Acb catches town planning officer sunitha while taking bribe: ఇటీవల తెలంగాణలోని ప్రభుత్వ శాఖలో లంచాలు డిమాండ్ చేస్తున్న అధికారులు అడ్డంగా దొరికిపోతున్నారు. ఆఫీసుల్లో వస్తున్న బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని కొంతమంది లంచాల కోసం పీడిస్తున్నారు. దీంతో విసిగిపోయిన బాధితులు ఏసీబీని ఆశ్రయించి తమ గోడును చెప్పుకుంటున్నారు. గత కొన్ని రోజులుగా వివిధ ప్రభుత్వ కార్యాలయాల్లో లంచాలు తీసుకుంటూ అధికారులు అడ్డంగా దొరికిపోతున్న అధికారుల తీరులో మాత్రం మార్పు రావడంలేదు.
ఈ క్రమంలో మెహదీపట్నం జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో రూ.4 లక్షల లంచం తీసుకుంటూ టౌన్ ప్లానింగ్ సూపర్వైజర్ సునీతను ఏసీబీ అడ్డంగా దొరిపోయింది. భవన నిర్మాణ అనుమతులు, క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు తెలుస్తొంది. అయితే సదరు అధికారి మొత్తంగా 15 లక్షలను బాధితుల నుంచి తొలుత డిమాండ్ చేసింది.ఆ తర్వాత 8 లక్షలకు బాధితుడితో అగ్రిమెంట్ చేసుకుంది. ఈ క్రమంలో దీన్ని రెండు విడతలలో ఇచ్చేలా మాట్లాడుకుంది. ఈ క్రమంలో డెడ్ డ్రాప్ పద్దతిలో అధికారిణి లంచాలు వసూలు చేస్తున్నట్లు తెలుస్తొంది. దీని ప్రకారం రద్దీగా ఉన్న ప్రదేశంలో వాహనం ఆపి డిక్కీ తెరవడంతో బాదితులు దానిలో డబ్బులు వేస్తారు.ఆ తర్వాత మరల ఆమె వచ్చి డీక్కి క్లోజ్ చేసి వెళ్లిపోతుంది. డ్రగ్స్ లు సరఫరాచేసేవారు ఈ టెక్నిక్లను పాటిస్తుంటారు.
దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. దీంతో పక్కాప్లాన్ తో ఆఫీసులో మాటు వేసిన ఏసీబీ అధికారులు 4 లక్షలను ఆమె వాహనం డిక్కీలో వేస్తుండగా పట్టుకున్నారు. అయితే.. తాను ఆ డబ్బులను ముట్టుకోలేదని సదరు టౌన్ ప్లానింగ్ అధికారి సునీత దబాయించినట్లు అధికారులు చెబుతున్నారు.
అప్పటికే ఆమె వాహనంలో మరో 2.5 లక్షలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా బాధితుడు ఆమెతో చేసిన ఫోన్ కాల్ , చాట్ లను బైటపెట్టడంతో టౌనీప్లానింగ్ అధికారి సునీతా అడ్డంగా బుక్కైంది. కొన్నేళ్లుగా పలు కేసుల్లో రావాల్సిన లంచం సొమ్మును టౌన్ ప్లానింగ్ అధికారి సునీత స్కూటీ డిక్కీ డ్రాప్ చేయించుకుంటున్నట్లు కొంత మంది అధికారులతో చెప్పినట్లు తెలుస్తొంది.
ఇక ఏసీబీకి అడ్డంగా దొరికిపోయిన తర్వాత ఫోటోలు తీయోద్దని మరోవైపు వెక్కి వెక్కిఏడ్వడంతో అక్కడి అధికారులు సైతం అవాక్కైయ్యారు. ఈ ఘటన ప్రస్తుతం తెగ వైరల్ గా మారింది.