• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Secunderabad: సికింద్రాబాద్‌‌లో ఘోరం.. ఫుడ్ డెలివరీ బాయ్ పై దంపతుల దాడి.. వీడియో వైరల్..

Secunderabad: సికింద్రాబాద్‌‌లో ఘోరం.. ఫుడ్ డెలివరీ బాయ్ పై దంపతుల దాడి.. వీడియో వైరల్..

Attack on food delivery boy in secunderabad: వాసవి నగర్ లో జొమాటో డెలీవరి బాయ్ పై దంపతులు అత్యంత అమానుషంగా దాడి చేశారు. సికింద్రాబాద్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనకు చెందిన వీడియో వైరల్ గా మారింది.

Written ByInamdar Paresh
Published: Oct 04, 2026, 03:56 PM IST|Updated: Oct 04, 2026, 04:03 PM IST
joinshare
Secunderabad: సికింద్రాబాద్‌‌లో ఘోరం.. ఫుడ్ డెలివరీ బాయ్ పై దంపతుల దాడి.. వీడియో వైరల్..
Image Credit: secunderabadfooddeliveryboyattackvideo

About the Author

Inamdar Paresh

Inamdar Paresh

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. రోజుకు రూ.300 దాచిపెడితే చేతికి రూ.6.42 లక్షలు! పూర్తి క్యాలిక్యులేషన్!

పోస్ట్ ఆఫీస్ బంపర్ స్కీమ్.. రోజుకు రూ.300 దాచిపెడితే చేతికి రూ.6.42 లక్షలు! పూర్తి క్యాలిక్యులేషన్!

2

New Job Card: 15 రోజుల్లోనే కొత్త జాబ్ కార్డు.. అర్హతలు, దరఖాస్తు విధానం ఇదే

3

Tirumala: తిరుమల లడ్డు వివాదం వేళ టీటీడీ కీలక నిర్ణయం.. ఏకంగా 12 టన్నుల జీడిపప్పు రిజెక్ట్.. అసలు కారణం ఇదే..

4

కన్ఫర్మ్ టికెట్ ఉందనే ధీమాతో ఉన్నారా? ఈ చిన్న రూల్ మర్చిపోతే రూ.500 ఫైన్ పడుతుంది తెలుసా?

5

Thalliki Vandanam Second Phase: 3.29 లక్షల మందికి రూ.13,000.. ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Couple brutally attacks on food delivery boy in secunderabad: చాలా మంది తమకు కావాల్సిన ఆహరం,  ఇతర వస్తువులను  ఆన్ లైన్ లో ఆర్డర్ లు పెడుతారు. ముఖ్యంగా జొమాటో,స్విగ్గి, మొదలైన ఆన్ లైట్ ప్లాట్ ఫామ్ లను ఎక్కువగా ఉపయోగిస్తారు . ఈ క్రమంలో కొన్నిసార్లు ట్రాఫిక్, లొకెషన్ లలో టెక్నికల్ సమస్యల వల్ల డెలీవరీ అనేది ఆలస్యమవుతుంది. కొంత మంది మాత్రం డెలీవరీ ఆలస్యమైతే ఆర్డర్ లు తెచ్చిన వారిపై తమ ప్రతాపం చూపిస్తారు. నోటికొచ్చినట్లు తిట్టడం, దాడులు చేయడం వంటివి చేస్తారు. అచ్చం ఈ కోవకు చెందిన ఘటన ప్రస్తుతం సికింద్రాబాద్ పరిధిలో వెలుగులోకి వచ్చింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.

 

సీసీటీవీ ఫుటేజ్..! ఫుడ్ డెలివరీ ఆలస్యమైందని డెలివరీ బాయ్‌పై దంపతుల దాడి సికింద్రాబాద్‌లోని కంటోన్మెంట్ వాసవినగర్‌లో ఘటన లొకేషన్ తప్పుగా చూపించడంతో ఫుడ్ ఆర్డర్ లేట్ అయిందని జొమాటో డెలివరీ బాయ్ ఆశిపై దంపతులు దాడి ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు https://t.co/sxvknxSfsI

— Telugu Scribe (@TeluguScribe) October 4, 2026

 

సికింద్రాబాద్ లోని కార్ఖానా పోలీస్ స్టేషన్ పరిధి వాసవి నగర్ లో ఈ ఘటన చోటుచేసుకుంది. రాక్ వెల్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్న భార్యాభర్తలు జొమాటో ద్వారా ఆహారాన్ని బుక్ చేసుకున్నారు. అయితే.. ఆహారాన్ని తీసుకువచ్చే జొమాటో బాయ్ ఆశిష్ కాస్త ఆలస్యంగా డెలివరీ చేశాడు. దీంతో ఆ భార్యభర్తలు అతనిపై ఆవేశంలో ఊగిపోయారు.

 బూతులు తిడుతూ , దాడి చేశారు. కనీసం అతను లొకెషన్ సమస్య వచ్చిందని చెప్పిన విన్పించుకోలేదు.  ఈ క్రమంలో వారి మధ్య మాటా మాటా పెరగడంతో గొడవ కాస్త పీక్స్ కు చేరింది. అక్కడున్న కర్ర, చీపురుతో ఆశిష్ మీద దాడి చేశారు.  ఈ ఘటనలో జొమాటో బాయ్ ఆశిష్ కు తలకు తీవ్ర గాయాలు కావడంతో అతన్ని ఆస్పపత్రికి తరలించారు. 

తనపై జరిగిన దాడి నేపథ్యంలో కార్ఖానా పోలీసులకు ఆశిష్ ఫిర్యాదు చేశాడు. అయితే.. ఈ ఘటనపై చిన్న కేసు నమోదు చేసి పోలీసులు చేతులు దులుపుకుంటున్నారని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆశిష్ డిమాండ్ చేశారు. 

పొట్ట కూటి కోసం జొమాటో డెలివరీ బాయ్ గా ఉద్యోగం చేస్తున్న తనపై అకారణంగా దాడికి పాల్పడ్డారని ఆశిష్ ఆవేదన వ్యక్తం చేశారు. ఘటనకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాలలో రికార్డు అయ్యాయి. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Telangana News
Hyderabad
Crime News