SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Asian Games India Semis: ఆసియా గేమ్స్‌లో టీమ్ఇండియాకు జాక్‌పాట్..ఒక్క బాల్ ఆడకుండానే సెమీఫైనల్‌కు!

Asian Games India Semis 2026: ఆసియా క్రీడల్లో పాల్గొనేందుకు టీమ్ఇండియా ఇటీవలే జపాన్ చేరుకుంది. అయితే ఈ టోర్నీలో భాగంగా క్వార్టర్-ఫైనల్ మ్యాచ్ ఆఫ్ఘనిస్థాన్‌తో నేడు ఆడాల్సి ఉంది. అయితే భారీ వర్షం కారణంగా టాస్ పడకుండానే ఈ మ్యాచ్ రద్దైంది. ఈ క్రమంలో ఐసీసీ ర్యాంకింగ్స్ ప్రకారం అత్యున్నత స్థాయిలో ఉన్న టీమ్ఇండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

Written By Harish Darla
Published: Sep 28, 2026, 12:44 PM IST | Updated: Sep 28, 2026, 12:48 PM IST
Join

Asian Games India Semis 2026: ఆసియా క్రీడల్లో భాగంగా భారత్, ఆఫ్ఘనిస్థాన్ జట్ల మధ్య నేడు అనగా సెప్టెంబరు 28న జరగాల్సిన రెండో క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ రద్దైంది. జపాన్‌లోని కరోగి స్పోర్ట్స్ పార్క్ వేదికగా జరగాల్సిన ఈ మ్యాచ్ ఎడతెరిపి లేని వర్షం కారణంగా అంపైర్లు టాస్ వేయకుండానే మ్యాచ్‌ను రద్దు చేశారు. అయితే ఈ మ్యాచ్‌ డ్రా గా ముగియడం వల్ల క్వార్టర్ ఫైనల్ బరిలో ఉన్న భారత జట్టు.. అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ర్యాంకింగ్స్‌ ప్రకారం ఆఫ్ఘనిస్థాన్‌తో పోలిస్తే ముందంజలో ఉండడం వల్ల టీమ్ఇండియా సెమీఫైనల్‌కు అర్హత సాధించింది.

ఆసియా గేమ్స్ టోర్నీ నిబంధనల ప్రకారం వర్షం వల్ల మ్యాచ్ రద్దయితే ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో మెరుగైన స్థానంలో ఉన్న జట్టు తర్వాతి దశకు అర్హత సాధిస్తుందని అందులో పొందుపరిచింది. అయితే ప్రస్తుతం ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌ ప్రకారం.. భారత జట్టు నంబర్ 1 స్థానంలో ఉండగా, ఆఫ్ఘనిస్థాన్ 10వ స్థానంలో ఉంది. దీంతో ఈ ర్యాంకింగ్స్ వ్యత్యాసం కారణంగా టీమ్ఇండియా సెమీస్ బెర్తును ఖరారు చేసుకుంది.

పాకిస్థాన్‌కు కలిసొచ్చిన ర్యాంకింగ్స్..
అలాగే ఆసియా గేమ్స్‌లో నేటి ఉదయం 5:30 గంటలకు జరగాల్సిన పాకిస్థాన్, హాంకాంగ్ తొలి క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ కూడా వర్షం కారణం గానే రద్దయింది. దీంతో ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం.. పాక్ జట్టు 6వ స్థానంలో ఉండగా.. హాంకాంగ్ జట్టు 24వ స్థానంలో ఉంది. దీంతో మెరుగైన స్థానంలో పాకిస్థాన్ జట్టు ఉన్న కారణంగా ఆ జట్టు టోర్నీ సెమీ ఫైనల్‌కు అర్హత సాధించింది.

ఆసియా గేమ్స్ సెమీఫైనల్స్, ఫైనల్ షెడ్యూల్..
ఆసియా గేమ్స్‌లో భాగంగా భారత జట్టు అక్టోబరు 1న తమ సెమీ ఫైనల్ మ్యాచ్ ఆడనుంది. టోర్నీలో శ్రీలంక, నేపాల్ జట్ల మధ్య జరిగే మూడో క్వార్టర్ ఫైనల్‌లో గెలిచే విజేత జట్టుతో భారత జట్టు తలపడనుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం అక్టోబరు 1, గురువారం తెల్లవారుజామున ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది.

మరోవైపు పాకిస్థాన్ జట్టు తాము ఆడబోయే సెమీఫైనల్ మ్యాచ్ బంగ్లాదేశ్ లేదా మలేషియా జట్లలో ఏదో ఒక టీమ్‌తో పోటీపడుతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్, మలేషియా జట్ల మధ్య క్వార్టర్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. అందులో గెలిచిన టీమ్ సెమీఫైనల్లో పాకిస్థాన్‌తో తలపడుతుంది. అలాగే ఆసియా గేమ్స్‌కు చెందిన క్రికెట్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లు సెప్టెంబరు 29న కూడా జరుగుతాయి. అక్టోబరు 1న టోర్నీ సెమీఫైనల్స్ జరగనుండగా.. అక్టోబరు 3న కాంస్య పతకం కోసం జరిగే మ్యాచ్ అనగా సెమీఫైనల్లో ఓడిన రెండు జట్లు మూడో పతకం కోసం ఆడే మ్యాచ్ జరగనుంది. అదే రోజున ఆసియా గేమ్స్ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. 

Also Read: Team India Bullet Train: జపాన్ బుల్లెట్ ట్రైన్‌లోని టీమ్ఇండియా ఆటగాళ్ల సందడి..ఆసియా గేమ్స్‌ కోసం హీరోల్లా బయల్దేరారు!

Also Read; India Vs Iran Kabaddi: ఆసియా గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం..కబడ్డీలో దుమ్ములేపిన పురుషుల టీమ్!

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.

ZEENEWS TRENDING STORIES