SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

IND Vs PAK Blind Asia Cup 2026: మ్యాచ్ ఆడకుండానే పాకిస్థాన్‌కు ఆసియా కప్ ట్రోఫీ.. ట్రోఫీ కార్యక్రమాన్ని బహిష్కరించిన టీమ్ఇండియా!

IND Vs PAK Blind Asia Cup News: వర్షం కారణంగా భారత్ - పాకిస్థాన్ మధ్య అంధుల క్రికెట్ ఆసియా కప్ 2026 ఫైనల్ ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. అయినప్పటికీ పాకిస్థాన్‌ను ఏకైక విజేతగా ప్రకటించడంతో వివాదం చెలరేగింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించిన భారత జట్టు ట్రోఫీ ప్రదానోత్సవాన్ని బహిష్కరించింది. సంయుక్త విజేతలుగా ప్రకటించాలని CABI డిమాండ్ చేసింది.

Written By Harish Darla
Published: Nov 20, 2026, 20:21 IST | Updated: Nov 20, 2026, 20:24 IST
Join

IND Vs PAK Blind Asia Cup News: భారత్ - పాకిస్థాన్ మధ్య క్రికెట్ పోరు మరోసారి వివాదానికి దారితీసింది. బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జరగాల్సిన పురుషుల అంధుల క్రికెట్ ఆసియా కప్ 2026 ఫైనల్ వర్షం కారణంగా రద్దయింది. అయితే మ్యాచ్ నిర్వహణ సాధ్యం కాకపోవడంతో పాకిస్థాన్‌ను ఏకైక విజేతగా ప్రకటించడం భారత జట్టుకు ఆగ్రహం తెప్పించింది. ఈ నిర్ణయాన్ని నిరసిస్తూ టీమిండియా ట్రోఫీ ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరుకాలేదు.

ఫైనల్ రద్దు.. పాకిస్థాన్‌కు విజయం 
అంధుల ఆసియా కప్ 2026లో భాగంగా నవంబర్ 20న భారత్, పాకిస్థాన్ మధ్య ఫైనల్ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ ఢాకాలో భారీ వర్షం కారణంగా మైదానం ఆటకు అనుకూలంగా లేకపోవడంతో టాస్ కూడా నిర్వహించలేకపోయారు. చివరకు అంపైర్లు మ్యాచ్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు.

మ్యాచ్ జరగకపోయినా, మెరుగైన నెట్ రన్ రేట్ ఆధారంగా పాకిస్థాన్‌ను టోర్నీ ఛాంపియన్‌గా ప్రకటించినట్లు కథనంలో పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై భారత ఆటగాళ్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫైనల్ ఆడకుండా ఒక జట్టును మాత్రమే విజేతగా ప్రకటించడం సరికాదని భావిస్తూ అవార్డుల కార్యక్రమాన్ని బహిష్కరించారు.

సంయుక్త విజేతలుగా ప్రకటించాలని డిమాండ్
ఈ వ్యవహారంపై క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఇన్ ఇండియా (CABI) తీవ్రంగా స్పందించింది. వర్షం కారణంగా ఫైనల్ రద్దయినప్పుడు భారత్, పాకిస్థాన్‌లను సంయుక్త విజేతలుగా ప్రకటించాల్సి ఉంటుందని పేర్కొంది. పాకిస్థాన్‌కు మాత్రమే ట్రోఫీ అందించడం నిబంధనలకు విరుద్ధమని అభ్యంతరం తెలిపింది.

సెక్షన్ 27 నిబంధనపై అభ్యంతరం
టోర్నీ సాంకేతిక నిబంధనల్లోని సెక్షన్ 27 ప్రకారం ఫైనల్ మ్యాచ్ టై అయినా, రద్దయినా రెండు జట్లను విజేతలుగా ప్రకటించే అవకాశం ఉందని CABI తెలిపింది. ఈ అంశాన్ని వరల్డ్ బ్లైండ్ క్రికెట్ కౌన్సిల్ సాంకేతిక కమిటీ దృష్టికి తీసుకెళ్లినట్లు వెల్లడించింది. తొలుత సంయుక్త విజేతల ప్రకటనకు అంగీకారం లభించినప్పటికీ, చివర్లో నిర్ణయం మారిందని ఆరోపించింది. పాకిస్థాన్‌ను ఏకైక ఛాంపియన్‌గా ప్రకటించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని, రెండు జట్లను సంయుక్త విజేతలుగా ప్రకటించాలని CABI డిమాండ్ చేసింది. దీంతో అంధుల క్రికెట్ ఆసియా కప్ ఫైనల్ ఫలితంపై వివాదం కొనసాగుతోంది.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.
Read More

ZEENEWS TRENDING STORIES