SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

మందు బాబులకు షాక్.. తెలంగాణలో నేటి నుంచి బార్ అండ్ రెస్టారెంట్స్ బంద్..

Telangana Bars & Liquor Shops Closed: తెలంగాణలో మందు బాబులకు పెద్ద షాక్. బయట ఆఫీసు.. ఇంటి పనుల ఒత్తిడి నుంచి కాస్త సేద తీరుదామని బార్లకు వెళ్లే వాళ్లకు ఇపుడు పెద్ద షాక్ ఇచ్చేలా ఉంది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం పెంచిన ప్రివిలేజ్‌ సెస్‌ను రద్దు చేయాలని కోరుతూ నేటి నుంచి బార్ అండ్ రెస్టారెంట్స్ బంద్ చేయనున్నట్టు తెలంగాణ బార్ అండ్ రెస్టారెంట్స్ అసోషియేషన్ తెలిపింది.

Written By TA Kiran Kumar Sharma
Published: Oct 05, 2026, 01:08 PM IST | Updated: Oct 05, 2026, 01:16 PM IST
Image Credit: Liquor Shops Restaurants Closed (File/Source)
Join

Liquor shops Restaurants Closed: తెలంగాణ వ్యాప్తంగా బార్ అండ్ రెస్టారెంట్స్ బంద్ చేయబోతున్నట్టుగా అసోసియేషన్ సభ్యులు ప్రకటించారు. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌తో బార్ అండ్ రెస్టారెంట్ వాళ్లు తీవ్రంగా నష్టపోతున్నట్టు వారు ఆరోపిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌ను వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రివిలెజ్ సెస్‌తో తీవ్రంగా నష్టపోతున్నామన్న రెస్టారెంట్ల యజమానులు..

సర్కార్ ప్రివిలెజ్ సెస్ పేరిట ఏటా ఒక్కో బార్ నుంచి 8 శాతం నుంచి 20శాతం వరకు వసూలు చేయాలని నిర్ణయించింది. ఈ నిర్ణయంతో ప్రతియేటా సుమారు రూ. 30 లక్షల రూపాయల వరకు అదనంగా బార్లపై భారం పడుతుందన్నారు. ఇప్పటికే బార్ మెయింటెన్స్ సహా సిబ్బంది జీతాలు సహా ప్రతీది భారం కావడంతో  బార్ అండ్ రెస్టారెంట్ ఓనర్స్ అసోసియేషన్ సభ్యులు వెంటనే ప్రభుత్వం సెస్ ఛార్జీలు తగ్గించమని కోరుతున్నారు.   ఇప్పటికే వైన్ షాప్స్‌కు  పర్మిట్  రూమ్‌లకు అనుమతి ఇవ్వడం.. దీనికితోడు బెల్ట్ షాపులతో తాము తీవ్రంగా నష్టపోతున్నట్టు బార్ అండ్ రెస్టారెంట్స్ యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


ఆబ్కారీ భవన్‌ను ముట్టడిస్తాం: బార్ అండ్‌ రెస్టారెంట్ల యజమానులు..

ఇన్ని కష్టాలు వెంటాడుతున్నా.. బార్ల వార్షిక లైసెన్స్ ఫీజు పేరుతో ప్రతిఏటా ప్రభుత్వానికి రూ. 33 లక్షల నుంచి రూ. 56 లక్షల రూపాయలు టాక్సులు రూపేణా చెల్లిస్తున్నామన్నారు. ఇదీ చాలదన్నట్టు ప్రివిలెజ్ సెస్ పేరుతో అధనంగా రూ.  30 లక్షల వరకు ఒక్కో బార్ పై భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తీసుకొస్తున్న ప్రివిలెజ్ సెస్‌ను వెంటనే రద్దు చేయాలని లేదంటే..ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం దగ్గర ధర్నా నిర్వహిస్తామని హెచ్చరించారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

కిరణ్ కుమార్ శర్మ తంజావూర్ జీ తెలుగు తెలుగు న్యూస్‌లో ఛీఫ్ సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి  వినోదం, ఆధ్యాత్మికం, జాతీయ, అంతర్జాతీయ, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. సినిమా రివ్యూలు, సినిమాలకు సంబంధించి ప్రత్యేక కథనాల్లో ఎక్స్‌పర్ట్. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు. ఆయనకు జర్నలిజంలో 18 ఏళ్లకుపైగా అనుభవం ఉంది.

ZEENEWS TRENDING STORIES