SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

India vs West Indies 2nd ODI: విండీస్‌‌పై మరో పంజాకు భారత్ సిద్ధం.. రెండో వన్డేకు సెంచరీ హీరో దూరం..!

IND vs WI 2nd ODI Playing XI: విరాట్ కోహ్లీ, శుభ్‌మన్ గిల్ శతకాల జోరుతో తొలి వన్డేలో వెస్టిండీస్‌ను అలవోకగా ఓడించిన భారత్.. రెండో వన్డేలో అదే జోరును కంటిన్యూ చేసేందుకు సిద్ధమైంది. ఈ మ్యాచ్ లో గెలిస్తే.. సిరీస్ భారత్ సొంతమవుతుంది. టీమిండియా తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయబోతోంది..? పిచ్ ఎవరికి అనుకూలం..? పూర్తి వివరాలు ఇలా..

Written By Ashok Krindinti
Published: Sep 30, 2026, 11:47 AM IST | Updated: Sep 30, 2026, 11:50 AM IST
Image Credit: Ind Vs WI 2nd Odi (Source: AI)
Join

IND vs WI 2nd ODI Playing XI: తొలి వన్డేలో వెస్టిండీస్‌ను చిత్తు చేసిన భారత్.. రెండో వన్డేలోనూ విజయం సాధించి మరో మ్యాచ్‌ మిగిలి ఉండగానే సిరీస్‌ సొంతం చేసుకోవాలని చూస్తోంది. మొదటి మ్యాచ్‌లో విరాట్ కోహ్లీ, కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగడంతో 296 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయాసంగా ఛేదించింది. రోహిత్ శర్మ (32) పర్వాలేదనిపించాడు. బుధవారం గౌహతిలోని బార్సపరా క్రికెట్ స్టేడియం వేదికగా ఈ పోరు జరగనుంది. మరోవైపు సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే విండీస్‌కు ఈ మ్యాచ్ చావోరేవోగా మారింది. గత మ్యాచ్‌లో సెంచరీ హీరో జస్టిన్ గ్రీవ్స్ గాయంతో జట్టుకు దూరమవడం వెస్టిండీస్‌కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్‌గా జ్యువెల్ ఆండ్రూను.. మిడిల్ ఆర్డర్‌ను బలోపేతం చేయడానికి షెర్ఫేన్ రూథర్‌ఫోర్డ్‌ను జట్టులోకి తీసుకునే అవకాశం ఉంది.

భారత్‌ జట్టు తుది జట్టులోకి మహమ్మద్ సిరాజ్ తిరిగి వచ్చే అవకాశం ఉంది. మొదటి మ్యాచ్‌లో తొలి పవర్‌ప్లేలోనే భారత బౌలర్లు తేలిపోయారు. ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్‌ను విండీస్ బ్యాటర్లు అలవోకగా ఎదుర్కొని పరుగులు సాధించారు. విండీస్ తొలి 10 ఓవర్లలో 85 పరుగులు చేయగా.. భారత బౌలర్లు ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు. దీంతో ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ సిరాజ్ రెండో వన్డేలో తిరిగి జట్టులోకి వచ్చే ఛాన్స్ ఉంది. గుర్నూర్ బ్రార్ తుది జట్టులో కొనసాగిస్తే.. నమన్ ధీర్ లేదా నితీష్ కుమార్ రెడ్డికి జట్టు నుంచి తప్పించాల్సి రావచ్చు.

బార్సపరా స్టేడియం పిచ్ సాధారణంగా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటుంది. ఇక్కడ భారీ స్కోర్లకు వేదిక. మ్యాచ్ సాగుతున్న కొద్దీ డ్యూ ఉండే అవకాశం ఉండటంతో టాస్ గెలిచిన జట్టు మొదట బౌలింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. ఈ మ్యాచ్‌లో గెలిచి ట్రోఫీని ఖాయం చేసుకోవాలని భారత్ చూస్తుండగా.. సిరీస్‌‌ను 1-1తో నిలపాలని విండీస్ ఎదురుచూస్తోంది. రెండో వన్డేలోనూ బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అదే నిలకడైన ప్రదర్శనను పునరావృతం చేయడమే కాకుండా.. మిడిల్ ఆర్డర్, బెంచ్ బలాన్ని కూడా పరీక్షించాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తోంది.

తుది జట్లు ఇలా.. (అంచనా)

భారత్: రోహిత్ శర్మ, శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, రుతురాజ్ గైక్వాడ్, కేఎల్ రాహుల్ (వికెట్ కీపర్), నితీశ్ కుమార్ రెడ్డి/నమన్ ధీర్, రవీంద్ర జడేజా, కుల్‌దీప్ యాదవ్, గుర్నూర్ బ్రార్, ప్రసిద్ కృష్ణ, మహమ్మద్ సిరాజ్

వెస్టిండీస్: జువెల్ ఆండ్రూ, జాన్ క్యాంప్‌బెల్, కీసీ కార్టీ, షై హోప్ (కెప్టెన్, వికెట్ కీపర్), రోస్టన్ చేజ్, రూథర్‌ఫోర్డ్, అమీర్ జంగూ, మాథ్యూ ఫోర్డ్, గుడకేష్ మోతీ/విటెల్ లావెస్, జేడెన్ సీల్స్, అల్జారీ జోసెఫ్.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES