• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Sandeep Patil: అభిషేక్, వైభవ్‌ మరింత రాటుదేలాలి.. ఇది సరిపోదు

Sandeep Patil: అభిషేక్, వైభవ్‌ మరింత రాటుదేలాలి.. ఇది సరిపోదు

Sandeep Patil Hot Comments On Abhishek Sharma And Vaibhav Suryavanshi: సత్తా చాటుతున్న యువ బ్యాటర్లపై మాజీ క్రికెటర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇంకా రాటుదేలాలని.. ఇది సరిపోదని అభిషేక్‌ శర్మ, వైభవ్‌ సూర్యవంశీ విషయమై మాజీ క్రికెటర్‌ సందీప్‌ పాటిల్‌ వ్యాఖ్యలు చేశారు. మరింత మెరుగవ్వాలని సూచించారు.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 21, 2026, 05:07 PM IST|Updated: Sep 21, 2026, 05:11 PM IST
joinshare
Sandeep Patil: అభిషేక్, వైభవ్‌ మరింత రాటుదేలాలి.. ఇది సరిపోదు
Image Credit: Abhishek And Vaibhav

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Vaibhav Suryavanshi: భారత క్రికెట్‌లో సంచలన ప్రదర్శనలు చేస్తున్న యువ బ్యాటర్‌ అభిషేక్‌ శర్మతోపాటు వర్ధమాన క్రికెటర్‌ వైభవ్‌ సూర్యవంశీ ఆటను మరింత మెరుగుపరుచుకోవాలనే వాదన వినిపిస్తోంది. తాజాగా ఇదే విషయాన్ని భారత మాజీ ఆల్‌రౌండర్ సందీప్ పాటిల్ చెప్పారు. ధనాధన్‌ ఇన్నింగ్స్‌తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్న ఈ ఆటగాళ్లు అభిషేక్ శర్మ, వైభవ్ సూర్యవంశీలు ఇద్దరూ కూడా విదేశీ పరిస్థితులపై మరింత రాణించాలని తెలిపారు.

అభిషేక్‌, వైభవ్‌ ఇద్దరిలోనూ అద్భుతమైన ప్రతిభ.. భారీ షాట్లు ఆడే సామర్థ్యం ఉన్నాయని పేర్కొన్న సందీప్‌ పాటిల్‌ విదేశాల్లో తమ ఆటపై దృష్టి సారించాలని మాత్రం సూచించారు. మరింత మెరుగుపర్చుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. స్వదేశంలో బాల్‌ను ఎదుర్కొనే సమయంలో వారిద్దరూ దూకుడుగా కనిపిస్తున్నారని.. అయితే స్వింగ్ అవుతున్నప్పుడు మాత్రం ఇద్దరూ కొంత ఇబ్బంది పడుతున్నట్లు కనిపించిందని సందీప్‌ పాటిల్‌ వెల్లడించారు.

వైభవ్‌, అభిషేక్‌ ఇటీవల ఇంగ్లాండ్ పర్యటన చేపట్టగా.. అక్కడ ఈ విషయం స్పష్టంగా కనిపించిందని సందీప్‌ పాటిల్‌ తెలిపారు. విదేశీ పిచ్‌లపై పరిస్థితులకు అనుగుణంగా బ్యాటింగ్ శైలిని మార్చుకోవడం యువ ఆటగాళ్లకు చాలా ముఖ్యమని.. వైభవ్‌, అభిషేక్‌కు కూడా అదే వర్తిస్తుందని చెప్పారు. ఇంగ్లాండ్‌ సిరీస్‌లో అభిషేక్ నుంచి అలాంటి ఇన్నింగ్స్ రావడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని సందీప్‌ పాటిల్ తెలిపారు.

కొత్త తరహా క్రికెట్‌లో యువ బ్యాటర్లకు తొలి బాల్‌ నుంచే సహజమైన దూకుడుతో ఆడే స్వేచ్ఛ లభిస్తోందని సందీప్‌ పాటిల్ చెప్పారు. ఈ అవకాశాన్ని అభిషేక్, వైభవ్ చక్కగా ఉపయోగించుకుంటున్నారని.. ఇద్దరిలోనూ శక్తి, నైపుణ్యం, భారీ షాట్లు ఆడే సామర్థ్యం పుష్కలంగా ఉన్నాయని ప్రశంసలు కురిపించారు. విదేశీ పర్యటనల్లో అదే స్థాయిలో ప్రభావం చూపాలంటే తమ ఆటలో కొన్ని అంశాలు మెరుగుపర్చుకోవాల్సి ఉందని సందీప్‌ పాటిల్ తెలిపారు. స్వింగ్ అవుతున్న బాల్స్‌ను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో మరింత పట్టు సాధించాలని.. అది చేస్తే అభిషేక్‌, వైభవ్‌ ఇద్దరూ కూడా మరింత పరిపూర్ణంగా ఆడే అవకాశం ఉందని సందీప్‌ పాటిల్‌ పేర్కొన్నారు.

అభిషేక్ నుంచి ఇలాంటి ఇన్నింగ్స్ రావడం తనకు ఆశ్చర్యం కలిగించలేదని పాటిల్ పేర్కొన్నారు. ఆధునిక క్రికెట్‌లో యువ బ్యాటర్లకు తొలి బంతి నుంచే సహజమైన దూకుడుతో ఆడే స్వేచ్ఛ లభిస్తోందని పాటిల్ అన్నారు. అభిషేక్, వైభవ్ ఆ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకుంటున్నారని ప్రశంసించారు. ఇద్దరిలోనూ శక్తి, నైపుణ్యం, భారీ షాట్లు ఆడే సామర్థ్యం పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.అయితే విదేశీ పర్యటనల్లో పరిస్థితులు మారినప్పుడు కూడా అదే స్థాయిలో ప్రభావం చూపాలంటే తమ ఆటలో కొన్ని అంశాలను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుందని పాటిల్ సూచించారు. ముఖ్యంగా స్వింగ్ అవుతున్న బంతులను సమర్థంగా ఎదుర్కొనే విషయంలో మరింత పట్టు సాధిస్తే.. ఈ ఇద్దరు యువ బ్యాటర్ల ఆట మరింత పరిపూర్ణంగా మారే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

ఇంగ్లండ్‌ టీ20 సిరీస్‌లో అభిషేక్‌, వైభవ్‌ ప్రదర్శన
అభిషేక్ శర్మ: ఐదు మ్యాచ్‌లు ఆడి 131 పరుగులు
వైభవ్ సూర్యవంశీ: అంతర్జాతీయ టీ20ల్లో అరంగేట్రం చేసి మూడు మ్యాచ్‌ల్లో 42 పరుగులు

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket