Ind Vs Pak Final Highlights: హైవోల్టేజ్ పోరులో పాక్‌పై విక్టరీ.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
India vs Pakistan Asian Games Final Highlights: ఆసియా గేమ్స్‌లో భారత్ మరో గోల్డ్ మెడల్ సాధించింది. హైవోల్టేజ్ ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో మట్టికరిపించిన టీమిండియా.. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ ముద్దాడింది. మొదట బ్యాటర్ల విధ్వంసంతో 211 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్.. అనంతరం పాక్‌ను 192 పరుగులకే కట్టడి చేసి విజేతగా నిలిచింది.
India vs Pakistan Asian Games Final Highlights: ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్ పోరులో పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. డిఫెండింగ్ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. పాక్‌పై అద్భుత విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో భారత్ 19 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. భారత్ వరుసగా రెండో ఏడాది గోల్డ్ మెడల్ సొంతం చేసుకోగా.. రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్ రజతం పతకంతో సరిపెట్టుకుంది.
ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (15) రెండు సిక్సర్లు బాది జోరు మీద కనిపించినా.. అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (2) విఫలమయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 61, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (21), ఇషాన్ కిషన్ (20) పర్వాలేదనిపించగా.. ఆఖర్లో తిలక్ వర్మ చెలరేగి ఆడాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. శివం దుబే (15 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ స్కోరు బోర్డు 20 ఓవర్లలో 211 పరుగులు చేరింది.
అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను ఆరంభంలో భారత బౌలర్లు దెబ్బ తీశారు. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే హసన్ నవాజ్, సామ్ అయూబ్ ఇద్దరు బౌలర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. హసన్ నవాజ్ (51 బంతుల్లో 96) చివరికి వరకు క్రీజ్‌లో ఉండి పోరాడాడు. 18 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన దశలో వాషింగ్టన్ సుందర్, బుమ్రా రెండు ఓవర్లు వరుసగా 8, 11 పరుగులు ఇవ్వడంతో భారత్ విజయం ఖాయమైంది. చివరి ఓవర్ వేసిన శివమ్ దుబే 13 పరుగులు ఇచ్చి.. ఆఖరి బంతికి నవాజ్‌ను ఔట్ చేశాడు. దీంతో పాక్ స్కోర్ 192 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, దుబే తలో రెండు వికెట్లు తీశారు.
ఆసియా గేమ్స్‌లో మహిళల టీమ్ కూడా స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పురుషుల జట్టు కూడా పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించడంతో ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 19వ స్వర్ణ పతకం. మొత్తంగా 81వ పతకం.