• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • / బతుకమ్మకు 9 రోజుల ముందే ప్రారంభమయ్యే వేడుక.. 'బొడ్డెమ్మ' వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

బతుకమ్మకు 9 రోజుల ముందే ప్రారంభమయ్యే వేడుక.. 'బొడ్డెమ్మ' వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

Boddemma:తెలంగాణ పల్లె పండగ అంటే కేవలం భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే కాదు.. మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న అక్షయ బంధానికి అద్దంపట్టే అద్బుతమైన జానపద సంప్రదాయం.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 05, 2026, 09:17 AM IST|Updated: Oct 05, 2026, 09:19 AM IST
joinshare
 బతుకమ్మకు 9 రోజుల ముందే ప్రారంభమయ్యే వేడుక.. 'బొడ్డెమ్మ' వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?
Image Credit: Boddemma Festival:

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!

నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. ప్రభుత్వ బీమా సంస్థలో 450 ఉద్యోగాలు! ఏ డిగ్రీ ఉన్నా ఓకే! సిలబస్‌ పూర్తి వివరాలు!

2

Maharashtra: మహారాష్ట్రలోని స్కూల్లో దారుణం.. నిద్రలో ఉండగా 500 మంది విద్యార్థుల జుట్టులు కత్తిరింపు.!.

3

గురువుల గొప్పతనాన్ని చాటే రోజు.. అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం వెనుక ఉన్న అసలు నిజాలు!

4

CEC Gyanesh Kumar: సీఈసీ ఏకపక్ష నిర్ణయాలు.. సుప్రీంలో విచారణ, రాజీనామా చేయాల్సిందేనా?

5

బతుకమ్మకు 9 రోజుల ముందే ప్రారంభమయ్యే వేడుక.. 'బొడ్డెమ్మ' వెనుక ఉన్న కథ ఏంటో తెలుసా?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Boddemma: తెలంగాణ పల్లె పండగ అంటే కేవలం భక్తి శ్రద్ధలతో జరుపుకునే ఆధ్యాత్మిక ప్రక్రియ మాత్రమే  కాదు.. మనిషికి ప్రకృతికి మధ్య ఉన్న అక్షయ బంధానికి అద్దంపట్టే అద్బుతమైన జానపద సంప్రదాయం. మట్టివాసనలు.. తంగేడు గునుగు పూల వర్ణాలు.. ఆడపడుచుల కంఠాల నుంచి జాలువారే స్వరాలు.. ఇవన్నీ కలగలిపి జరుపుకునే ప్రకృతి వేడుకల్లో బొడ్డెమ్మ మొదటిది. ముత్తయిదువలు.. జరుపుకునే బతుకమ్మ ఉత్సవానికి 9 రోజుల ముందే.. భాద్రపద బహుళ పంచమి నాడు ప్రారంభమవుతుంది. మహాలయ అమావాస్య వరకు ఎంతో వైభవంగా సాగే ఈ పండగా పూర్తిగా కన్నెపిల్లల వేడుకే. పసిడి ప్రాయంలో ఉన్న బాలికలకు చిన్నప్పటి నుంచే ప్రకృతి పట్ల గౌరవాన్ని, కుటుంబ అనుబంధాల పట్ల అవగాహనను.. సామాజిక స్ప్రుహను నేర్చుకోవడం ఈ బొడ్డెమ్మ పండగ వెనుకున్న అసలు ఉద్దేశ్యం.

బొడ్డెమ్మ పుట్టుక గురించి తెలంగాణ పల్లెల్లో ఎంతో ఆసక్తిని కలిగించే పౌరాణిక కథ ప్రచారంలో ఉంది. తండ్రి దక్షుడి యజ్నంలో భర్త పరమశివునికి జరిగిన పరాభవాన్ని తట్టుకోలేని సతీదేవి ఆత్మాహుతి చేసుకుంటుంది. ఆ తర్వాత లోక కల్యాణం కోసం మట్టి నుంచి ఉద్బవించిన జగన్మాత బాల్య రూపమే ఈ బొడ్డెమ్మ అని పౌరాణిక గాథలు చెబుతున్నాయి. ఆ జగన్మాత పెద్దగా అయ్యాక వికసించిన రూపమే బతుకమ్మ అని గ్రామీణ ప్రజలు నమ్ముతుంటారు. అందుకే బొడ్డెమ్మను సౌభాగ్యానికి.. సంతానవ్రుద్ధికి. సృష్టి శక్తులకు ప్రతీకగా భావించి పూజలు చేస్తుంటారు. ఈ పండగలో  పుట్టమట్టి చతురస్రాకార పీఠాన్ని వేస్తారు..దానిపై 5 లేదా 7 అంతస్తుల గోపురాన్ని నిర్మిస్తారు. శిఖర భాగంలో బియ్యంతో నిండిన కలశం, పుసుపు గౌరమ్మను ప్రతిష్టించి..తంగేడు, గునుగు, కట్ల వంటి ప్రక్రుతి సిద్ధమైన పూలతో ఆ మట్టి గోపురాన్ని కళాత్మకంగా అలంకరిస్తారు.

9 రోజుల పాటు ఎంతో వైభవంగా సాయంత్రం అవ్వగానే.. వీధిలో బాలికలందరూ తమ ఇళ్ళ ముందు ప్రతిష్టించిన బొడ్డెమ్మ చుట్టూ చేరి లయబద్ధంగా చప్పట్లు కొడుతూ.. వలయాకారంగా తిరుగుతూ.. జానపదా గేయాలు చక్కగా పాడుతుంటారు. లక్ష్మీ, పార్వుతుల స్తుతులతో పాటు అత్తాకోడళ్ల ముచ్చట్లు.. అన్నదమ్ముల ప్రేమానురాగాలు, ప్రక్రుతి అందాలను ప్రతిబింబించే ఈ పాటలు గ్రామీణ  సంస్క్రుతికి జీవకళను తెచ్చిపెడతాయి. ఈ రోజుల్లో బొడ్డెమ్మకు సమర్పించే బియ్యం పిండి.. బెల్లం, నువ్వులు, పల్లీలతో తయారు చేసిన నైవేద్యాలు పెరిగే వయసులో ఉన్న కన్నె పిల్లలకు అవసరమైన కాల్షియం, ఐరన్, ప్రొటీన్లను పుష్కలంగా అందిస్తాయి. మట్టితో మొదలై.. పూలతో వికసించి.. నీటిలో నిమజ్జనంతో ముగిసే బొడ్డెమ్మ పండగ కేవలం వినోదం మాత్రమే కాదు.. మానవాళికి ప్రక్రుతితో మమేకమై జీవించాలన్న గొప్ప సందేశంతోపాటు కళాత్మక ఆలోచనలను నేర్పించే ఒక అద్బుతమైన సాంస్క్రతిక పాఠశాల అని చెప్పాలి.

బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్.. బిడ్డాలెందారే కోల్..

ఒక్కగానొక్క బిడ్డ కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

ఒక్క బిడ్డ నేమి పేరు కోల్.. బిడ్డాలెందారే కోల్..

ఒక్క బిడ్డ సీతాలక్ష్మి కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

రెండో బిడ్డ నేమి పేరు కోల్.. బిడ్డాలెందారే కోల్..

రెండో బిడ్డ రాజలక్ష్మి కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

మూడో బిడ్డ నేమి పేరు కోల్.. బిడ్డాలెందారే కోల్..

మూడో బిడ్డ ముత్యాలక్ష్మి కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

నాలుగో బిడ్డ నేమి పేరు కోల్.. బిడ్డాలెందారే కోల్..

నాలుగో బిడ్డ భాగ్యలక్ష్మి కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

ఐదో బిడ్డ నేమి పేరు కోల్.. బిడ్డాలెందారే కోల్..

ఐదో బిడ్డ ఆదిలక్ష్మి కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

ఏమేమి పూలమ్మ కోల్.. బిడ్డాలెందారే కోల్..

తంగేడు పూలమ్మ కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

గునుగు పూలమ్మ కోల్.. బిడ్డాలెందారే కోల్..

చేమంతి పూలమ్మ కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

ఏమేమి నైవేద్యం కోల్.. బిడ్డాలెందారే కోల్..

బెల్లము సద్దమ్మ కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

నువ్వుల సద్దమ్మ కోల్.. బిడ్డాలెందారే కోల్..

పల్లీల సద్దమ్మ కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

బొడ్డెమ్మ బొడ్డెమ్మ కోల్.. బిడ్డాలెందారే కోల్..

ఒక్కగానొక్క బిడ్డ కోల్.. ఉయ్యాలొ లాలి ఉయ్యాలో..!

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:
Telugu News
Telangana News
Festivals