SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

నేటితో ముగియనున్న PRC గడువు.. ఉద్యోగానికే రిటైర్మెంట్.. ఆత్మగౌరవానికి కాదంటూ పెన్షనర్ ఆవేదన..!!

TS-PRC Report Deadline: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ కమిషన్ పీఆర్సీ గడువు నేటితో ముగియనుంది. దీతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.నిర్ణీత గడువు లోపు ప్రభుత్వం పీఆర్సీ నివేదికను స్వీకరించి.. బహిర్గతం చేస్తుందా? లేక మళ్లీ కాలయాపన చేస్తుందా? అనే ఆందోళన లక్షలాది మంది ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Sep 30, 2026, 10:09 AM IST | Updated: Sep 30, 2026, 10:11 AM IST
Image Credit: Big Debate with Bharath
Join

TS-PRC Report Deadline: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు.. ఉపాధ్యాయులు.. పెన్షనర్లు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్న రెండో వేతన సవరణ కమిషన్ పీఆర్సీ గడువు నేటితో ముగియనుంది. దీతో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.నిర్ణీత గడువు లోపు ప్రభుత్వం పీఆర్సీ నివేదికను స్వీకరించి.. బహిర్గతం చేస్తుందా? లేక మళ్లీ కాలయాపన చేస్తుందా? అనే ఆందోళన లక్షలాది మంది ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. ఇప్పటికే డీఏ బకాయిల చెల్లింపులు, సీపీఎస్ రద్దు, పీఆర్సీ ప్రకటనలో జరుగుతున్న ఆలస్యంపై ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఈ నేపథ్యంలో జీ తెలుగు 'బిగ్ డిబేట్ విత్ భరత్' Big Debate with Bharat ప్రత్యక్ష ప్రసార కార్యక్రమంలో పీఆర్సీ ఆలస్యంపై చర్చ జరిగింది. ఈ డిబేట్‌లో ఒక పెన్షనర్ తన ఆవేదనను వెళ్లబోసుకున్నారు. ఉద్యోగానికే రిటైర్మెంట్.. ఆత్మగౌరవానికి కాదంటూ చేసిన ఆత్మగౌరవ నినాదం ఇప్పుడు ఉద్యోగ వర్గాల్లో పెద్దెత్తున చర్చనీయాంశంగా మారింది.

మా ఆత్మగౌరవానికి రిటైర్మెంట్ లేదు:
డిబేట్ వేదికగా సదరు పెన్షనర్ ఉద్యోగి పీఆర్సీ జాప్యంపై మండిపడ్డారు. మేము ప్రభుత్వ సర్వీసు నుంచి మాత్రమే రిటైర్ అయ్యాం.. కానీ మా ఆత్మగౌరవం నుంచి, మా హక్కుల నుంచి రిటైర్ కాలేదు. వయసు పెరిగినంత మాత్రాన న్యాయబద్ధమైన హక్కుల కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నించే ధైర్యం తగ్గలేదు. ప్రభుత్వ సేవ నుంచి తప్పుకున్నాం తప్ప.. ప్రజాస్వామ్య పోరాటాల నుంచి మేము విరమించుకోలేదు.

దశాబ్దాల పాటు ప్రభుత్వ వ్యవస్థ అభివృద్ధిలో భాగస్వాములైన పెన్షనర్లకు.. ఉద్యోగ విరమణ అనంతరం గౌరవప్రదమైన జీవితం గడపడానికి అవసరమైన ఆర్థిక భద్రతను కల్పించాల్సిన కనీస బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. PRC అనేది కేవలం పనిచేస్తున్న ఉద్యోగుల జీతభత్యాలకే కాకుండా పెన్షనర్ల భవిష్యత్తుపై కూడా నేరుగా ప్రభావం చూపుతుందని, అందుకే పీఆర్సీ విషయంలో పెన్షనర్లకు పూర్తి ఆసక్తి, ఆందోళన ఉన్నాయని స్పష్టం చేశారు.

ఐక్య పోరాటానికి సిద్ధం.. జేఏసీ వెంటే పెన్షనర్లు:
ఉద్యోగ సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఇప్పటివరకు ప్రభుత్వంతో చర్చల విషయంలో ఎంతో సంయమనం పాటించిందన్న విషయాన్నిఆయన గుర్తుచేశారు. ఒకవేళ పీఆర్సీ గడువు ముగిసిన తర్వాత కూడా ప్రభుత్వం నుంచి స్పష్టమైన నిర్ణయం వెలువడకపోతే, జేఏసీ చేపట్టే ఏ ప్రజాస్వామ్య పోరాటానికైనా విశ్రాంత ఉద్యోగులంతా ముందువరుసలో నిలుస్తారని హెచ్చరించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు వేర్వేరు కాదని, అందరం ఒకే కుటుంబమని స్పష్టం చేశారు. ఒకరి సమస్య మరొకరితో ముడిపడి ఉన్నందున ఈ కీలక సమయంలో రాజకీయాలు, వ్యక్తిగత విభేదాలకు అతీతంగా ఐక్యత చాటాల్సిన అవసరం ఉందన్నారు.  ఇది ఏ ఒక్కరికో లేదా ప్రభుత్వానికో వ్యతిరేకంగా చేసే వ్యక్తిగత పోరాటం కాదని, రాజ్యాంగం కల్పించిన హక్కులను సాధించుకోవడానికి సాగించే ధర్మపోరాటం అన్నారు.

సాగదీత వద్దు: 
ప్రభుత్వం ఉద్యోగుల, పెన్షనర్ల అసంతృప్తిని తేలికగా తీసుకోకూడదని విజ్ఞప్తి చేశారు. పీఆర్సీ నివేదికను బహిర్గతం చేసి, చర్చల ద్వారా సమస్యకు త్వరితగతిన పరిష్కారం చూపాలంటూ  డిమాండ్ చేశారు. సమస్యను పదేపదే సాగదీయడం వల్ల ఉద్యోగుల్లో ఆందోళన మరింత పెరిగి, క్షేత్రస్థాయిలో నిరసనలకు దారితీసే ప్రమాదం ఉందని ఆయన హెచ్చరించారు. న్యాయబద్ధమైన హక్కులను సాధించుకునే వరకు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లమంతా ఒకే తాటిపై నిలిచి పోరాడుతామని, విశ్రాంత ఉద్యోగులుగా తుదివరకు ఈ ఉద్యమంలో వెన్నుదన్నుగా ఉంటామని డిబేట్ వేదికగా స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES