• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Virat Kohli: స్వామిజీ ఆశ్రమంతో రూ.5 కోట్ల పంచాయితీ.. విరాట్‌ కోహ్లీ టీమ్‌ ఏం చెప్పిందంటే?

Virat Kohli: స్వామిజీ ఆశ్రమంతో రూ.5 కోట్ల పంచాయితీ.. విరాట్‌ కోహ్లీ టీమ్‌ ఏం చెప్పిందంటే?

Virat Kohli Rs 5 Crores Took For Ashram Visit Here Is Fact Check: ఆశ్రమాన్ని సందర్శించడంతో స్వామిజీ నుంచి రూ.5 కోట్లు పొందారని తీవ్ర ఆరోపణలు రావడంతో భారత క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ టీమ్‌ స్పందించింది. ఆశ్రమాన్ని సందర్శన కోసం కోహ్లీ డబ్బులు తీసుకున్నారనే ఆరోపణలను ఖండించింది. ఈ సందర్భంగా కీలక ప్రకటన విడుదల చేసింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.

Written By Ravi Kumar Sargam
Published: Oct 07, 2026, 07:27 PM IST|Updated: Oct 07, 2026, 07:32 PM IST
joinshare
Virat Kohli: స్వామిజీ ఆశ్రమంతో రూ.5 కోట్ల పంచాయితీ.. విరాట్‌ కోహ్లీ టీమ్‌ ఏం చెప్పిందంటే?
Image Credit: Virat Kohli Ashram Visit Dispute

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Jayalalitha: బిడ్డ పుడితే ఇబ్బందులు వస్తాయని భయపడ్డారా.. శరత్ బాబు గురించి జయలలిత సంచలన వ్యాఖ్యలు

Jayalalitha: బిడ్డ పుడితే ఇబ్బందులు వస్తాయని భయపడ్డారా.. శరత్ బాబు గురించి జయలలిత సంచలన వ్యాఖ్యలు

2

World End: నవంబర్ 13న ప్రపంచం అంతమవుతుందా.. వైరల్ అవుతున్న పాత రీసెర్చ్..

3

Dakota Johnson: పడకగదిలో కొందరు దారుణంగా బిహేవ్ చేసేవారు.. స్టార్ హీరోయిన్ బోల్డ్ కామెంట్స్..!

4

Prabhas Fauzi: ఫౌజీ నుంచి 3 నిమిషాల టీజర్.. ప్రభాస్ ఫ్యాన్స్‌కు పండగే!

5

Bigg Boss Telugu Wild Card Entry: ఈ వారం బిగ్‌బాస్‌లో డబుల్ ఎలిమినేషన్..హౌస్‌లోకి వైల్డ్ కార్డ్ ఎంట్రీలు..లిస్ట్ వచ్చేసింది!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Kohli Ashram Visit: ఓ స్వామిజీ ఆశ్రమాన్ని భారత స్టార్ క్రికెట‌ర్ విరాట్ కోహ్లి తన భార్య అనుష్క శ‌ర్మతో కలిసి సందర్శించగా.. ఇప్పుడు అది వివాదంగా మారింది. కోహ్లీ స్వామిజీ ఆశ్రమాన్ని సందర్శించడం కోసం కోహ్లీ దంపతులు భారీగా డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు రావడం కలకలం రేపింది. ఆశ్రమం గుర్తింపు కోసం ఓ స్వామిజీ కోహ్లీకి రూ.5 కోట్లు డబ్బులు ఇచ్చారని ఆరోపణలు రావడం వివాదాస్పదంగా మారింది. ఈ వ్యవహారం తీవ్ర దుమారం రేపడంతో ఎట్టకేలకు కోహ్లీ బృందం స్పందించింది. కోహ్లీ రూ.5 కోట్లు తీసుకున్నారనే ఆరోపణలను ఖండించింది. ఈ సందర్భంగా కోహ్లీ టీమ్‌ కీలక ప్రకటన చేసింది.

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని బృందావ‌న్‌లోని రాధా కేలీ కుంజ్ ప్రేమానంద్‌ మహారాజ్ ఆశ్ర‌మాన్ని ఇటీవల విరాట్‌ కోహ్లీ తన భార్య అనుష్క శర్మతో కలిసి సందర్శించారు. అక్కడ స్వామిజీని కలిసి ఆశీర్వాదం పొందారు. దానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరల్‌గా మారాయి. అయితే కోహ్లీ ప్రేమానంద్‌ మహారాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించడంపై  శ్రీ కృష్ణ జన్మభూమి సంఘర్ష్ న్యాస్ అధ్యక్షుడు ఫలహరి మహారాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు. ఆశ్ర‌మానికి ప్రజాదరణను పెంచే ప్రయత్నాలలో భాగంగా కోహ్లీని డబ్బులు పెట్టి మరి ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమానికి తీసుకువచ్చాడని ఆరోపించారు. దీనికోసం విరాట్‌ కోహ్లీకి రూ.5 కోట్లు చెల్లించారని ఫలహరి మహారాజ్ ఆరోపణలు చేయడం కలకలం రేపింది.

🚨 Virat Kohli Denied ₹5 Crore Offer Just to Visit Premanand Maharaj’s Ashram? 🚨 Virat Kohli’s spokesperson has strongly denied the claims made by Falhari Maharaj Dinesh Sharma, calling them “completely false, baseless and factually incorrect. The statement makes it clear that Virat Kohli never took ₹5 crore for visiting Premanand Maharaj Ji’s ashram. He visits Maharaj Ji purely out of his deep faith and reverence. The spokesperson also urged the media to verify facts before reporting or amplifying such claims. It is now clear that all this fake news was being circulated just to damage the reputation of Virat Kohli and Anushka Sharma. Thank you to Virat Kohli for responding to and addressing these false claims. 🙏

— Central Cricket (@arshdeep3444) October 7, 2026

డబ్బులు తీసుకుని విరాట్‌ కోహ్లీ దంపతులు ఆశ్రమాన్ని సందర్శించడంతో పెద్ద ఎత్తున వివాదం రేగింది. సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపగా ఈ విషయం కోహ్లీ దృష్టికి వెళ్లింది. ఈ ఆరోపణలను ఖండిస్తూ కోహ్లి టీమ్‌ ఖండిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. ‘డబ్బులు తీసుకుని ఆశ్రమాన్ని సందర్శించారని చేసిన వాదన పూర్తిగా అబద్ధం, నిరాధారం' అని కోహ్లీ టీమ్‌ స్పష్టం చేసింది. 'రూ.5 కోట్లు తీసుకుని ఆశ్రమాన్ని సందర్శించారని ఆరోపణలు చేయడం ఇది పరువుకు నష్టం కలిగించేది' అని కోహ్లీ టీమ్‌ తెలిపింది.

'విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ కేవలం తమ సొంత విశ్వాసం, భక్తితోనే ప్రేమానంద్ మహారాజ్ దర్శనం కోసం బృందావన్‌కు వెళ్తుంటారు. ఈ పర్యటనలో ఎలాంటి డబ్బు లావాదేవీలు జరగలేదు. ఈ వదంతులు వ్యాప్తి చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం’ అని కోహ్లీ టీమ్‌ హెచ్చరిక జారీ చేశారు. ఇలాంటి నిరాధార వార్తలు లేదా ప్రచారం వ్యాప్తి చేసే ముందు వాస్తవాలను చూసుకోవాలని కోహ్లీ ప్ర‌తినిధి బృందం సూచించింది.

కోహ్లి, అనుష్క శర్మ దంపతులు బృందావనంలోని ప్రేమానంద్ మహారాజ్ ఆశ్రమాన్ని నిత్యం సదర్శిస్తుంటారని కోహ్లీ టీమ్‌ వివరించింది. తొలిసారిగా 2023 జనవరిలో కుమార్తె వామికతో కలిసి కోహ్లీ దంపతులు ఆశ్రమాన్ని సందర్శించి మహారాజ్ ఆశీస్సులు పొందారని గుర్తుచేసింది. టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించిన సమయంలో.. ఇతర సమయాల్లోనూ కోహ్లీ దంపతులు బృందావనంలో ప్రేమానంద్ మహారాజ్‌ ఆశ్రమాన్ని సందర్శించారని వెల్లడించింది. భక్తి, జీవిత మార్గంపై మహారాజ్‌ ఆశ్రమం కోహ్లీ దంపతులకు దిశానిర్దేశం చేస్తుందని.. తాము చేసే పనులను భగవంతుడి సేవగా భావించాలని, నిరంతరం వినయాన్ని పెంపొందించుకోవాలని సూచిస్తుందని విరాట్‌ కోహ్లీ టీమ్‌ వివరణ ఇచ్చింది. ఈ ప్రకటనతో డబ్బులు తీసుకుని కోహ్లీ ఆశ్రమాన్ని సందర్శిస్తారనే వివాదానికి ముగింపు పడినట్టు అయ్యింది.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Sports News
Telugu News
Trending News