• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Rohit Sharma Fell Bus: రోహిత్ శర్మకు తీవ్ర గాయం? బస్సు కింద జారీ పడిన హిట్‌మ్యాన్..ఇప్పడెలా ఉంది?

Rohit Sharma Fell Bus: రోహిత్ శర్మకు తీవ్ర గాయం? బస్సు కింద జారీ పడిన హిట్‌మ్యాన్..ఇప్పడెలా ఉంది?

Rohit Sharma Fell Down Bus: వెస్టిండీస్‌తో జరిగిన తొలి వన్డేలో భారత జట్టు విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్ ముగిసిన తర్వాత టీమ్ఇండియా ఆటగాళ్లు తమకు కేటాయించిన బస్సులో హోటల్‌కు చేరుకున్నారు. బస్సు దిగే క్రమంలో మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ మెట్లు జారీ కింద పడ్డాడు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతండగా.. హిట్‌మ్యాన్‌కు ఏదైనా గాయమైందా అంటూ ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు.

Written ByHarish Darla
Published: Sep 28, 2026, 06:05 PM IST|Updated: Sep 28, 2026, 06:07 PM IST
joinshare
Rohit Sharma Fell Bus: రోహిత్ శర్మకు తీవ్ర గాయం? బస్సు కింద జారీ పడిన హిట్‌మ్యాన్..ఇప్పడెలా ఉంది?

About the Author

Harish Darla

Harish Darla

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నా 8 ఏళ్ల అనుభవంలో ఈనాడు వంటి ప్రముఖ దినపత్రికతో పాటు ఈటీవీ భారత్‌‌లో పనిచేశాను. 2025 నుంచి ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేసిన అనుభవం కలదు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Rohit Sharma Fell Down Bus: తిరువనంతపురం వేదికగా నిన్న వెస్టిండీస్‌తో జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమ్ఇండియా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. 8 వికెట్ల తేడాతో భారత సేన గెలుపొందింది. మ్యాచ్ గెలిచిన సంబరాల్లో అంతా స్టేడియం నుంచి తిరుగుముఖం పట్టారు. టీమ్ఇండియా కూడా తమకు కేటాయించిన బస్సులో హోటల్‌కు బయల్దేరింది. హోటల్‌కు చేరుకున్న సమయంలో స్టార్ బ్యాట్స్‌మెన్, మాజీ కెప్టెన్ రోహిత్ శర్మ బస్సులో ప్రమాదానికి గురయ్యాడు. బస్సు దిగుతుండగా మెట్లు జారీ కింద పడినట్లు సమాచారం అందుతోంది. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారగా.. అతని ఫ్యాన్స్ హిట్‌మ్యాన్ కు ఏమైందంటూ ఆందోళన చెందుతున్నారు.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియోలో ప్రకారం.. రోహిత్ శర్మ బస్సు దిగుతుండగా జారిపోవడం కనిపిస్తోంది. మ్యాచ్ అనంతరం భారత జట్టు హోటల్‌కు చేరుకున్నప్పుడు ఈ సంఘటన జరిగిందని ఆ పోస్ట్‌లో పేర్కొన్నారు. బస్సు మెట్లు దిగుతుండగా రోహిత్ శర్మ తడబడి దారుణంగా కిందపడటం వీడియోలో కనిపిస్తోంది. హోటల్ బయట ఉన్న పోలీసు సిబ్బంది, గార్డులు వెంటనే అతన్ని పైకి లేపారు.

రోహిత్ శర్మకు తీవ్ర గాయం..
బస్సు దిగితున్న క్రమంలో రోహిత్ శర్మ జారిపడిన క్రమంలో వెంటనే అక్కడ విధుల్లో ఉన్న పోలీసు అధికారులు రోహిత్‌కు సహాయం చేస్తున్న దృశ్యం వీడియోలో కనిపిస్తోంది. అతని గాయాల తీవ్రత ఇంకా తెలియరానప్పటికీ, సోషల్ మీడియాలోని అభిమానులు 'హిట్‌మ్యాన్' త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నారు.

వెస్టిండీస్‌పై తొలి వన్డే గెలిచిన తర్వాత హోటల్‌కు తిరిగి వస్తుండగా, టీమ్ బస్సు మెట్లపై రోహిత్ శర్మ దారుణంగా జారిపడ్డాడని వీడియోను పోస్ట్ చేసిన యూజర్ వెల్లడించారు. అందరూ భారత్ విజయాన్ని సంబరాలు చేసుకుంటుండగా, రోహిత్‌ను చూసి విరాట్ కోహ్లీ ఆశ్చర్యపోయాడు.

తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఇన్నింగ్స్..
భారత్, వెస్టిండీస్ మధ్య సిరీస్‌లోని రెండో వన్డే సెప్టెంబర్ 30, బుధవారం గౌహతిలో జరగనుంది. రోహిత్ పూర్తిగా ఫిట్‌గా ఉన్నాడని, అతనికి ఎలాంటి తీవ్రమైన గాయాలు కాలేదని ఆశిద్దాం. తిరువనంతపురంలోని గ్రీన్‌ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో జరిగిన తొలి మ్యాచ్‌లో రోహిత్ శర్మ రెండు ఫోర్లు, మూడు సిక్సర్లతో 35 బంతుల్లో 32 పరుగులు చేశాడు. అతను బ్యాటింగ్‌లో మంచి ఫామ్ కొనసాగిస్తున్న క్రమంలో.. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు.

కోహ్లీ, శుభ్‌మన్ వరుస సెంచరీలు..
ఈ మ్యాచ్‌లో టీమ్ఇండియా కెప్టెన్ శుబ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ అద్భుతమైన శతకాలు సాధించి భారత్‌కు సునాయాస విజయాన్ని అందించారు. మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 295 పరుగులు చేసింది. అయితే విండీసి నిర్దేశించిన ఈ లక్ష్యాన్ని టీమ్ ఇండియా 41.4 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది. విరాట్ కోహ్లీ 88 బంతుల్లో 139 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. ఈ ఇన్నింగ్స్‌లో అతను తన వన్డే కెరీర్‌లో 55వ శతకాన్ని నమోదు చేయడంతో పాటు, వన్డేలలో 15,000 పరుగులు కూడా పూర్తి చేసుకున్నాడు. 

Add Zee News as a Preferred Source
TAGS:
Sports News
Team India
Telugu News