలింగ్ ఎంచుకోగా.. యువ కెరటం వైభవ్ సూర్యవంశీని టీమ్ఇండియా జట్టులోకి చేర్చుకొని బ్యాటింగ్ లైనప్‌ను దృఢంగా మార్చింది.

జూలైలో జరిగిన జింబాబ్వే పర్యటన తర్వాత తొలిసారిగా వైభవ్ సూర్యవంశీ జట్టులోకి తిరిగి రావడం ఇదే తొలిసారి. మెరుపు ఇన్నింగ్స్ (39)తో అభిషేక్ శర్మ, సంజు సామ్సన్‌ల వికెట్లు త్వరగా కోల్పోవాల్సి వచ్చింది. అయితే ఈ పిచ్‌పై ఇషాన్ కిషన్ ఎంతో అద్భుతంగా రాణించి, మారుతున్న బౌన్స్, శ్రీలంక స్పిన్నర్లను ధీటుగా ఎదుర్కొన్నాడు. అయితే ఈ విధంగా భారీ షాట్లను ఆడుతూ.. 46 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్సర్లతో అజేయంగా 80 పరుగులు చేశాడు.

అలాగే భారత బౌలింగ్ దళంలోని జస్‌ప్రీత్ బుమ్రా తొలి ఓవర్‌లోనే రెండు వికెట్లను పడగొట్టగా.. ఈ క్రమంలో శ్రీలంక ఛేజింగ్ ఆరంభం నుంచే ఎదురుదెబ్బ తగిలింది. ఆ తర్వాత బౌలర్లు, ఆటగాళ్ల అజాగ్రత్త కారణంగా వికెట్ల పతనం కొనసాగింది. బుమ్రా, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, మూడు రనౌట్‌ల చేయగా.. దీంతో మ్యాచ్ సగం సమయం పూర్తి కాకముందే లంక 45 పరుగులకే ఆలౌట్ అయ్యింది. అయితే ఇప్పటి వరకు ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు పేరిట ఉన్న 49 పరుగుల రికార్డును శ్రీలంక బ్రేక్ చేసిందని సోషల్ మీడియాలో ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే సెమీఫైనల్‌లో నిన్న బంగ్లాదేశ్, పాకిస్థాన్ జట్లు తలపడ్డాయి. వర్షం కారణంగా ఆ మ్యాచ్‌ను 13 ఓవర్లకు కుదించగా.. అందులో పాకిస్థాన్ గెలుపొందింది. అయితే తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న బంగ్లాదేశ్ 13 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 111 పరుగులు చేయగా.. పాకిస్థాన్ 11.3 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి పాక్ లక్ష్యాన్ని ఛేదించింది. 

Also Read: Asian Games 2026: ఆసియా క్రీడల్లో టీమ్ఇండియా జాక్‌పాట్..ఒక్క మ్యాచ్ ఆడకుండానే బంగారు పతకం..

Also Read: Asian Games 2026: ఆసియా గేమ్స్‌లో భారత్ విజయభేరి..ఒకే రోజు ఆర్చరీలో 3 బంగారు పతకాలు..

Add Zee News as a Preferred Source
TAGS:
Asian Games 2026
Sports News
Telugu News