CSK Head Coach: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) అగ్ర జట్టుగా కొనసాగిన చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే) కొన్ని సీజన్‌ల నుంచి ప్రాభవం కోల్పోతుంది. జట్టు వరుసగా నాకౌట్ దశను దాటలేకపోతున్నది. పాయింట్ల పట్టికలో అట్టడుగున నిలుస్తోంది. తాజా సీజన్‌లో అదే ప్రదర్శనను కొనసాగించిన చెన్నై జట్టు ఈ క్రమంలోనే ఓ కీలక నిర్ణయం తీసుకుంది. జట్టుకు తదుపరి హెడ్ కోచ్‌గా మాజీ క్రికెటర్ జహీర్‌ఖాన్‌ను నియమించింది. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.
తమ హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఎంపిక చేసినట్లు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) ప్రకటించింది. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత కోచ్ పదవి నుంచి స్టీఫెన్ ప్లెమింగ్ తప్పుకోవడంతో అతడి స్థానంలో జహీర్ ఖాన్‌కు సీఎస్‌కే బాధ్యతలు అప్పగించింది. అయితే జహీర్ ఖాన్ సీఎస్‌కే కోచ్‌గా వస్తాడని ఎవరూ ఊహించలేదు.
తమ హెడ్‌కోచ్‌గా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ఎంపిక చేసినట్లు చెన్నై సూపర్‌కింగ్స్ (సీఎస్‌కే) ప్రకటించింది. ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత కోచ్ పదవి నుంచి స్టీఫెన్ ప్లెమింగ్ తప్పుకోవడంతో అతడి స్థానంలో జహీర్ ఖాన్‌కు సీఎస్‌కే బాధ్యతలు అప్పగించింది. అగ్ర జట్టు కావడంతో ఏ సీనియర్ ఆటగాడిని హెడ్ కోచ్‌గా ఎంపిక చేస్తారనుకుంటే అనూహ్యంగా జహీర్ ఖాన్ ఎంపికవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అతడు సీఎస్‌కే కోచ్‌గా రావడం ఎవరూ ఊహించనిది.
సీఎస్‌కే హెడ్ కోచ్‌గా ఇయాన్ మోర్గాన్ సహా ఇతర మాజీ క్రికెటర్ల పేర్లు రేసులోకి వచ్చాయి. జహీర్ ఖాన్ పేరు ఎక్కడా వినిపించలేదు. కానీ ఎవరి ఊహాలకు అందకుండా చెన్నై సూపర్ కింగ్స్ జహీర్‌ఖాన్‌ను తెరమీదకు తీసుకురావడమే కాకుండా ఫ్లెమింగ్ బాధ్యతలను అప్పగించింది. అందరి అంచనాలను తలకిందులు చేసింది. ఐపీఎల్ వేలంలోనూ అందరి అంచనాలకు అందకుండా క్రీడాకారులను ఎంపిక చేసుకునే చెన్నై జట్టు జహీర్ ఖాన్ విషయంలోనూ అదే నిరూపించింది. జహీర్ ఖాన్‌ను హెడ్ కోచ్‌గా సీఎస్‌కే ‘ఎక్స్’ వేదికగా ప్రకటించింది. ‘లెఫ్ట్ ఆర్మ్ టేకింగ్ ఓవర్.. సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా జహీర్ ఖాన్‌కు స్వాగతం’ అని పోస్టు చేసింది.
తొలి బాధ్యత
భారత క్రికెట జట్టులో ప్రత్యేకత సాధించిన జహీర్ ఖాన్ హెడ్ కోచ్‌గా పనిచేయడం మాత్రం ఇదే తొలిసారి. హెడ్ కోచ్ బాధ్యత తొలిసారి ఎలా నిర్వహిస్తాడనేది ఆసక్తికరంగా మారింది.
ఐపీఎల్‌లో జహీర్‌ఖాన్
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో జహీర్ ఖాన్ కొన్ని సంవత్సరాలు ఆడాడు. ముంబై ఇండియన్స్ జట్టుకు 2018 నుంచి 2022 వరకు డైరెక్టర్ ఆఫ్ క్రికెట్‌గా పనిచేశాడు. ఆ తర్వాత 2024 ఆగస్టు నుంచి 2025 సెప్టెంబర్ వరకు లఖ్‌నవూ సూపర్ జెయింట్స్‌కు మెంటార్‌గా వ్యవహరించాడు.
గతంలో బాధ్యతలు
అనిల్ కుంబ్లే 2017లో భారత జట్టు హెడ్ కోచ్‌గా ఉన్న సమయంలో జహీర్ ఖాన్ బౌలింగ్ కోచ్‌గా ఎంపికయ్యాడు. అయితే రవిశాస్త్రి హెడ్ కోచ్‌గా రావడంతో జహీర్ ఖాన్‌ను కోచ్ పాత్ర నుంచి తప్పించారు. బౌలింగ్ కన్సల్టెంట్‌గా జహీర్ పనచేశాడు.
సీఎస్‌కే హెడ్‌కోచ్‌గా ఫ్లెమింగ్
ఈ సీజన్ వరకు హెడ్ కోచ్‌గా పనిచేసిన ఫ్లెమింగ్ 2009 నుంచి చెన్నై సూపర్ కింగ్స్‌కు పనిచేశాడు. 2026 వరకు హెడ్ కోచ్‌గా పనిచేసిన ఫ్లెమింగ్ చెన్నై జట్టుపై చెరగని ముద్ర వేశాడు. ఐదుసార్లు జట్టును ఛాంపియన్‌గా నిలిపిన ఫ్లెమింగ్ గత సీజన్ తర్వాత హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగాడు.
ZAK HERE FOR THE PRIDE! 🦁#WhistlePodu for the Head Coach of Chennai Super Kings! 🥳💛
Read more, Link -https://t.co/v8muYn4yVA pic.twitter.com/eQChQ6yDEB— Chennai Super Kings (@ChennaiIPL) September 21, 2026