Above 500 school students hair cut row in maharashtra: మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. చిమూర్ తాలూకాలోని జంబుల్‌ఘాట్‌లోని ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాలలో విద్యార్థులు జుట్టులు కత్తిరించిన ఘటన తీవ్ర వివాదంగా మారింది. ముఖ్యంగా ఆశ్రమ పాఠశాలలోని విద్యార్థుల జుట్టులనువారు నిద్రలో ఉండగా ఆశ్రమ పాఠశాల సిబ్బంది రాత్రి నుంచి తెల్లవారు జాము 4 గంటల వరకు కత్తిరించిన ఘటన వెలుగులోకి వచ్చింది.
కొంత మంది విద్యార్థులకు జుట్టులు కట్ చేస్తుండగా చార్జింగ్ అయిపొవడంతో అలానే వదిలేశారు. దీంతో రాత్రిపూట కొంత మంది సడెన్ గా మేల్కొని, ఆతర్వాత ఉదయం పూటకొంత మంది విద్యార్థులు తమ జుట్టును చూసుకుని తల్లిదండ్రులకు చెప్పగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.
ఈ ఘటనకు చెందిన పిక్స్ వైరల్ కాగా దీనిపై స్థానికంగా వివాదం రాజుకుంది. దీనిపై విద్యార్థుల తల్లిదండ్రులు స్కూళ్లకు చేరుకుని
సూపరింటెండెంట్ ప్రశాంత్ మేశ్రామ్ ను నిలదీశారు. దీనికి ఆయన..వర్షాకాలంలో వారి జుట్టు కత్తిరించలేదని, ఎండల కారణంగా బయట ఆడుకుని సరిగా తలస్నానం చేయకపోవడంతో చుండ్రు, ఇతర చర్మ సమస్యలు పెరిగాయన్నారు.
అందుకే ఈవిధంగా చర్యలు తీసుకున్నామని తెలిపారు. మొత్తంగా సగం కత్తిరించిన ఫొటోలు వైరల్ కావడంతో దీనిపై ఉన్నతాధికారులు సైతం సీరియస్ అయ్యారు. మరోవైపు తల్లిదండ్రుల అనుమతి లేకుండా అది కూడా స్టూడెంట్స్ నిద్రలో ఉండగా ఈ విధంగా చేయడం ఏంటని స్థానికులు సైతం మండి పడుతున్నారు. ఈ ఘటనపై గిరిజన అభివృద్ధి శాఖ అధికారులు పూర్తి స్థాయి విచారణ జరిపి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేస్తున్నారు.