SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

ఆడపిల్లలే కాదు.. మగపిల్లలూ బాధితులే.. బాలురపై లైంగిక వేధింపుల ముప్పు.. కలవరపెడుతున్న షాకింగ్ నిజాలు..!!

Child Sexual Abuse: దేశంలో మగపిల్లలపై లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నట్లు ఇటీవల వెలువడిన పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. సమాజంలో ఎదురయ్యే అవమానం, పరువు పోతుందనే భయం.. అవగాహన రాహిత్యం కారణంగా అనేక కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో బాలికలతో పాటు బాలురపై జరుగుతున్న లైంగిక అక్రమాలు కూడా ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతున్నాయి.

Reported By Bhoomi Written By Bhoomi
Published: Oct 12, 2026, 09:30 AM IST | Updated: Oct 12, 2026, 09:31 AM IST
Image Credit: Child Sexual Abuse
Join

Child Sexual Abuse: దేశంలో మగపిల్లలపై లైంగిక వేధింపుల ఘటనలు ఆందోళనకర రీతిలో పెరుగుతున్నట్లు ఇటీవల వెలువడిన పలు నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. అయితే.. సమాజంలో ఎదురయ్యే అవమానం, పరువు పోతుందనే భయం.. అవగాహన రాహిత్యం కారణంగా అనేక కుటుంబాలు పోలీసులకు ఫిర్యాదు చేయడానికి వెనుకాడుతున్నట్లు తెలుస్తోంది. భారతదేశంలో బాలికలతో పాటు బాలురపై జరుగుతున్న లైంగిక అక్రమాలు కూడా ఒక తీవ్రమైన సామాజిక సమస్యగా మారుతున్నాయి.

వాస్తవానికి మన దేశంలోని  పోక్సో చట్టం జెండర్‌తో సంబంధం లేకుండా పిల్లలందరికీ పూర్తిస్థాయి రక్షణ కల్పిస్తుంది. 18 సంవత్సరాల లోపు ఉన్న బాలబాలికలలో ఎవరైనా సరే లైంగిక వేధింపులు లేదా దాడులకు గురైతే, ఈ చట్టం కింద నేరస్తులపై కఠినమైన చర్యలు తీసుకోవడానికి స్పష్టమైన నిబంధనలు ఉన్నాయి. ఈ ఏడాది 9 నెలల్లో ఏకంగా 62 పోక్సో కేసులు నమోదు కావడం పరిస్థితి తీవ్రత ఎలా ఉందో అర్థమవుతోంది. అయితే పరువు పోతుందన్న భయం.. సమాజం ఏమనుకుంటోనన్న ఆందోళనతో ఎన్నో దారుణాలు నాలుగు గోడల మధ్యే ఉండిపోతున్నాయి. వెలుగు చూడని కేసులు ఇంకా ఎన్నో పోలీసు శిశు సంక్షేమ శాఖల అధికారులు చెబుతున్నారు.

రాష్ట్రంలో బాలురపై జరుగుతున్న లైంగిక దాడులు.. వేధింపుల ఘటనలు రోజురోజుకూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. పోలీసు శాఖ వెల్లడించిన అధికారిక గణాంకాల ప్రకారం 2024 నుంచి ఇప్పటివరకు మొత్తం 127 మంది మగపిల్లలు ఈ దారుణాల బారిన పడ్డారు. 2024లో రాష్ట్రవ్యాప్తంగా కేవలం 4 కేసులు మాత్రమే నమోదు కాగా, 2025 నాటికి ఆ సంఖ్య ఏకంగా 61కి పెరిగింది. ఇక 2026 సంవత్సరంలో పరిస్థితి మరింత తీవ్రంగా మారింది. జనవరి నుంచి సెప్టెంబర్ వరకు కేవలం తొమ్మిది నెలల వ్యవధిలోనే 62 కేసులు రికార్డయ్యాయి. గత ఏడాది మొత్తం నమోదైన కేసుల సంఖ్యను ఈ ఏడాది కేవలం తొమ్మిది నెలల్లోనే దాటేయడం సమస్య తీవ్రతకు నిదర్శనంగా నిలుస్తోంది.

అయితే సమాజంలో లైంగిక దాడులు అనగానే కేవలం ఆడపిల్లలకు మాత్రమే ఎదురయ్యే సమస్యగా భావించే అపోహ బలంగా పాతుకుపోవడంతో.. తమ ఇంట్లోని మగపిల్లలకు ఇలాంటి దారుణం ఎదురైనప్పుడు తల్లిదండ్రులు తీవ్ర దిగ్భ్రాంతికి గురవుతున్నారు. ధైర్యం చేసి బయటకు చెబితే కుటుంబ పరువు పోతుందని, సమాజంలో అపఖ్యాతి పాలవుతామనే భయంతో పాటు బిడ్డ భవిష్యత్తు ఏమవుతుందోనన్న ఆందోళనతో చాలామంది ఫిర్యాదు చేయడానికి ముందుకు రావడం లేదు. బాధితుల మౌనాన్ని ఆసరాగా చేసుకుని నిందితులు మరింతగా తెగబడుతున్నారని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. నమోదు కాని కేసులను కూడా పరిగణనలోకి తీసుకుంటే వాస్తవ బాధితుల సంఖ్య రికార్డుల కంటే చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.

క్రైమ్ రికార్డుల ఆధారంగా బాలురపై అఘాయిత్యాలకు పాల్పడుతున్న వారిలో ఎక్కువగా బంధువులు.. పరిచయస్తులు, ఇరుగుపొరుగు వారు లేదా పాఠశాలలు, హాస్టళ్ల సిబ్బందే ఉంటున్నారని తెలుస్తోంది. ఆటల సాకుతోనో, మాయమాటలు చెప్పో పసివాళ్ల అమాయకత్వాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆడపిల్లలతో పాటు మగపిల్లలకు కూడా చిన్నతనం నుంచే  గుడ్ టచ్ - బ్యాడ్ టచ్  పై అవగాహన కల్పించాలని శిశు సంక్షేమ శాఖ సూచిస్తోంది. పిల్లల ప్రవర్తనలో అకస్మాత్తుగా అసాధారణ మార్పులు రావడం, నిర్దిష్ట వ్యక్తి వద్దకు వెళ్లడానికి భయపడటం లేదా నిద్రలో ఉలిక్కిపడి లేవడం వంటి సంకేతాలు కనిపిస్తే వెంటనే గమనించి ప్రేమగా ఆరా తీయాలి. భయపడి నేరగాళ్లను వదిలేయకుండా ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు లేదా చైల్డ్ హెల్ప్‌లైన్ 1098 కు ఫిర్యాదు చేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES