SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Acb Rainds in Keesara: మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్సై, సీఐలు..

Si and ci arrested in bribe case keesara: కీసర పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ బుధవారం అర్దరాత్రి సోదాలు నిర్వహించింది. ఈ క్రమంలో పీఎస్ లోనే లంచం తీసుకుంటూ ఎస్సై, ఇన్‌స్పెక్టర్ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. ఈ ఘటనతో పీఎస్ లో ఒక్కసారిగా హైడ్రామా చోటు చేసుకుంది.

Reported By Inamdar Paresh Written By Inamdar Paresh
Published: Sep 17, 2026, 09:19 AM IST | Updated: Sep 17, 2026, 09:41 AM IST
Image Credit: Acb Rainds in Keesara: మేడ్చల్ పోలీస్ స్టేషన్‌లో ఏసీబీ సోదాలు.. రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన ఎస్సై, సీఐలు..
Join

Acb officials raids in medchal keesara police station: తెలంగాణలో ఇటీవల అనేక శాఖలపై ఏసీబీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. బాధితుల సమాచారంలో లంచాలు డిమాండ్ అవినీతి అనకొండలను వలపన్ని మరీ అరెస్ట్ చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు ప్రతి చోట ఏదో ఒక శాఖలో వెలుగులోకి వస్తుంది. అక్రమార్కులను పట్టుకుని ఏసీబీ అధికారులు వారిని అరెస్టులు  చేస్తున్నారు.  అయిన కూడా  కొంత మంది ప్రభుత్వ అధికారులు తమ తీరును మార్చుకొవడంలేదు.    బాధితుల అవసరాలను అడ్డంపెట్టుకుని లంచం డిమాండ్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో మేడ్చల్ మల్కాజ్ గిరి పరిధిలో ఉన్న కీసర పోలీస్ స్టేషన్ లో ఏసీబీ అధికారులు బుధవారం అర్దరాత్రి సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో  ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి, ఇన్‌స్పెక్టర్ ఆంజనేయులు  లంచం తీసుకుంటూ  ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు. పీడీఎస్ బియ్యం ఘటనలో అడ్డంగా దొరికిన కేసులో సదరు వ్యక్తికి బెయిల్ కోసం.. రూ.5 లక్షల లంచం తీసుకుంటుండగా ఎస్సై జ్ఞానేందర్ రెడ్డి ను  ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 

ఇక కీసర సమీపంలో చెరువు వద్ద కారులో రూ.5 లక్షలను ఎస్సై  స్వీకరించాడు. ఆతర్వాత  ACB అధికారులను చూసి ఎస్సై పరుగులు పెట్టాడు.ఆ తర్వాత పీఎస్ లో అదుపులోకి తీసుకున్నారు.  నిందితుడికి స్టేషన్ బెయిల్ ఇచ్చేందుకు రూ.10 లక్షలు డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. రూ.10 లక్షల లంచం ఇవ్వాలని  ఇన్‌స్పెక్టర్ ఆర్కపల్లి ఆంజనేయులు డిమాండ్ చేసినట్లు బాధితుడు చెబుతున్నాడు. 

అయితే తొలి విడతగా.. రూ.5 లక్షలు ఎస్సైకి ఇచ్చేలా డీల్ కుదిరినట్లు తెలుస్తొంది. అయితే.. కెమికల్ టెస్ట్‌ల విషయంలో కూడా బాధితుడిని  ఇన్స్పెక్టర్, ఎస్సై  ముప్పుతిప్పలు  పెట్టినట్లు చెబుతున్నాడు. 

Read more: Ganesh Immersion: గణేశ్ ఉత్సవాల్లో తీవ్ర విషాదం.. చెరువులో గణనాథుడితో మునిగి ఆరుగురు విద్యార్థుల జల సమాధి

గత కొన్ని రోజులుగా బిర్యానీలు, కూల్‌డ్రింక్స్ తీసుకురావాలని వేధింపులకు సైతం గురిచేస్తున్నట్లు చెప్పుకొచ్చాడు. ఇక ఈ వేధింపులు తట్టుకోలేక ACBని బాధితుడు ఆశ్రయించాడు. ఈ క్రమంలో.. ACB డీఎస్పీ మజీద్ అలీఖాన్ ఆధ్వర్యంలో అధికారులు కార్యాలయాలు, ఇండ్లలోను ఏసీబీ సోదాలు చేపట్టింది.
 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES