• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /క్రీడలు
  • /Ind Vs Pak Final Highlights: హైవోల్టేజ్ పోరులో పాక్‌పై విక్టరీ.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

Ind Vs Pak Final Highlights: హైవోల్టేజ్ పోరులో పాక్‌పై విక్టరీ.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

India vs Pakistan Asian Games Final Highlights: ఆసియా గేమ్స్‌లో భారత్ మరో గోల్డ్ మెడల్ సాధించింది. హైవోల్టేజ్ ఫైనల్ పోరులో చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో మట్టికరిపించిన టీమిండియా.. వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ ముద్దాడింది. మొదట బ్యాటర్ల విధ్వంసంతో 211 పరుగుల భారీ స్కోరు సాధించిన భారత్.. అనంతరం పాక్‌ను 192 పరుగులకే కట్టడి చేసి విజేతగా నిలిచింది.

Written ByAshok Krindinti
Published: Oct 03, 2026, 01:52 PM IST|Updated: Oct 03, 2026, 02:14 PM IST
joinshare
Ind Vs Pak Final Highlights: హైవోల్టేజ్ పోరులో పాక్‌పై విక్టరీ.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం
Image Credit: Ind Vs Pak Final Highlights (Source: BCCI/X)

About the Author

Ashok Krindinti

Ashok Krindinti

అశోక్‌ క్రిందింటి జీ తెలుగు డిజిటల్ మీడియాలో సీనియర్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2022 నుంచి స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, రాజకీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో ఏడేళ్లకుపైగా అనుభవం ఉంది.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Dharmapuri: మంత్రి నియోజకవర్గంలోనే కరెంట్ కష్టాలు.. రైతులు, గ్రామస్థుల ధర్నా!

Dharmapuri: మంత్రి నియోజకవర్గంలోనే కరెంట్ కష్టాలు.. రైతులు, గ్రామస్థుల ధర్నా!

2

Ind Vs Pak Final Highlights: హైవోల్టేజ్ పోరులో పాక్‌పై విక్టరీ.. ఏషియన్ గేమ్స్‌లో భారత్‌కు మరో స్వర్ణం

3

IRCTC Current Booking: రైలు టికెట్ కన్ఫర్మ్ కావాలా? ఛార్ట్ ప్రిపేర్ అయ్యాక కూడా ఛాన్స్ ఉంది! ఎలాగంటే?

4

ప్రైవేట్ జాబ్స్ చేసేవారికి గుడ్ న్యూస్? వేతనంతో కూడిన పితృత్వ సెలవులు..!!

5

7500mAh బ్యాటరీతో POCO C95 Pro వచ్చేసింది.. దీని ప్రత్యేకతలివే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

India vs Pakistan Asian Games Final Highlights: ఏషియన్ గేమ్స్ క్రికెట్ ఫైనల్ పోరులో పాకిస్థాన్‌ను భారత్ చిత్తు చేసింది. డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్.. పాక్‌పై అద్భుత విజయం సాధించి గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది. ఫైనల్ మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. అనంతరం పాకిస్థాన్ ఆరు వికెట్లు కోల్పోయి 192 పరుగులు చేసింది. దీంతో భారత్ 19 పరుగుల తేడాతో విక్టరీ సాధించింది. భారత్ వరుసగా రెండో ఏడాది గోల్డ్ మెడల్ సొంతం చేసుకోగా.. రన్నరప్‌గా నిలిచిన పాకిస్థాన్‌ రజతం పతకంతో సరిపెట్టుకుంది. 

ఫైనల్ మ్యాచ్‌లో టాస్ గెలిచిన కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఓపెనర్ వైభవ్ సూర్యవంశీ (15) రెండు సిక్సర్లు బాది జోరు మీద కనిపించినా.. అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్ (2) విఫలమయ్యాడు. మరో ఓపెనర్ అభిషేక్ శర్మ (28 బంతుల్లో 61, 3 ఫోర్లు, 7 సిక్సర్లు) వీరవిహారం చేశాడు. దీంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (21), ఇషాన్ కిషన్ (20) పర్వాలేదనిపించగా.. ఆఖర్లో తిలక్ వర్మ చెలరేగి ఆడాడు. 22 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్ల సాయంతో 51 పరుగులు చేశాడు. శివం దుబే (15 బంతుల్లో 27, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించాడు. దీంతో భారత్ స్కోరు బోర్డు 20 ఓవర్లలో 211 పరుగులు చేరింది.

అనంతరం 212 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్‌ను ఆరంభంలో భారత బౌలర్లు దెబ్బ తీశారు. 39 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. అయితే హసన్ నవాజ్, సామ్ అయూబ్‌ ఇద్దరు బౌలర్లు సమర్థవంతంగా ఎదుర్కొన్నారు. వీరిద్దరు నాలుగో వికెట్‌కు 87 పరుగులు జోడించారు. హసన్ నవాజ్ (51 బంతుల్లో 96) చివరికి వరకు క్రీజ్‌లో ఉండి పోరాడాడు. 18 బంతుల్లో 52 పరుగులు చేయాల్సిన దశలో వాషింగ్టన్ సుందర్, బుమ్రా రెండు ఓవర్లు వరుసగా 8, 11 పరుగులు ఇవ్వడంతో భారత్ విజయం ఖాయమైంది. చివరి ఓవర్‌ వేసిన శివమ్ దుబే 13 పరుగులు ఇచ్చి.. ఆఖరి బంతికి నవాజ్‌ను ఔట్ చేశాడు. దీంతో పాక్ స్కోర్ 192 పరుగులకే పరిమితమైంది. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, దుబే తలో రెండు వికెట్లు తీశారు.  

ఆసియా గేమ్స్‌లో మహిళల టీమ్‌ కూడా స్వర్ణం గెలిచిన విషయం తెలిసిందే. ఇప్పుడు పురుషుల జట్టు కూడా పాకిస్థాన్‌ను 19 పరుగుల తేడాతో ఓడించి స్వర్ణ పతకం సాధించడంతో ఫ్యాన్స్‌ సంబరాల్లో మునిగిపోయారు. ఆసియా క్రీడల్లో భారత్‌కు ఇది 19వ స్వర్ణ పతకం. మొత్తంగా 81వ పతకం.

Add Zee News as a Preferred Source
TAGS:
Cricket
Sports News
Asian Games 2026