Asian Games Women India: ఆసియాన్ క్రీడల్లో భారత మహిళా క్రికెటర్లు అదరగొడుతున్నారు. వరుస విజయాలతో ఫుల్ జోష్‌లో ఉన్న అమ్మాయిలు రేపు ఫైనల్‌లో శ్రీలంక జట్టుతో తలపడనున్నారు. సెమీ ఫైనల్‌లో బంగ్లాదేశ్‌తో అద్భుత విజయం సాధించిన మన అమ్మాయిలు బంగారు పతకంపై కన్నేశారు. గోల్డె మెడల్ లక్ష్యంగా బరిలోకి దిగిన భారత జట్టు అదే స్థాయిలో అద్భుత ప్రదర్శన కనబరుస్తోంది. ఫైనల్‌కు వెళ్లి ఇప్పటికే పతకం ఖరారు చేసుకున్న భారత మహిళా క్రికెటర్లు మ్యాచ్‌ను సొంతం చేసుకుని బంగారు పతకం కోసం పోరాడనున్నారు.
ఆసియాడ్‌లో డిఫెండింగ్ చాంపియన్ భారత మహిళా క్రికెట్ జట్టు పసిడి లక్ష్యంగా సిద్ధమైంది. ఆదివారం జరిగిన రెండో సెమీ ఫైనల్స్‌లో షెఫాలీ వర్మ, కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్, స్మృతి మంధాన అద్భుతంగా రాణించి విజయంలో కీలక పాత్ర పోషించారు. ఇక బౌలింగ్‌లో మన బౌలర్లు దీప్తి శర్మ, శ్రీచరణి, నందని శర్మ నిప్పులు చెరిగేలా బంతులు వేసి బంగ్లాదేశ్ బ్యాటర్లను మైదానం నుంచి పంపించారు. టపాటపా వికెట్లు తీసి మ్యాచ్‌ను 114 పరుగుల తేడాతో సొంతం చేసుకుని పసిడి పోరుకు అర్హత సాధించారు.
సెమీ ఫైనల్‌లో భారత్ నిర్ణీత ఓవర్లకు 4 వికెట్ల నష్టపోయి 195 పరుగుల భారీ స్కోరు సాధించింది. లక్ష్యఛేదనలో బంగ్లా 15.4 ఓవర్లకు 81 రన్స్‌కే కుప్పకూలింది. షెఫాలీ వర్మ అజేయ శతకం బాదారు. 49 బంతుల్లో 3 ఫోర్లు, 9 సిక్స్‌లతో 100 చేసి నాటౌట్‌గా నిలిచారు. హర్మన్‌ప్రీత్ కౌర్ 40 పరుగులతో రాణించగా.. స్మృతి మంధాన (37) పర్వాలేదనిపించారు. భారత బౌలింగ్ దెబ్బకు శ్రీలంక ఓపెనర్ దిలారా అక్తర్ చేసిన 27 పరుగులే అత్యధిక స్కోర్‌గా నిలిచింది. దీప్తి శర్మ మూడేసి వికెట్లు తీయగా.. శ్రీచరణి 2 వికెట్లు, నందని శర్మ 3 వికెట్లతో బంగ్లాదేశ్‌పై విజృంభించారు. పేస్‌తో ప్రత్యర్థి బ్యాటర్లను బౌలర్లు క్రీజులో నిలువనీయలేదు. మొదటి సెమీస్‌లో పాకిస్థాన్‌ను ఓడించిన శ్రీలంక ఫైనల్ చేరింది. మంగళవారం జరగనున్న బంగారు పతక పోరులో భారత్, శ్రీలంక ఫైనల్‌లో అమీతుమీ తేల్చుకోనున్నాయి.