• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /జాతీయం
  • /Delhi: క్రిమినల్స్ గుండెల్లో వణుకు పుట్టాల్సిందే.. అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

Delhi: క్రిమినల్స్ గుండెల్లో వణుకు పుట్టాల్సిందే.. అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..

Supreme court on Delhi rape case: నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, నేరాలు జరగకుండా నివారించడమే అత్యంత ముఖ్యమని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వరుసగా చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై అత్యున్నత ధర్మాసనం సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది.

Written ByInamdar Paresh
Published: Oct 05, 2026, 02:36 PM IST|Updated: Oct 05, 2026, 02:46 PM IST
joinshare
Delhi:  క్రిమినల్స్ గుండెల్లో వణుకు పుట్టాల్సిందే.. అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు..
Image Credit: supremecourt(file)

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
TV Anchor Turned To Actress: ఒకప్పుడు బుల్లితెర యాంకర్..నేడు ఒక్క సినిమాకి రూ.20 కోట్ల పారితోషికం తీసుకునే స్టార్ హీరోయిన్‌!

TV Anchor Turned To Actress: ఒకప్పుడు బుల్లితెర యాంకర్..నేడు ఒక్క సినిమాకి రూ.20 కోట్ల పారితోషికం తీసుకునే స్టార్ హీరోయిన్‌!

2

Kavitha Strike: ఆమరణ దీక్ష చేస్తానని కవిత ప్రకటన.. ఏ డిమాండ్‌పై అంటే?

3

Mahabubabad: గురుకుల హస్టళ్లలో ఎలుకల కలకలం.. రాత్రిళ్లు చేతులు, కాళ్లను కొరుకుతూ.. లబో దిబో మంటున్న విద్యార్థులు.!.

4

దసరా పండగకు ముందు కార్మికులకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్ .. వేరియబుల్ DA పెంచుతూ నిర్ణయం..!!

5

Srinidhi Shetty: యష్ కంటే నానినే బెస్ట్ అంటున్న శ్రీనిధి.. అసలు కారణం ఇదే!

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Supreme court on delhi ncr rape case and women safety: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని కఠిన చట్టాలు తీసుకొచ్చిన,ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న కూడా కామాంధులు మాత్రం మారడంలేదు. ప్రతి రోజు మహిళలపై అత్యాచారాలు,దాడులకు చెందిన ఘటనలు వార్తలలో ఉంటున్నాయి. పసిపాపల నుంచి పండు ముసలి వరకు ఎవరిని కూడా నీచులు వదలడంలేదు. ఈ క్రమంలో ఇటీవల ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వరుసగా చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుని విచారణ చేపట్టింది.ఈ క్రమంలో అత్యున్నత ధర్మాసనం సంచలన వ్యాఖ్యలు చేసింది.

కేసు విచారణ నేపథ్యంలో జస్టిస్ పార్థీవాలా మాట్లాడుతూ.. మహిళలపై దాడులకు పాల్పడాలనుకునే దుండగులకు ఇక నుంచి వెన్నులో వణుకు పుట్టేలా చర్యలుంటాయని  భయం కలగాలన్నారు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకుని దారుణాలకు పాల్పడే వారికి వెన్నులో వణుకు పుట్టేలా చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. అలాంటి వాతావరణాన్ని మీరు కల్పించాలని సూచించారు.

మహిళలపై నేరాలకు పాల్పడే సంఘ వ్యతిరేక శక్తులు, దుండగుల మనసుల్లో భయాన్ని సృష్టించాల్సిన అవసరం ఉందని సుప్రీంకోర్టు తెల్చిచెప్పింది. ఇక మీదట నేరం జరిగిన తర్వాత చర్యలు తీసుకోవడం కంటే, నేరాలు జరగకుండా నివారించడమే అత్యంత ముఖ్యమని ఢిల్లీ పోలీసులకు కీలక సూచనలు చేసింది. 

ఇటీవల ఢిల్లీ-జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్)లో వరుసగా చోటుచేసుకున్న అత్యాచార ఘటనలపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించింది. క్రైమ్ లను నివారణ చర్యలను ఇంకా పకట్బందిగా అమలు చేయాలని సూచించింది. ఢిల్లీలో మహిళల భద్రతకు సంబంధించి పలు నిర్దిష్ఠ‌ ఆదేశాలను ధర్మాసనం జారీ చేసింది.

నిరంతరం నిఘాపెట్టాలని, రాత్రి పూట కూడా పోలీసులు గస్తీ నిర్వహించాలని ఆదేశించింది. సమస్యాత్మక ప్రాంతాల్లో బీట్ పెట్రోలింగ్‌ను చేపట్టాలని సూచించింది. గుంపులుగా జనాలు, పోకిరీలు ఎక్కువగా ఉండే ప్రాంతాలు గుర్తించి గస్తీకాయాలని ఆదేశించింది.

రాత్రి 11ల సమయంలో కూడా ఢిల్లీ ఎన్ సీఆర్ ప్రాంతంలో మహిళలు రోడ్లపై, మెట్రోల్లో స్వేఛ్చగా , భద్రంగా తిరిగే పరిస్థితులు కల్పించాలని  ఆదేశించింది. ఇటీవల ఢిల్లీలోని ఒక పార్క్ లో 17 ఏళ్ల అమ్మాయిపై సాముహిక అత్యాచారం ఘటన దేశంలో దుమారంగా మారిన విషయం తెలిసిందే. మరల స్లీపర్ బస్సులో మైనర్ బాలికపై అత్యాచారం జరిగింది. 

ఈ వరుస ఘటనలపై సుప్రీంకోర్టు ఢిల్లీ పోలీసులకు కీలక ఆదేశాలు జారీ చేసింది. మరోవైపు సుప్రీంకోర్టు తాజా ఆదేశాలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి.

 

Add Zee News as a Preferred Source
TAGS:
Supreme Court
National News
Crime News