DVC Executive Trainee Recruitment 2026: దామోదర్ వ్యాలీ కార్పొరేషన్ అనే సంస్థను 1948 జూలై 7న స్థాపించారు. దేశంలో విద్యుత్ ఉత్పత్తి, నీటి నిర్వహణ, వరదల నియంత్రణ, సాగునీటి సరఫరా వంటి కీలక బాధ్యతలను ఈ సంస్థ నిర్వహిస్తుంది. అయితే, డీవీసీ ప్రస్తుతం ఎగ్జిక్యూటివ్ పోస్టులకు భర్తీకి శ్రీకారం చుట్టింది. మొత్తం 108 ఖాళీలను భర్తీ చేయనుంది. గేట్ స్కోర్ కార్డు 2025 ఆధారంగా భర్తీ చేయనున్నారు. 2026 నవంబర్ 6 నుంచి దరఖాస్తుల స్వీకరణ మొదలైంది. www.dvc.gov.in ఆసక్తి ఉన్న అభ్యర్థులు నోటిఫికేషన్ క్షుణ్నంగా చదివి దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ డీవీసీ స్పెషల్ రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు ఏడాదిపాటు ప్రొబేషన్ ఉంటుంది.
అప్లికేషన్ ప్రక్రియ కేవలం ఆన్‌లైన్‌లో మాత్రమే. బీఈ, బీటెక్ లేదా తత్సమాన ఇంజినీరింగ్ చేసిన అభ్యర్థులు అర్హులు. డాక్యుమెంట్ వెరిఫికేషన్‌కు గేట్ స్కోర్ తప్పనిసరి. పే స్కేల్ రూ.56,100 నుంచి 1,77,500 వరకు ఉంటుంది. దరఖాస్తు చివరి తేదీ డిసెంబర్ 6. ఈ ఖాళీలలో ఎక్కువగా ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ ఆ తర్వాత సివిల్ ఇంజినీరింగ్ విభాగాల్లో ఉన్నాయి. గుర్తింపు పొందిన యూనిశర్శిటీ నుంచి పట్టా పొంది ఉండాలి.
వయో పరిమితి..
ఇక ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలంటే వయో పరిమితి గరిష్టంగా 29 ఏళ్లు ఉండాలి. ఓబీసీ మూడేళ్ల వయోపరిమితి సడలింపు, ఎస్సీ, ఎస్టీ ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ పదేళ్ల సడలింపు ఉంది.
ఇక ఈ డీవీసీ రిక్రూట్మెంట్‌కు అప్లికేషన్ ఫీజు కూడా చెల్లించాల్సి ఉంటుంది. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ రూ.300 ఇతరులు ఎలాంటి ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు. ఇది నాన్ రిఫండబుల్. ఎలాంటి రాత పరీక్ష లేకుండా కేవలం గేట్ స్కోర్ కార్డు ఆధారంగానే ఎంపిక ఉంటుంది. డాక్యుమెంట్ వెరిఫికేషన్ కూడా చేసిన తర్వాత అభ్యర్థులను ఎంపిక చేస్తారు.