SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

India Vs New Zealand Highlights: టీమిండియా చెత్త బ్యాటింగ్.. మొదటి ఓవర్లోనే ముగ్గురు డకౌట్..!

India vs New Zealand 4th ODI Highlights: న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేలో టీమిండియా పీకల్లోతు కష్టాల్లో పడింది. 334 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌.. తొలి ఓవర్లోనే మూడు వికెట్లు కోల్పోయింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్ ముగ్గురూ పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరారు.

Written By Ashok Krindinti
Published: Nov 13, 2026, 12:11 PM IST | Updated: Nov 13, 2026, 12:27 PM IST
Image Credit: India vs New Zealand 4th ODI Highlights (Source: X/Cricbuzz)
Join

India vs New Zealand 4th ODI Highlights: కివీస్‌తో జరుగుతున్న నాలుగో వన్డేలో టీమిండియా చెత్త రికార్డు నమోదు చేసింది. ఒకే ఓవర్లో ముగ్గురు బ్యాట్స్‌మెన్లు డకౌట్‌గా వెనుదిరిగారు. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. నిర్ణీత 50 ఓవర్లలో 333 పరుగులకు ఆలౌట్ అయింది. అనంతరం 334 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు తొలి ఓవర్‌లోనే ఊహించని షాక్ తగిలింది. ఏకంగా ముగ్గురు బ్యాట్స్‌మెన్లు డకౌట్ అయ్యారు. మ్యాట్‌ హెన్నీ వేసిన మొదటి ఓవర్ తొలి బంతికి హిట్‌మ్యాన్ రోహిత్ శర్మ (0) స్లిప్‌లో క్యాచ్‌ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఆ తరువాత ఇన్నింగ్స్ ఐదో బాల్‌కు విరాట్ కోహ్లీ (0)ని క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఆఖరి బంతికి కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (0) ఎల్బీడబ్ల్యూ రూపంలో పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. దీంతో భారత్ సున్నాకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

మౌంట్ మాంగనూయ్‌లోని బే ఓవల్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన భారత్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ బౌలింగ్ ఎంచుకున్నాడు. మొదట బ్యాటింగ్ ఆరంభించిన న్యూజిలాండ్‌కు ఓపెనర్లు విల్ యంగ్, సీఫర్ట్ చక్కటి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరు భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటూ పరుగులు రాబట్టారు. ఆరంభంలోనే విల్ యంగ్ ఇచ్చిన రెండుసార్లు క్యాచ్‌లు జారవిడవడంతో వచ్చిన అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకున్నాడు. ఈ క్రమంలో తన వన్డే కెరీర్‌లో ఐదో సెంచరీ (125)ని నమోదు చేశాడు. భారత్‌పై అతడికి ఇదే తొలి వన్డే శతకం కావడం విశేషం. మరో ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 48 బంతుల్లో 58 పరుగులతో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 85 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఫిన్ అలెన్ 30 బంతుల్లో 41 పరుగులు చేసి స్కోరు వేగాన్ని పెంచాడు. విల్ యంగ్, అలెన్ కలిసి నాలుగో వికెట్‌కు 90 పరుగులు జోడించారు.

ఒక దశలో న్యూజిలాండ్ స్కోరు 350 పరుగులు దాటేలా కనిపించింది. 37 ఓవర్లకు కివీస్ 256 పరుగులు చేసింది. అయితే ఆ తర్వాత భారత బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగుల వేగం తగ్గింది. చివరి 13 ఓవర్లలో న్యూజిలాండ్ కేవలం 77 పరుగులే చేయగలిగింది. టీమిండియా బౌలర్లలో అక్షర్ పటేల్ 10 ఓవర్లలో 39 పరుగులు మాత్రమే ఇచ్చి రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, ఔకిబ్ నబీ, గుర్నూర్ బ్రార్ కూడా తలో వికెట్ తీశారు. కివీస్ టూర్‌లో తొలి మ్యాచ్ ఆడే అవకాశం దక్కించుకున్న కుల్దీప్ యాదవ్ మాత్రం భారీగా పరుగులు సమర్పించుకున్నాడు.

సున్నాకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత్‌కు జెమీసన్‌ మరో షాకిచ్చాడు. ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్ (5)ను ఔట్ చేసి కోలుకోలేని దెబ్బ తీశాడు. దీంతో భారత్ నాలుగో వికెట్ కూడా కోల్పోయింది. 8 ఓవర్లలో భారత్ స్కోర్ 13 పరుగులుగా ఉంది. ప్రస్తుతం క్రీజ్‌లో ఇషాన్ కిషన్, అక్షర్ పటేల్ ఉన్నాడు. భారత్ ఈ మ్యాచ్‌లో గెలవాలంటే అద్భుతం జరగాల్సిందే.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES