ICC Tournaments: క్రీడాప్రియులకు అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) శుభవార్త వినిపించింది. భవిష్యత్‌లో జరగాల్సిన ప్రధాన క్రికెట్ టోర్నమెంట్లకు సంబంధించి ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. క్రికెట్ టోర్నీలకు సంబంధించి పూర్తి షెడ్యూల్‌ను ఐసీసీ అధికారికంగా ప్రకటించింది. 2035 వరకు జరగాల్సిన ప్రధాన ఈవెంట్లకు సంబంధించిన క్యాలెండర్‌ను ఐసీసీ విడుదల చేసింది. వాటిలో టీ20 ప్రపంచకప్, వన్డే ప్రపంచకప్, చాంపియన్స్ ట్రోఫీ తదితర క్రీడా ఈవెంట్ల షెడ్యూల్ ఇలా ఉంది.
2027 నుంచి 2035 వరకు జరగనున్న పురుషుల ఐసీసీ టోర్నీల తేదీలు, ఆతిథ్య దేశాలను ఐసీసీ ఖరారు చేసింది. 2027లో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్, వన్డే ప్రపంచ కప్, టీ20 ప్రపంచకప్ తదితర ఈవెంట్లకు సంబంధించి ఐసీసీ షెడ్యూల్ విడుదల చేసింది. 2035 వరకు మొత్తం 12 ఐసీసీ ప్రధాన టోర్నీమెంట్లు నిర్వహించనున్నట్లు ఐసీసీ ప్రకటించింది. ఇప్పటివరకు 2031 వరకు జరగాల్సిన టోర్నీల తేదీలు, వేదికలను ఐసీసీ ఆమోదం తెలిపింది.
కీలక టోర్నీలు ఇవే!
2027: పురుషుల వన్డే ప్రపంచకప్ (దక్షిణాఫ్రికా)
2028: జూన్‌లో టీ20 ప్రపంచకప్ (ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ సంయుక్తంగా)
2028: ఛాంపియన్స్ ట్రోఫీ. అక్టోబర్‌లో నిర్వహణ
2029: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (డబ్ల్యూటీసీ) ఫైనల్ (ఇంగ్లండ్). జూన్‌లో జరుగుతుంది.
2029: టీ20 ప్రపంచకప్ (భారత్, శ్రీలంక సంయుక్తంగా). అక్టోబర్‌లో జరిగే అవకాశం.
2030: ఛాంపియన్స్ ట్రోఫీ (పాకిస్తాన్). ఫిబ్రవరి నిర్వహించే అవకాశం.
2030: టీ20 ప్రపంచకప్ (యూకే). జూన్‌లో నిర్వహణకు అవకాశం
2031: వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ (ఇంగ్లండ్). జూన్‌లో నిర్వహించే ఛాన్స్
2031: వన్డే ప్రపంచకప్ (భారత్, బంగ్లాదేశ్ సంయుక్తంగా). అక్టోబర్-నవంబర్ నెలల్లో జరిగే అవకాశం