• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Bandi Sanjay: ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం నిషేధించడం దారుణం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Bandi Sanjay: ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం నిషేధించడం దారుణం.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Ganesh immersion row on tank bund: భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు పెద్దఎత్తున ట్యాంక్ బండ్ చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బారికెడ్లు పీకివేశారు. దీంతో పోలీసులు భారీగా చేరుకున్నారు. ఈ ఘటనపై కేంద్ర మంత్రి బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Reported ByInamdar PareshEdited ByInamdar Paresh
Published: Sep 21, 2026, 02:02 PM IST|Updated: Sep 21, 2026, 02:10 PM IST
joinshare
Bandi Sanjay: ట్యాంక్ బండ్‌పై గణేష్ నిమజ్జనం నిషేధించడం దారుణం..  బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Image Credit: Bandisanjay(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Bandi Sanjay Responds on hyderabad ganesh immersion row: హైదరాబాద్ లో వినాయక నిమజ్జనం వేళ గందరగోళం తలెత్తింది. ట్యాంక్ బండ్ మీద వినాయక విగ్రహాలను నిమజ్జనంకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం  ఆంక్షలను విధించింది. దీంతో చాలా మంది భక్తులు తమ గణపయ్య విగ్రహాలను తీసుకొచ్చి మరీ రిటర్న్ వెళ్లిపోతున్నారు. దీనిపై ఇప్పటికే  భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ప్రభుత్వంతో చర్చలు జరిపారు. 

ప్రతి ఏటా ట్యాంక్ బండ్ లో గణేష్ నిమజ్జనాలను నిర్వహించడం ఆనవాతీగా వస్తుందని, ఈసారి ఈ నిషేధాలు ఏంటని మండిపడుతున్నారు. భక్తులు సైతం ఇతర మతాల పండగలకు లేని ఆంక్షలను హిందువుల పండుగలు రాగానే ప్రభుత్వాలకు గుర్తొస్తాయా.. అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై ట్యాంక్ బండ్ మీద తీవ్ర దుమారం చెలరేగింది.  

భాగ్యనగర్ గణేశ్ ఉత్సవ కమిటీ ప్రతినిధులు ట్యాంక్ బండ్ మీదకు చేరుకుని అక్కడ ఏర్పాటు చేసిన బారికెడ్లను లాగిపడేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని ఉత్సవ కమిటీ ప్రతినిధులను అదుపులోకి తీసుకున్నారు. మిగత వారు ట్యాంక్ బండ్ మీదనే బైఠాయించి సీఎం రేవంత్ ప్రభుత్వంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. 

ఈ క్రమంలో గణేష్ నిమజ్జనం వివాదంపై  కేంద్ర మంత్రి బండి సంజయ్ రియాక్ట్ అయ్యారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్యాంక్ బండ్ పై నిమజ్జనాన్ని నిషేధించడం దారుణమన్నారు.

ప్రజాస్వామ్యబద్దంగా నిరసన తెలుపుతున్న ఉత్సవ కమిటీ ప్రతినిధులను అరెస్ట్ చేయడం సరికాదని ఫైర్ అయ్యారు. ప్రతి ఏటా ట్యాంక్ బండ్ పై నిమజ్జనం జరుపుకోవడం ఆనవాయితీ అని చెప్పుకొచ్చారు. ఈసారి కూడా ట్యాంక్ బండ్ పై నిమజ్జనానికి అనుమతించాల్సిందేనని తెల్చిచెప్పారు. 

Read more: Khairatabad bada ganesh: ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనంకు మూహూర్తం ఫిక్స్.. ఎప్పుడంటే..?..

భాగ్యనగర్ ఉత్సవ కమిటీ ప్రధాన కార్యదర్శి శశిధర్ తోపాటు అరెస్ట్ చేసిన వారందరినీ బేషరతుగా విడుదల చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. దీంతో ఈసారి ట్యాంక్ బండ్ లో వినాయక నిమజ్జనంపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది.
 

Add Zee News as a Preferred Source
TAGS:
Hyderabad
Revanth Reddy
Telugu News