Etela Rajender: ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత నాగార్జునకు భారీగా లబ్ది.. సీఎం రేవంత్ పై ఈటల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు..
Etela rajender fires on cm revanth reddy: ఎంపీ ఈటల రాజేందర్ కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. అంతే కాకుండా రాహుల్ గాంధీ హైదరాబాద్ యాత్రపై తీవ్ర విమర్శలు గుప్పించారు. రాజ్యంగ బద్ద సంస్థలైన ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టులపై వ్యాఖ్యలు చేయడం ఏంటని మండిపడ్డారు.
Bjp mp Etela rajender fires on cm revanth reddy govt: తెలంగాణ రాజకీయాలు ప్రస్తుతం కాక రేపుతున్నాయి. కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన నేపథ్యంలో అపోసిషన్ పార్టీలకు చెందిన నేతలు ఒకరిపై మరోకరు విమర్శల వాగ్బాణాలు వేసుకుంటున్నారు. ఇక తెలంగాణ బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ రాహుల్ గాంధీ హైదరాబాద్ పర్యటనపై, సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా రాజ్యంగ బద్ద సంస్థలైన సుప్రీంకోర్టు, ఎన్నికల సంఘంపై రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణల్ని ఖండించారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హమీలపై చర్చకు సిద్దమా..?.. అంటూ సవాల్ విసిరారు. ప్రధాని మోదీ 12ఏళ్ల పాలనలో ఒక్క అవినీతి కూడా లేదన్నారు. కాంగ్రెస్ మాత్రం ప్రజాప్రభుత్వం అంటూ ప్రజల్ని మోసం చేసిందన్నారు.
ఎన్నికల మేనిఫెస్టోను సీఎం రేవంత్ రెడ్డి తుంగలో తొక్కారని, ఫీజు రీయింబర్స్ మెంట్, రైతులకు రుణమాఫి అంటూ విమర్శలు చేశారు. నాగార్జున ఎన్ క్లేవ్ కూల్చివేతలపై కూడా సీఎం రేవంత్ రెడ్డి సర్కారుపై విమర్శలు గుప్పించారు. ఇటీవల మాదాపూర్ లో తమ్మిడికుంట చెరువు ప్రారంభోత్సవంకు హీరో నాగార్జునను చీఫ్ గెస్ట్ గాపిలిచారని సెటైరికల్ గా మాట్లాడారు.
మరోవైపు ఆయన ఎన్ కన్వెన్షన్ కూల్చివేసిన దానికంటే రెట్టింపు లబ్దిని కాంగ్రెస్ ప్రభుత్వం కల్పించిందన్నారు. ఈ కథను తొందరలోనే బైటపెడ్తామని కాంగ్రెస్ ప్రభుత్వంపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. హైడ్రా మంచి పనులు చేస్తుందంటూ సోషల్ మీడియాలో ఫెక్ ప్రచారాలు చేస్తున్నారని ఎంపీ ఈటల రాజేందర్ ఎద్దేవా చేశారు. రాహుల్ గాంధీ పద్ధతి, మాటలు చూసి కాంగ్రెస్ పార్టీకి ఇంత చిల్లర వ్యక్తి నాయకత్వం వహిస్తున్నారా ? అనిపిస్తుందని సెటైర్లు వేశారు.
త్యాగాల పునాదుల మీద భారతదేశం నిర్మాణం జరిగిందన్నారు. నెహ్రూ ప్రధానిగా ఉన్నపుడు మిలట్రీ వ్యాన్లు కొనుగోళ్లలో అవినీతి జరిగిందని గుర్తు చేశారు. సొంత క్యాబినెట్ మంత్రులను జైలుకు పంపిన చరిత్ర కాంగ్రెస్ దంటూ ఏకీపారేశారు. బాంబు పేలుళ్ల ఘటనలు జరిగింది కాంగ్రెస్ హయంలోనే కదా అంటూ మాట్లాడారు. ప్రజాస్వామ్యాన్ని కూని చేసిన పార్టీ కాంగ్రెస్ అని మాట్లాడారు.
మోదీ పాలనలో ఒక్క రాష్ట్రంలోనైనా రాష్ట్రపతి పాలన విధించారా ?.. అంటూ ఫైర్ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం 30 శాతం కమిషన్ల ప్రభుత్వమని ప్రజలు చెబుతున్నారని ఈటల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణాలో 15 శాతం కమిషన్ ఇవ్వకపోతే ఉద్యోగులకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఇవ్వడం లేదని, కరువు కోరల్లో చిక్కుకున్న రాష్ట్రంలో సమ్మిట్ ల పేరుతో కోట్ల రూపాయలు వృదా చేస్తున్నారని ఫైర్ అయ్యారు. ఇతర దేశాలు సైతం ప్రధాని మోదీ పాలనను కొనియాడుతున్నాయన్నారు. రాహుల్ గాంధీ ఫోన్ ను ట్యాప్ చేయాల్సిన అవసరం కేంద్రంకు లేదన్నారు. మరల కాంగ్రెస్ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.