SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

టీమిండియా ఆణిముత్యం విరాట్ కోహ్లీ.. ఛేజింగ్ రారాజు విజయ రహస్యం ఇదే..

Virat Kohli Records: మైదానంలోకి దిగితే… ఆటమీదనే ధ్యాస… పొరుగువారితో పోల్చుకోవడం కాదు.. వ్యక్తిగతంగా ఎవరికి వారు జట్టులో క్రియాశీలకంగా వ్యవహరించాలని సంకల్పం ఉంటే చాలు అద్భుతాలను ఆవిష్కరించవచ్చని విరాట్ కోహ్లీ నిరూపించారు. విమర్శించేవాళ్లకు ఆటతీరుతో సమాధానం చెప్పడం.. సరికొత్త రికార్డుల్ని సొంతం చేసుకోవడం కోహ్లీకే సాధ్యమైంది. వేదిక ఏదని కాదు.. ఫార్మాట్ ఏదైనా సరే.. పరుగుల వరద పారించడం.. జట్టుకు అండగా నిలవడమే బాధ్యతగా తీసుకున్నారు. భారత క్రికెట్ విజయాల్లో కీలక పాత్ర పోషించి సరికొత్త వ్యక్తిగత రికార్డుల్ని సొంతం చేసుకున్న కోహ్లి ప్రస్థానం విషయానికొస్తే..

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 01, 2026, 06:12 PM IST | Updated: Oct 01, 2026, 06:23 PM IST
Image Credit: Virat Kohli (X/Source)
Join

India Cricket Team Lead: భారత క్రికెట్ టీమ్ లో విరాట్ కోహ్లీది ప్రత్యేక పాత్ర. చిరుప్రాయంలోనే ప్రతిభావంతుడిగా... క్రీడాకారుడిగా జట్టులో స్థానం సంపాదించుకున్న కోహ్లీ.. క్రీజులో కాసేపు నిలబడితే చాలు…  నింపాదిగా పరుగులు సాధించడం.. వ్యక్తిగత స్కోరుతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించడం అలవాటుగా చేసుకున్నాడు. తాజాగా తిరువనంతపురంలో వెస్టిండీస్ తో జరిగిన తొలి వన్డేలో వ్యక్తిగతంగా అత్యధిక పరుగులతో సెంచరీతో సెన్సేషన్ క్రియేట్ చేశారు. వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్‌‌లో  క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ బౌండరీల మోత, సిక్సర్ల వర్షంతో అభిమానులకు కిక్కెక్కించాడు. 88 బంతుల్లో పది బౌండరీలు, 9 సిక్సర్లతో 139 పరుగులతో విరాట్ కోహ్లీ నాటౌట్ ప్లేయర్ గా నిలిచాడు. వన్డే కెరీర్ లో 55వ సెంచరీ కొట్టి సత్తా చాటాడు. అంతేకాదు టీమిండియా క్రెకెటర్ గా వన్డేల్లో 15వేల పరుగులమైలు రాయికి చేరుకున్నాడు.

అన్ని ఫార్మాట్స్‌లో కలిపి 37, 834 పరుగులు.. అన్నీ ఫార్మాట్లల్లో 95 సెంచరీలు..

విరాట్ కోహ్లీ అన్నిఫార్మాట్ల్లో కలిపి 37వేల 834 పరుగులు చేసిన క్రీడాకారుడిగా నిలిచారు. వన్డేలో 15వేల 80 పరుగులు చేశారు. టెస్టు మ్యాచుల్లో 9వేల 230 పరుగులు, టీ20ల్లో 4వేల 188 పరుగులు, ఐపీఎల్ లో 9వేల 336 పరుగుల చేశారు. ఇక సెంచరీల విషయానికి వస్తే అన్నీ ఫార్మాట్లల్లో 95 సెంచరీలు చేశారు. వన్డేల్లో 55 సెంచరీలు కాగా, టెస్టుల్లో 30సెంచరీలు, టీ20ల్లో ఒక సెంచరీ, ఐపీఎల్ లో 9 సెంచరీలు కొట్టారు.

వన్డేల్లో 55వ సెంచరీతో అభిమానుల్లో కేరింతలు..

తిరువనంతపురం మైదానంలో విరాట్ కోహ్లీ విన్యాసాలు అభిమానుల్ని అలరించాయి. ప్రతి షాట్ ప్రత్యేకంగా నిలిచాయి. వన్డేల్లో ఎక్కువగా బౌండరీలను బాదే విరాట్ కోహ్లీ తొమ్మిది సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. వ్యక్తిగత ప్రతిభతో పాటు మానసిక దృఢత్వం, శారీరక ధారుఢ్యం.. విరాట్ కోహ్లీని అత్యుత్తమ క్రీడాకారుడిగా తీర్చి దిద్దాయి. క్లిష్టపరిస్థితుల్లో టీమిండియాను గెలిపించడంలో కోహ్లీది ప్రత్యేక పాత్ర. ఛేజింగ్ లో పరుగుల ప్రవాహం పారించడంలో తిరుగులేని శక్తి సామర్థ్యాలు కోహ్లీ సొంతం. అందుకే కోహ్లీని ఛేజింగ్ మాస్టర్ గా అభిమానులు ముద్దుగా పిలుస్తుంటారు.

కఠిన శ్రమ, క్రమశిక్షణ, బాధ్యత ఉంటే ఎవరైనా సరే తమ కలల్ని నిజం చేసుకోవచ్చని విరాట్ కోహ్లీ జీవితం మనకు నిరూపిస్తోంది. టీమిండియా జెర్సీని ఓ బాధ్యతగా తీసుకున్నాడు. జవాబుదారితనంతో ఆడటం, వ్యక్తిగత ప్రతిభా సామర్థ్యాలతో టీమ్ సాధించిన విజయాల్లో భాగస్వామ్యమయ్యాడు. టెస్టు మ్యాచ్ అయినా.. వన్డే క్రికెట్ అయినా… టీ20 అయినా ఆటగాడిగా రాణించడంలో కోహ్లీకి కోహ్లీనే సాటిగా గుర్తింపు పొందాడు.

విమర్శకులకు పరుగులతో సమాధానం చెప్పే బ్యాటర్..
అంతర్జాతీయ క్రికెట్లో విరాట్ సాధించిన పరుగులు ప్రపంచ రికార్డుగా నిలిచాయి. విరాట్ కోహ్లీ ఆధునిక క్రికెట్ ప్రపంచంలో అత్యుత్తమ బ్యాటర్‌గా, వ్యక్తిగతంగా సాధించిన పరుగులతో కోహ్లీ  రన్ మెషీన్ గా గుర్తింపు పొందారు.డానికి అతని అసాధారణ ప్రతిభా సామర్థ్యాలు, మానసిక దృఢత్వమే ప్రధాన కారణాలు. క్లిష్ట పరిస్థితుల్లోనూ జట్టును గెలిపించే అతని అద్భుతమైన నైపుణ్యాలు అతన్ని ప్రపంచ స్థాయి క్రీడాకారుడిగా నిలబెట్టాయి.  గ్రౌండ్‌లో మాత్రమే దూకుడుగా ఉండే కోహ్లీ.. బయట మాత్రం విన్రమంగా ఉంటాడు. తన వీక్నెస్‌లు అధిగమించి టీమిండియాకు బ్యాక్‌ బోన్ గా రాణిస్తున్నాడు.


ఫిట్‌నెస్, మానసిక ప్రశాంతత.. 
తనపై తనకు నమ్మకం ఉన్నపుడు… ఇతరుల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని విరాట్ కోహ్లీ ధృడంగా విశ్వసిస్తారు. బాడీలో ఫిట్నెస్, మానసిక ప్రశాంతత, ఆటలో వ్యక్తిగతంగా పరుగులు సాధించడం, టీమ్ విక్టరీలో భాగం కావాలనే తపనతో విరాట్ కోహ్లీని తిరుగులేని శక్తిగా తీర్చి దిద్దింది.

తనపై తాను పెంచుకున్న ఆత్మవిశ్వాసం - ఆటలో మేటి

కోహ్లీ  అహంకారాన్ని మనిషికి అతిపెద్ద శత్రువుగా భావిస్తారు.  మన బలాన్ని మనం గుర్తించడం ఎంత ముఖ్యమో, మన బలహీనతలపై పనిచేయడం కూడా అంతే ముఖ్యం. కెరీర్ ఆరంభంలో దూకుడు ప్రదర్శించిన విరాట్ కోహ్లీ... ఆ తర్వాత ఆటలో రాణించలేని పరిస్థితి ఎదుర్కొన్నాడు. క్రికెట్ విశ్లేషకులనుంచి విమర్శలు ఎదుర్కొన్నాడు. ​విరాట్ కోహ్లీ తన కెరీర్‌లో ఎన్నో ఒడిదుడుకులను చూశారు,  నిరంతరం నేర్చుకోవాలనే తపనే కోహ్లీని ముందుకు నడిపించింది. ఆటపై మనసు కేంద్రీకరించి, సాధించిన పరుగులతోనే సమాధానమిచ్చాడు. కోహ్లీ బాగా ఆడితే టీమ్ విక్టరీకి ఢోకా ఉండదు.. ఔటైతే క్రికెట్ అభిమానుల్లో నిరాశ నిస్పృహలు ఆవరించేవి. కీలక ఇన్నింగ్స్ తో ఓడిపోయే మ్యాచుల్లో విరాట్ కోహ్లీ ఇన్నింగ్స్ తో మలుపు తిప్పాడు.

వెస్టిండీస్ మ్యాచ్ తో వన్డేల్లో 15వేల పరుగుల మైలురాయి..

ప్రతిరోజూ తనను తాను మెరుగు పరుచుకోవడానికి ప్రయత్నించే వ్యక్తి మాత్రమే జీవితంలో ముందుకు సాగుతాడు. ఆత్మవిశ్వాసం, కఠిన శ్రమ అనేవి విజయానికి రెండు బలమైన స్తంభాలు. కేవలం ప్రతిభ ఉంటేనే సరిపోదని కోహ్లీ స్పష్టంగా చెబుతారు. ఎంత ప్రతిభ ఉన్నా, దానికి కఠిన శ్రమ తోడు కాకపోతే ఆ ప్రతిభ వృథా అవుతుంది. ఎప్పుడైనా సరే తలవంచుకుని.. ఆటపై మనసుపెట్టి ఆడటం అలవాటు చేసుకున్నానని కోహ్లీ చెబుతారు.

కోహ్లీ దృష్టిలో ఓటమి అనేది బలహీనత కాదు, అదొక నేర్చుకునే అవకాశం. కింద పడ్డాక మళ్లీ లేచి నిలబడేవాడే నిజమైన విజేత. విరాట్ కోహ్లీ కెరీర్‌లో ఎన్నో సార్లు వైఫల్యాలను ఎదుర్కొన్నారు, కానీ ఎన్నడూ ఓటమిని ఒప్పుకోలేదు.  చేసే పనిని నిజంగా ప్రేమిస్తే, ఎలాంటి ఒత్తిడైనా దానంతట అదే తగ్గిపోతుందని కోహ్లీ మనోగతం రుజువుచేసింది.  
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES