సొంత ఎమ్మెల్యేలపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్.. 'పిచ్చికుక్కలు కరిచాయా?' అంటూ ఘాటు వ్యాఖ్యలు!
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ లో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలపై సీఎం తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉంటూనే ప్రభుత్వం బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేల తీరును సీఎం రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు.
CM Revanth Reddy: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే సీరియస్ అయ్యారు. కాంగ్రెస్ లో వినిపిస్తున్న అసమ్మతి స్వరాలపై సీఎం తీవ్రంగా స్పందించారు. పార్టీలో ఉంటూనే ప్రభుత్వం బహిరంగంగా విమర్శలు గుప్పిస్తున్న కొంతమంది ఎమ్మెల్యేల తీరును సీఎం రేవంత్ తీవ్రంగా తప్పుబట్టారు. అలాంటి వారిని పిచ్చికుక్కలు కరిచాయా అని ప్రశ్నించారు రేవంత్. అటువంటివారిని కాంగ్రెస్ కార్యకర్తలే ఎర్రగడ్డ మానసిక ఆసుపత్రికి తరలిస్తారంటూ హెచ్చరించారు. గురువారం సిద్ధిపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ ఈ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
కొంతమంది నేతలు మైకుల ముందు ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. వ్యక్తిగతంగా కలిసినప్పుడు మాత్రం పనితీరును ప్రశంసిస్తున్నారంటూ రేవంత్ ఎద్దేవా చేశారు. మంచి విషయాలను మైకుల్లోనే చెప్పాలి.. లోపాలను మాత్రం వ్యక్తిగతంగా చర్చించాలి. కానీ కొంతమంది దీనికి పూర్తిగా భిన్నంగా వ్యవహరిస్తున్నారంటూ చురకలంటించారు. సీఎం తన ప్రసంగంలో ఎవరి పేర్లనూ కూడా నేరుగా ప్రస్తావించినప్పటికీ.. ఇటీవల నిధుల కేటాయింపులపై ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి.. అధికారుల పనితీరుపై ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో రేవంత్ రెడ్డి ఈ వార్నింగ్ ఇచ్చినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జోరుగా సాగుతోంది.
ఇదే సభలో బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు ను లక్ష్యంగా చేసుకుని రేవంత్ రెడ్డి విమర్శలు చేశారు. రానున్న ఎన్నికల్లో సిద్ధిపేటలో హరీశ్ రావును ఓడించి కాంగ్రెస్ అభ్యర్ధికి మంత్రి పదవి ఇస్తానని బహిరంగంగా ప్రకటించారు. 10ఏండ్ల బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ కుటుంబం రాష్ట్ర సంపదను కొల్లగొట్టిందని ఆరోపించారు. ప్రాజెక్టు అంశంపై కేసీఆర్, హరీశ్ రావులతో అసెంబ్లీలో చర్చకు సిద్ధమంటూ సవాల్ విసిరారు. ఇక ఈ వేదిక నుంచే ప్రతి కుటుంబానికి రూ. 5లక్షల బీమా సౌకర్యం కల్పించే ఇందిరమ్మ ఫ్యామిలీ ఇన్సూరెన్స్ స్కీమ్ ను సీఎం ప్రారంభించారు. 2034 వరకు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వమే అధికారంలో ఉంటుందని సీఎం ధీమా వ్యక్తం చేశారు.
Also Read: