• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee News Telugu
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /CM Revanth reddy: తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలి.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

CM Revanth reddy: తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలి.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

cm revanth reddy in global business meet: కాంగ్రెస్ ప్రభుత్వం మంచి పాలసీతో ఎవరు వచ్చినా ప్రోత్సహిస్తున్నామని తెలిపారు. జనాభా శాతాన్ని మించి తెలంగాణ రాష్ట్రం జీడీపీకి తన వాటా అందిస్తోందని వ్యాఖ్యలు చేశారు.

Written ByInamdar Paresh
Published: Oct 14, 2026, 02:49 PM IST|Updated: Oct 14, 2026, 03:06 PM IST
joinshare
CM Revanth reddy: తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలి.. సీఎం రేవంత్  ఆసక్తికర వ్యాఖ్యలు..
Image Credit: cm revanth reddy

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Rashmika Mandanna: 400 కుటుంబాలకు అండగా నిలిచిన నేషనల్ క్రష్!

Rashmika Mandanna: 400 కుటుంబాలకు అండగా నిలిచిన నేషనల్ క్రష్!

2

AP Elections: ఆంధ్రప్రదేశ్‌లో మోగిన స్థానిక సంస్థల ఎన్నికల సమరం.. షెడ్యూల్‌ విడుదల

3

‘రణబాలి’ రివ్యూ.. విజయ్ దేవరకొండ ఖాతాలో హిట్ పడినట్టేనా..!!

4

CM Revanth reddy: దసరా పండగ వేళ మందుబాబులకు ఝలక్.. ఆ బ్రాండ్ ధరలు భారీగా పెంచిన సీఎం రేవంత్ ప్రభుత్వం.!.

5

CM Revanth reddy: తెలంగాణ ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా మారాలి.. సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు..

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Cm revanth reddy speech in Samakhya Global Business meet: సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ రైజింగ్ పాలసీతో అనుకూలమైన విధానాలను అనుసరిస్తున్నామని వెల్లడించారు. హైదరాబాద్ హైటెక్స్ లో సమాఖ్య సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి పాలసీ పెరాలసిస్ లేదని మాట్లాడారు.  తెలంగాణ రైజింగ్ పాలసీతో అనుకూలమైన విధానాలను అనుసరిస్తున్నామని సీఎం రేవంత్ సమావేశంలో మాట్లాడారు.  

జనాభా శాతాన్ని మించి తెలంగాణ రాష్ట్రం జీడీపీకి తన వాటా అందిస్తోందిన్నారు.
సమాఖ్య అనే పదానికి చాలా బలం ఉందని, పురాతన కాలంలో వస్తు మార్పిడి పద్దతి ద్వారా వ్యాపారంజరిగేదని రేవంత్ గుర్తు చేశారు. ఆధునిక యుగంలోనూ సమాఖ్యల అవసరం చాలా ఉందని పేర్కొన్నారు. ప్రస్తుతం వస్తున్న మార్పులను తెలుసుకోవడానికి అంది పుచ్చుకోవడానికి సమాఖ్యలు ఉపయోగపడుతాయని పేర్కొన్నారు.

కొత్త తరం అభివృద్ధి చెందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమని పేర్కొన్నారు. సినిమా, రాజకీయ రంగాల్లో మున్నూరు కాపు సామాజిక వర్గం నుంచి వివిధ హోదాల్లో రాణించారని అన్నారు. ఉన్నత శిఖరాలకు ఎదగడమే కాదు.. అందరికీ ఆదర్శంగా నిలిచారన్నారు.

సక్సెస్ స్టోరీస్ ను సమాఖ్య నిక్షిప్తం చేసి కొత్త తరానికి అందించాలని,  2047  నాటికి స్వతంత్ర భారతం వందేళ్లు పూర్తి చేసుకోబోతుందన్నారు. ప్రధాని మోదీ 2047 వికసిత్ భారత్  లక్ష్యంగా పనిచేస్తున్నారన్నారు. ఇందుకు రాష్ట్రాల సహకారం అవసరమన్నారు. అదే విధంగా .. ఎన్నికలప్పుడే రాజకీయాలు.. అభివృద్ధి విషయంలో కాదని గుర్తు చేశారు. అందుకే 2025 లో తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ ను విడుదల చేసుకున్నామన్నారు.

 2034 నాటికి తెలంగాణను ఒక ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా, 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలన్నది తమ లక్ష్యమన్నారు.

ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి రాష్ట్రాన్ని CURE, PURE, RARE అని మూడు భాగాలుగా విభజించి అభివృద్ధి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు లోపలి ప్రాంతాన్ని CURE – కోర్ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

ఇక్కడ ఐటీ, సేవా రంగాలు, అత్యాధునిక టెక్నాలజీ, ఆవిష్కరణలకు ప్రాధాన్య మిస్తున్నాయన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు నుంచి రీజినల్ రింగ్ రోడ్డు వరకు ఉన్న ప్రాంతాన్ని PURE  పెరీ అర్బన్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేసుకుంటున్నామని తెలిపారు.

ఈ ప్రాంతంలో తయారీ పరిశ్రమలు, పారిశ్రామిక పార్కులు, లాజిస్టిక్స్ రంగాలను ప్రోత్సహిస్తామన్నారు. మిగిలిన గ్రామీణ ప్రాంతాలను RARE – రూరల్ అగ్రికల్చర్ రీజియన్ ఎకానమీగా అభివృద్ధి చేస్తున్నామని గుర్తు చేశారు.

ఇక్కడ వ్యవసాయం, ఫుడ్ ప్రాసెసింగ్, వ్యవసాయాధారిత పరిశ్రమలు, గ్రామీణ ఉపాధికి ప్రాధాన్యం ఇస్తామన్నారు. తెలంగాణను ప్రపంచ పెట్టుబడులకు గమ్యస్థానంగా తీర్చిదిద్దాలన్నదే మా సంకల్పమన్నారు.

ప్రస్తుతం దేశ జీడీపీలో తెలంగాణ 5 శాతం కంట్రిబ్యూట్ చేస్తోందని, దీన్ని 10 శాతానికి చేర్చాలనే లక్ష్యంగా పెట్టుకుని పని చేస్తున్నామన్నారు.  నాలుగు వందల ఏళ్ల క్రితమే దేశ విదేశాల నుంచి వచ్చే పారిశ్రామికవేత్తలకు చార్మినార్ ల్యాండ్ మార్క్ గా మారిందన్నారు.

చార్మినార్ తరువాత బిజినెస్ కు ల్యాండ్ మార్క్ హైటెక్ సిటీ అని చెప్పుకొచ్చారు. నూతన పారిశ్రామిక విధానంలో మీరంతా భాగస్వాములు కావాలన్నారు. ఇప్పటి వరకు మనవాళ్లు కేవలం కార్పొరేట్ కంపెనీలకు సర్వీస్ చేసే వైపు మాత్రమే ఉన్నారని, మన ప్రాంతానికి చెందిన వాళ్లు పెట్టుబడులు పెట్టి గ్లోబల్ గా ఎదగాలన్నారు.

ఒకసారి మనం ప్రపంచాన్ని గమనిస్తే…మహిళల భాగస్వామ్యం ఉన్న దేశాలే ఆర్థికంగా బలపడ్డాయన్నారు. మహిళా పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని, తెలంగాణలో మహిళలకు 61 వేల కోట్ల బ్యాంకు లింకేజీ రుణాలు అందించామని తెలిపారు.

ఆర్టీసీ బస్సులకు, పెట్రోల్ బంకులకు, సోలార్ ప్లాంట్స్ కు మహిళలను యజమానులను చేశామన్నారు. సమాఖ్య ఛాంబర్ ఆఫ్ కామర్స్ కు నా సూచన ఒక్కటేనని, యువతతో పాటు మహిళలను ప్రోత్సహించండని సూచించారు.

ప్రభుత్వం వైపు నుంచి కావాల్సిన సహకారం అందిస్తామని,  మంచి విధానాలను తమ ప్రభుత్వం కొనసాగిస్తుందని తెలిపారు. మీ పెట్టుబడులకు మా భరోసా ఉంటుందని, తెలంగాణ రైజింగ్ లక్ష్యంగా ముందుకు వెళదామంటూ సీఎం రేవంత్ పేర్కొన్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Revanth Reddy
Hyderabad
Telugu News