Allu Arjun Father In Law Case: హైదరాబాద్ నానక్‌రామ్‌గూడలోని ప్రముఖ 'మంత్రీ కాస్మోస్' భవన ప్రాంగణంలోకి కొందరు వ్యక్తులు అక్రమంగా ప్రవేశించి, సెక్యూరిటీ సిబ్బందిని భయభ్రాంతులకు గురిచేసి ఆక్రమణలకు పాల్పడ్డారని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ప్రతినిధి పెద్దిరాజు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన గచ్చిబౌలి పోలీసులు కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం రవి తదితరులపై కేసు నమోదు చేశారు. ఆక్రమణదారులు అత్యవసర మార్గాన్ని మూసివేసి, దౌర్జన్యానికి పాల్పడటంతో సాఫ్ట్‌వేర్ సంస్థల నిర్వహణకు, ఐటీ ఉద్యోగుల భద్రతకు తీవ్ర విఘాతం కలుగుతోందని మంత్రీ కాస్మోస్ ఓనర్స్ అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
ఫిర్యాదులో పేర్కొన్న వివరాల ప్రకారం.. ఉదయం సుమారు 8:40 గంటల సమయంలో మురళీధర్ రెడ్డి, గడ్డం రవి నేతృత్వంలో వచ్చిన వ్యక్తులు బిల్డింగ్ సౌత్‌వెస్ట్ కార్నర్ గేట్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ప్రాంగణంలో ఉన్న కొన్ని నిర్మాణాలను ధ్వంసం చేయడమే కాకుండా, అక్రమంగా టిన్‌షీట్లు ఏర్పాటు చేశారు. వీటిని అడ్డుకోబోయిన సెక్యూరిటీ సిబ్బందిని తోసివేసి, ఎదురుతిరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని బెదిరింపులకు దిగారు. ఈ దౌర్జన్య ఘటన అంతా భవన ప్రాంగణంలోని సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయిందని బాధితులు వెల్లడించారు.
ఐటీ సంస్థలు, అత్యవసర సేవలకు ఆటంకం..
సర్వే నంబర్ 130లో ఉన్న మంత్రీ కాస్మోస్ భవనం స్పెషల్ ఎకనమిక్ జోన్ (SEZ) పరిధిలోకి వస్తుందని, ఇందులో అనేక సాఫ్ట్‌వేర్ కంపెనీలు పనిచేస్తున్నాయని అసోసియేషన్ తెలిపింది. బిల్డింగ్ సౌత్ భాగంలో విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్, జనరేటర్లు, వ్యర్థాల నిర్వహణ షెడ్లు ఉన్నాయి.
అంతేకాక, దౌర్జన్యానికి గురైన సౌత్‌వెస్ట్ మార్గం అత్యవసర సమయాల్లో ఫైర్ ఇంజిన్లు, నీటి ట్యాంకర్ల రాకపోకలకు అత్యంత కీలకమైన రహదారి. ఈ మార్గాన్ని ఆక్రమించడం వల్ల ఐటీ సంస్థల నిరంతర నిర్వహణకు, అత్యవసర సేవలకు పెద్ద ఆటంకం ఏర్పడుతుందని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు
ఘటనకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్, ఆధారాల ఫొటోలను పెన్‌డ్రైవ్‌లో భద్రపరిచి గచ్చిబౌలి పోలీసులకు అందజేశారు. అక్రమ ఆక్రమణలకు, దౌర్జన్యానికి పాల్పడిన చంద్రశేఖర్ రెడ్డి, మురళీధర్ రెడ్డి, గడ్డం రవి సహా బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఐటీ ఉద్యోగులకు తగిన భద్రత కల్పించాలని కోరుతూ గచ్చిబౌలి పీఎస్‌తో పాటు తెలంగాణ డీజీపీ, సైబరాబాద్ పోలీస్ కమిషనర్, మాదాపూర్ డీసీపీ, గచ్చిబౌలి ఏసీపీలకు కూడా ఫిర్యాదు ప్రతులను పంపినట్లు వెల్లడించారు.
Also Read:
"జైలులో 30 సార్లు నగ్నంగా నిలబెట్టారు" తీహార్ జైలు ఘోర అనుభవాలపై హీరోయిన్ ఆవేదన!
Also Read: మాధురి రాథోడ్ 'నిమ్మతోట వనములో' పాట సంపాద ఎంత? రూ.10 లక్షలు పెడితే,16.2 కోట్లతో..
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U
ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe
సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter, Facebook