• हिन्दीEnglishमराठीবাংলাதமிழ்മലയാളംગુજરાતીతెలుగుಕನ್ನಡଓଡ଼ିଶାZ BharatPHHBusinessWION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Mohammed Siraj: టీమిండియా సెలెక్షన్‌పై కాంగ్రెస్ Vs బీజేపీ.. సిరాజ్ చుట్టూ వివాదం..!

Mohammed Siraj: టీమిండియా సెలెక్షన్‌పై కాంగ్రెస్ Vs బీజేపీ.. సిరాజ్ చుట్టూ వివాదం..!

Mohammed Siraj Selection Controversy: కివీస్‌తో తొలి టెస్ట్‌కు మహ్మద్ సిరాజ్‌ను ఎంపిక చేయకపోవడంపై రాజకీయ దుమారం చెలరేగుతోంది. మతపరమైన వివక్ష కారణంగా సిరాజ్‌ను తప్పించారని కాంగ్రెస్ ఆరోపించగా.. బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది.

Written ByAshok Krindinti
Published: Nov 20, 2026, 16:07 IST|Updated: Nov 20, 2026, 16:10 IST
joinshare
Mohammed Siraj: టీమిండియా సెలెక్షన్‌పై కాంగ్రెస్ Vs బీజేపీ.. సిరాజ్ చుట్టూ వివాదం..!
Image Credit: Mohammed Siraj Selection Controversy (Source: X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

ట్రెండింగ్

  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

పాలకుడి ముఖం మారితే.. అధికార స్వభావం మారుతుందా..? సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్..!

2

బయట ఫుడ్ తినకపోయినా ఫ్యాటీ లివర్ వస్తోందా? ఇంట్లో చేసే ఈ 5 పొరపాట్లే అసలు కారణమా?

3

Congress: సంక్రాంతి తర్వాత 'ప్రజా బలం' చేపడతాం.. నాయకులు గ్రామాలకు వెళ్లండి: రేవంత్‌ రెడ్డి

4

Revanth Reddy: 'ఎమ్మెల్యేలు అనిరుధ్, రాజగోపాల్ రెడ్డిలను ఈసారి క్షమించేద్దాం: రేవంత్ రెడ్డి

5

Kishan Reddy: రెబల్ స్టార్ ప్రభాస్‌తో భేటీ అయిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.. అసలు కారణం ఏమిటంటే..?..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Mohammed Siraj Selection Controversy: న్యూజిలాండ్‌తో తొలి టెస్టుకు టీమిండియా స్టార్ పేసర్ మహ్మద్ సిరాజ్‌ను తప్పించడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. గత కొన్నేళ్లుగా జట్టులో కీలక బౌలర్‌గా ప్రతి మ్యాచ్‌లో రాణిస్తున్న సిరాజ్‌ను పక్కనపెట్టడంతో సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి వంటి దిగ్గజాలు మేనేజ్‌మెంట్ తీరును తప్పుబట్టారు. న్యూజిలాండ్‌తో మొదటి టెస్టుకు భారత్ నలుగురు పేసర్లతో బరిలోకి దిగింది. జస్ప్రీత్ బుమ్రా, ప్రసిద్ధ్ కృష్ణ, ఆకాశ్ దీప్, అన్షుల్ కాంబోజ్‌లకు అవకాశం ఇచ్చింది. అయితే సిరాజ్‌కు మాత్రం చోటు కల్పించలేదు. పేస్‌కు అనుకూలంగా ఉండే వెల్లింగ్టన్ పిచ్‌పై సిరాజ్ లాంటి బౌలర్‌ను పక్కన పెట్టడం ఎందుకనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా కాంగ్రెస్ ఎంపీ ఇమ్రాన్ మసూద్ ఎంపీ చేసిన కామెంట్స్ దుమారం రేపుతున్నాయి. మతపరమైన గుర్తింపు కారణంగానే పక్కన పెట్టారంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. క్రికెట్ జట్టు ఎంపికను కూడా రాజకీయాలకు ముడిపెట్టడం సరికాదని మండిపడ్డారు.

గతంలో మంచి ప్రదర్శన చేసినా.. సిరాజ్‌ను పక్కన పెట్టడం వెనుక వివక్ష ఉందని ఆయన ఆరోపించారు. సిరాజ్ పేరును ప్రస్తావిస్తూ.. అతడి మతపరమైన గుర్తింపు కారణంగానే జట్టులో అవకాశం ఇవ్వలేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. సిరాజ్ గతంలో ఎన్నో కీలక మ్యాచ్‌ల్లో జట్టు విజయాల్లో భాగమయ్యాడని.. అలాంటి ఆటగాడికి అవకాశం ఇవ్వకపోవడాన్ని తప్పుబట్టారు. ప్రదర్శన బాగున్నా జట్టులోకి తీసుకోకపోతే దాని వెనుక వివక్ష ఉందనే అనుమానాలు వస్తాయన్నారు.

మసూద్ వ్యాఖ్యలపై బీజేపీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆ పార్టీ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు. క్రికెట్ జట్టు ఎంపికను కూడా ఓటు బ్యాంకు రాజకీయాలకు ఉపయోగించుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. సిరాజ్‌ మాత్రమే కాకుండా రవీంద్ర జడేజాకు కూడా తుది జట్టులో చోటు దక్కలేదని గుర్తుచేశారు. దేశానికి ప్రాతినిధ్యం వహించే ప్రతి క్రికెటర్ భారత జెర్సీతోనే మైదానంలోకి దిగుతారని.. క్రీడలను మతపరమైన అంశాలతో ముడిపెట్టవద్దని హితవు పలికారు.

గవాస్కర్, రవిశాస్త్రి అసంతృప్తి

మరోవైపు భారత మాజీ క్రికెటర్లు సునీల్ గవాస్కర్, రవిశాస్త్రి కూడా సిరాజ్‌ను తుది జట్టులోకి తీసుకోకపోవడంపై తమ అభిప్రాయాలను వెల్లడించారు. కీలక మ్యాచ్‌ల్లో అనుభవం ఉన్న పేసర్ సేవలను ఉపయోగించుకోకపోవడంపై ప్రశ్నలు లేవనెత్తారు. సిరాజ్‌కు ఉన్న అనుభవం, అతడి కష్టపడే తత్వాన్ని పరిగణనలోకి తీసుకుని ఉండాల్సిందని రవిశాస్త్రి అభిప్రాయపడ్డారు. గవాస్కర్ సైతం అతడిని పక్కన పెట్టిన నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

సిరాజ్‌ను పక్కన పెట్టడం వెనుక మతపరమైన కారణాలు లేవని జట్టు మేనేజ్‌మెంట్ స్పష్టం చేసింది. అందుబాటులో ఉన్న ఆటగాళ్ల ప్రదర్శన, జట్టు అవసరాలు, పిచ్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని తుది జట్టును ఎంపిక చేసినట్లు కెప్టెన్ శుభ్‌మన్ గిల్, బ్యాటింగ్ కోచ్ సితాన్షు కొటక్ తెలిపారు. సిరాజ్‌ను పక్కన పెట్టడం ఈజీ నిర్ణయం కాదని.. జట్టులోని పేసర్లందరూ బాగా ఆడుతున్నందున తుది కూర్పును నిర్ణయించడం కష్టంగా మారిందని గిల్ అన్నాడు. సిరాజ్ విషయంలో ఎలాంటి సమస్య లేదని.. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా బెస్ట్ టీమ్‌ను సెలెక్ట్ చేశామని కొటక్ వివరించారు.
  

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Sports News