• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Lovlina Borgohain Asian Games: ఆసియా క్రీడలు బాక్సింగ్‌లో లవ్లీనాకు బంగారు పతకం..పుట్టినరోజు నాడే విజేతగా నిలిచింది!

Lovlina Borgohain Asian Games: ఆసియా క్రీడలు బాక్సింగ్‌లో లవ్లీనాకు బంగారు పతకం..పుట్టినరోజు నాడే విజేతగా నిలిచింది!

Lovlina Borgohain Asian Games Gold: భారత స్టార్ బాక్సర్ లవ్లీనా బోర్గోహైన్ ఆసియా క్రీడలు 2026లో మహిళల 75 కేజీల బాక్సింగ్ విభాగంలో స్వర్ణ పతకాన్ని సాధించారు. తన 29వ పుట్టినరోజు నాడే ఈ ఘనత సాధించడం విశేషం. ఫైనల్ పోరులో చైనాకు చెందిన బావో జియిపై 5 - 0 పాయింట్ల తేడాతో సంపూర్ణ ఆధిపత్యం ప్రదర్శించి విజయాన్ని అందుకున్నారు. దిగ్గజ బాక్సర్ మేరీ కోమ్ తర్వాత ఆసియా గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన రెండవ భారత మహిళగా చరిత్ర సృష్టించారు. ఈ పసిడితో భారత్ మొత్తం పతకాల సంఖ్య 70కి చేరగా, మరో ఇద్దరు భారత బాక్సర్లు అంకుశ్, పర్వీన్ హుడా కూడా ఫైనల్స్‌కు అర్హత సాధించారు.

Written ByHarish Darla
Published: Oct 02, 2026, 12:21 PM IST|Updated: Oct 02, 2026, 12:25 PM IST
joinshare
Lovlina Borgohain Asian Games: ఆసియా క్రీడలు బాక్సింగ్‌లో లవ్లీనాకు బంగారు పతకం..పుట్టినరోజు నాడే విజేతగా నిలిచింది!

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!

'నోషనల్ ఇంక్రిమెంట్' అంటే ఏంటి? జీతం పెరగకపోయినా ఇంక్రిమెంట్ వచ్చినట్టేనా?.. రూల్స్ ఇవే!

2

Jason Sanjay: దళపతి విజయ్‌కి, అమ్మ సంగీతకి ఉన్న తేడా చెప్పిన జాసన్ సంజయ్

3

OnePlus ఫోన్లపై రూ.24,000 వరకు భారీ డిస్కౌంట్.. త్వరలోనే సేల్‌లో అదిరిపోయే ఆఫర్లు!

4

Adoni New District Demand: ఆదోని ప్రత్యేక జిల్లా కోసం పోరాటం.. పల్లెపల్లెనా ఉద్యమ పోరు..!

5

లక్కీ డ్రాలో అదృష్టం వరించింది.. ఏకంగా 365 రోజుల పెయిడ్ లీవ్ గెలుచుకున్న ఉద్యోగి!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Lovlina Borgohain Asian Games Gold: అస్సాంలోని గోలాఘాట్ జిల్లా బరోముఖియా గ్రామానికి చెందిన లవ్లీనా బోర్గోహైన్ 1997 అక్టోబర్ 2న జన్మించారు. తన కవల సోదరీమణులను చూసి మొదట కిక్‌బాక్సింగ్‌లో శిక్షణ పొందిన ఆమె, 2012లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (SAI) నిర్వహించిన పాఠశాల ట్రయల్స్‌లో ప్రతిభ చాటి బాక్సింగ్‌‌ వైపు అడుగులు వేశారు. ఇప్పటికే టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం, కామన్వెల్త్ క్రీడల్లో రజతం, ప్రపంచ ఛాంపియన్‌షిప్‌‌లలో పతకాలు సాధించిన లవ్లీనా, తన కెరీర్‌లో మరో కీలక మైలురాయిని చేరుకున్నారు.

నిషియో జిమ్నాసియంలో జరిగిన 75 కేజీల ఫైనల్ పోరులో చైనాకు చెందిన బావో జియిని లవ్లీనా ఎదుర్కొన్నారు. తొలి రౌండ్‌ను 3-2తో దక్కించుకున్న లవ్లీనా, తదుపరి రౌండ్లలో పదునైన పంచ్‌లు విసురుతూ ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వలేదు. వ్యూహాత్మకంగా ఆడుతూ 5 - 0 పాయింట్ల తేడాతో ఏకపక్ష విజయం నమోదు చేశారు. నలుగురు జడ్జీలు 29 - 28 స్కోరుతో, ఒక జడ్జి 30 - 27 స్కోరుతో లవ్లీనాకు అనుకూలంగా తీర్పు ఇచ్చారు. 2014లో మేరీ కోమ్ తర్వాత ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన తొలి భారత మహిళా బాక్సర్‌గా లవ్లీనా నిలిచారు.

ఉత్కంఠభరిత ప్రయాణం..
ఈ టోర్నమెంట్‌లో లవ్లీనా ప్రయాణం అత్యంత కఠినంగా సాగింది. క్వార్టర్ ఫైనల్లో కొరియా బాక్సర్ సియోంగ్ సుయోన్‌పై 5 - 0తో సునాయాసంగా గెలిచినప్పటికీ, సెమీఫైనల్లో కజకిస్థాన్‌కు చెందిన నటాల్యా బొగ్డనోవాతో తీవ్రంగా పోరాడాల్సి వచ్చింది. ఆ ఉత్కంఠ పోరులో 3 - 2 స్ప్లిట్ డెసిషన్‌తో నెగ్గి ఫైనల్స్‌కు దూసుకెళ్లారు.

భారత్ పతకాల సంఖ్య 70..
ఈ పసిడి పతకంతో ఆసియా క్రీడల్లో భారత్ మొత్తం పతకాల సంఖ్య 70కి చేరింది. భారత్ ఖాతాలో 12 స్వర్ణాలు, 24 రజతాలు, 34 కాంస్య పతకాలు ఉన్నాయి. దీంతో భారత్ పతకాల పట్టికలో ఆరో స్థానంలో నిలిచింది.

ఫైనల్స్‌కు అంకుశ్, పర్వీన్ హుడా..
ఈ టోర్నీలో భారత్‌కు మరిన్ని స్వర్ణాలు వచ్చే అవకాశం ఉంది. పురుషుల విభాగంలో అంకుశ్ సెమీస్‌లో ఎర్కిన్‌బోవ్‌పై 4 - 1తో అద్భుత విజయం సాధించగా, మహిళల 65 కేజీల విభాగంలో పర్వీన్ హుడా చైనాకు చెందిన లీ షుపై 5 - 0తో నెగ్గి ఫైనల్స్‌కు చేరారు. వీరిద్దరూ శుక్రవారం జరిగే ఫైనల్స్‌లో పసిడి పతకాల కోసం పోరాడనున్నారు.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Asian Games 2026
Sports News
Telugu News