• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /ఫోటోలు
  • /PF Investment Rules 2026: PF డబ్బులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఈ బాండ్లలోనూ పెట్టుబడులు!

PF Investment Rules 2026: PF డబ్బులపై కేంద్రం కీలక నిర్ణయం.. ఇక ఈ బాండ్లలోనూ పెట్టుబడులు!

Written ByVishnu Priya
Published: Sep 28, 2026, 10:16 AM IST|Updated: Sep 28, 2026, 10:22 AM IST
joinshare

PF Investment Rules 2026: ఉద్యోగుల భవిష్య నిధి (PF) విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పు చేసింది. ఎగ్జెంప్టెడ్ PF ట్రస్టులకు పెట్టుబడుల విషయంలో మరిన్ని అవకాశాలను కల్పించింది. కొత్త నిబంధనల ప్రకారం.. ఈ ట్రస్టులు కొన్ని ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు జారీ చేసే రూపాయి బాండ్లలో కూడా పెట్టుబడులు పెట్టుకోవచ్చు.
 

 exempted PF trusts1/5

ఎగ్జెంప్టెడ్ PF ట్రస్టులు

ప్రస్తుతం ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్‌ను నిర్వహించే సంస్థల్లో కొన్ని నేరుగా EPFO పరిధిలో ఉంటాయి. మరికొన్ని సంస్థలు ప్రత్యేక అనుమతితో సొంతంగా PF ట్రస్టులను నిర్వహిస్తున్నాయి. వీటినే ఎగ్జెంప్టెడ్ ఎస్టాబ్లిష్‌మెంట్స్ అంటారు. ఉద్యోగులకు EPFO పథకానికి సమానమైన లేదా అంతకంటే మెరుగైన ప్రయోజనాలు అందిస్తే ఇలాంటి సంస్థలకు సొంత PF ట్రస్టులను నిర్వహించుకునే అవకాశం ఉంటుంది.
Asian Development Bank2/5

ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్

ఇప్పటి వరకు ఈ ట్రస్టులకు పెట్టుబడుల విషయంలో కొన్ని పరిమితులు ఉన్నాయి. తాజాగా కేంద్ర ప్రభుత్వం వాటికి మరిన్ని డెట్ ఇన్వెస్ట్‌మెంట్ అవకాశాలను కల్పించింది. దీని వల్ల తమ వద్ద ఉన్న PF నిధులను వివిధ రకాల పెట్టుబడుల్లో పెట్టుకునే అవకాశం లభిస్తుంది. కొత్త నిబంధనల ప్రకారం నాలుగు ప్రముఖ అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు జారీ చేసే రూపాయి ఆధారిత బాండ్లలో పెట్టుబడి పెట్టవచ్చు. అయితే ఆ బాండ్లకు కనీసం మూడు సంవత్సరాల మిగిలిన కాలపరిమితి ఉండాలి.
 International Finance Corporation3/5

ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్

ఈ నాలుగు సంస్థల్లో ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్‌స్ట్రక్షన్ అండ్ డెవలప్‌మెంట్ (వరల్డ్ బ్యాంక్‌లో భాగం), ఇంటర్నేషనల్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏషియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్, న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ ఉన్నాయి.
PF investment rules 20264/5

PF పెట్టుబడి నిబంధనలు 2026

EPFO పెట్టుబడి విధానం ప్రకారం.. తన మొత్తం నిధుల్లో 20 శాతం నుంచి 45 శాతం వరకు వివిధ డెట్ ఇన్‌స్ట్రుమెంట్లలో పెట్టుబడి పెట్టవచ్చు. ఇందులో ప్రభుత్వ సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు జారీ చేసే సాధనాలు ఉంటాయి.కొత్త నిబంధనలతో ఎగ్జెంప్టెడ్ PF ట్రస్టులు కేవలం దేశీయ కార్పొరేట్ డెట్‌పై ఆధారపడకుండా తమ పెట్టుబడులను విభజించుకోవచ్చు. దీని ద్వారా దీర్ఘకాలంలో స్థిరమైన రాబడులను పొందే అవకాశాలు పెరుగుతాయని భావిస్తున్నారు.
New Development Bank5/5

న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్

దేశవ్యాప్తంగా దాదాపు 1,000 ఎగ్జెంప్టెడ్ PF ట్రస్టులకు ఈ మార్పు ఉపయోగపడే అవకాశం ఉంది. వీటిలో ఎక్కువ భాగం ప్రభుత్వ రంగ సంస్థలకు చెందినవే. ఈ ట్రస్టుల పరిధిలో సుమారు 30 లక్షల మంది సభ్యులు ఉన్నట్లు సమాచారం. అయితే PF ట్రస్టులు ఉద్యోగులకు ప్రకటించే వడ్డీ రేటుపై కూడా పరిమితి ఉంది. EPFO ప్రకటించే వార్షిక వడ్డీ రేటు కంటే రెండు శాతం పాయింట్లకు మించి వడ్డీని ప్రకటించడానికి వీలు లేదు.
TAGS:
National News
EPFO

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.