SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

CM Revanth reddy: బీఆర్ఎస్ కంచుకోటలో రేవంత్ రెడ్డి.. సీఎం హోదాలో తొలిసారి సిరిసిల్ల పర్యటన.. షెడ్యూల్ ఇదే..

Cm Revanth reddy sircilla tour: సిరిసిల్ల పర్యటకు సీఎం రేవంత్ రెడ్డి రానుండటంతో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎక్కడ కూడా అవాంఛనీయ ఘటనలు జరక్కుండా జాగ్రత్తలు తీసుకున్నారు. బీఆర్ఎస్ నేతలపై నిఘా పెంచారు. మరోవైపు కేటీఆర్ రెండు రోజుల పర్యటన నేపథ్యంలో కేరళలోకి కోచ్చికి ఇండియాటుడే కాంక్లెవ్ కోసం వెళ్లారు.

Written By Inamdar Paresh
Published: Sep 30, 2026, 09:10 AM IST | Updated: Sep 30, 2026, 09:25 AM IST
Image Credit: cmrevanthreddy(file)
Join

CM Revanth reddy Sircilla tour schedule:  తెలంగాణ రాజకీయాలు మరోసారి కాకరేపుతున్నాయి. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్ల పర్యటన తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సిరిసిల్లలో ఎలాగైన ఈసారి కాంగ్రెస్ జెండా ఎగరాలని సీఎం రేవంత్ పార్టీనేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేషం చేశారు. అయితే బీఆర్‌ఎస్‌ కంచుకోటగా భావిస్తున్న సిరిసిల్లలో.. సీఎం రేవంత్‌ రెడ్డి పర్యటన ఆసక్తి రేపుతోంది. 

ఈ పర్యటనలో  సుమారు రూ.345 కోట్ల అభివృద్ధి పనులను రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఇప్పటికే  సీఎం రేవంత్ సిరిసిల్లా వస్తా..  నీ సంగతి చూస్తా.. కబ్జాకు గురైన 8 వేల ఎకరాలను బైటపెడ్తానంటూ వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. 

మరోవైపు ఈఅంశంపై కబ్జాలకు గురైతే ప్రభుత్వం మీదే.. సర్వేనెంబర్లతో సహా బైటపెట్టానని కేటీఆర్ సైతం కౌంటర్ వేశారు. సవాళ్లు, ప్రతిసవాళ్లతో కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ ల మధ్య రాజకీయాలు హీటెక్కాయి. సాయంత్రం బహిరంగ సభలో సీఎం ఏంమాట్లాడతారన్నదానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

సీఎం రేవంత్‌రెడ్డి పర్యటన షెడ్యూల్..

సీఎం రేవంత్ రెడ్డి.. మధ్యాహ్నం 3 గంటలకు హెలికాప్టర్‌ ద్వారా సీఎం రేవంత్‌రెడ్డి కరీంనగర్‌ చేరుకుంటారు. అక్కడ 3.10 – 3.40 గంటల వరకు: తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు.

3.40 గంటలకు: నూతన సమీకృత కలెక్టరేట్‌ భవనాన్ని ప్రారంభిస్తారు. అనంతరం కలెక్టరేట్‌లోని చాంబర్లను సందర్శిస్తారు. ఆ తర్వాత 4.30 గంటలకు: హెలికాప్టర్‌ ద్వారా బయలుదేరి 4.45 గంటలకు సిరిసిల్ల చేరుకుంటారు.

 సాయంత్రం.. 4.50 గంటలకు: కాలేజీ మైదానం నుంచి కాలినడకన బయలుదేరి 5 గంటలకు అంబేద్కర్‌ సర్కిల్‌ వద్దకు చేరుకుంటారు. 5.00 గంటల తర్వాత: అంబేద్కర్‌ సర్కిల్‌ నుంచి నేతన్న చౌక్‌, చంద్రంపేట మీదుగా రగుడు బైపాస్‌ రోడ్డులోని సభాస్థలికి చేరుకుంటారు.

6.15 గంటలకు: సభాస్థలిలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. సాయంత్రం 6.15 – 7.45 గంటల వరకు: బహిరంగ సభలో ప్రసంగిస్తారు. ఆ తర్వాత రాత్రి 7.45 గంటలకు: రోడ్డు మార్గంలో హైదరాబాద్‌కు బయలుదేరుతారు. పోలీసులు ఎక్కడికక్కడ పటిష్టమైన బందోబస్తు చేపట్టారు.

 

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES