SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Hardik Pandya: 'నా కెప్టెన్ శ్రేయస్.. నా టీమ్ పంజాబ్..' హార్దిక్ పాండ్యా ఫస్ట్ రియాక్షన్..!

Hardik Pandya Instagram Post: ముంబై ఇండియన్స్‌ను వీడి పంజాబ్ కింగ్స్ జట్టులో చేరిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా.. ఇన్‌స్టాగ్రామ్‌లో తొలిసారి స్పందించాడు. శ్రేయస్ అయ్యర్‌ను తన కెప్టెన్‌గా పేర్కొంటూ.. తన టీమ్ పంజాబ్ అని రాసుకొచ్చాడు.

Written By Ashok Krindinti
Published: Nov 11, 2026, 05:28 PM IST | Updated: Nov 11, 2026, 05:30 PM IST
Image Credit: Hardik Pandya Instagram Post
Join

Hardik Pandya Instagram Post: IPL 2027 సీజన్‌కు ముందు ముంబై ఇండియన్స్, పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీలు సంచలన ట్రేడింగ్ డీల్‌ను కంప్లీట్ చేసిన విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా పంజాబ్ కింగ్స్‌కు వెళ్లగా.. పంజాబ్ జట్టు స్టార్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ ముంబై ఇండియన్స్‌లో చేరాడు. ఈ ఇద్దరు ప్లేయర్ల ట్రేడింగ్‌ను బుధవారం ఐపీఎల్ అధికారికంగా ధ్రువీకరించింది. ఈ ట్రేడింగ్‌లో హార్దిక్ పాండ్యా రూ.18 కోట్ల ధరతో పంజాబ్ జట్టులోకి వెళ్లాడు. గత సీజన్‌లో ముంబై తరఫున అతడి కాంట్రాక్ట్ విలువ రూ.16.35 కోట్లు కాగా.. ఇప్పుడు రూ.18 కోట్లకు పెరిగింది. అర్ష్‌దీప్ సింగ్ మాత్రం తన పాత రూ.18 కోట్ల ధరతోనే ముంబై జట్టుకు మారాడు. దీంతో రెండు జట్ల మధ్య కీలక ఆటగాళ్ల మార్పిడి పూర్తయింది.

ముంబై ఇండియన్స్‌ నుంచి పంజాబ్‌కు మారుతున్న పాండ్యా.. కెప్టెన్సీని కూడా వదులుకోనున్నాడు. గతంలో గుజరాత్ నుంచి ముంబైకు మారినప్పుడు కెప్టెన్సీ ఇస్తేనే జట్టులోకి వస్తాననే కండీషన్‌లో టీమ్‌లోకి వచ్చాడు. ఇప్పుడు పంజాబ్‌లోకి మాత్రం ప్లేయర్‌గానే వెళ్లనున్నాడు. పంజాబ్ కింగ్స్‌లో చేరిన తర్వాత హార్దిక్ పాండ్యా తొలిసారి రియాక్ట్ అయ్యాడు. పంజాబ్ జెర్సీలో ఉన్న తన పిక్‌ను షేర్ చేస్తూ.. 'నా కెప్టెన్ శ్రేయస్.. నా కోచ్ రిక్కీ.. నా టీమ్ పంజాబ్' అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ పోస్టుతో పంజాబ్ జట్టులో శ్రేయస్ అయ్యర్ కెప్టెన్సీలోనే ఆడేందుకు హార్దిక్ సిద్ధంగా ఉన్నట్లు స్పష్టమైన సంకేతాలు ఇచ్చాడు. దీంతో కెప్టెన్సీపై జరుగుతున్న చర్చకు కూడా పుల్‌స్టాప్ పెట్టేశాడు.

ఇప్పటికే శ్రేయస్ అయ్యర్ సారథ్యంలో పంజాబ్ కింగ్స్ బలమైన జట్టుగా మారింది. శ్రేయస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన తొలి సీజన్‌ (2025)లోనే ఫైనల్‌కు చేర్చాడు. ఇప్పుడు హార్దిక్ రాకతో జట్టుకు మరింత అనుభవం, ఆల్‌రౌండ్ బలం చేకూరనుంది. పాండ్యాకు వైస్ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించే అవకాశాలున్నాయనే చర్చ కూడా నడుస్తోంది. అయితే దీనిపై టీమ్ మేనేజ్‌మెంట్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

హార్దిక్ పాండ్యా చేసిన ఈ తొలి పోస్ట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. పంజాబ్ జెర్సీలో అతడిని చూసేందుకు అభిమానులు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. ఈ పోస్టుకు కేవలం మూడు గంటల్లోనే 30 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. ముంబైతో తన రెండో ప్రయాణానికి ముగింపు పలికిన హార్దిక్.. ఇప్పుడు పంజాబ్ తరఫున కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతున్నాడు. 
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ZEENEWS TRENDING STORIES