• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /కాగితాల్లో లెక్కలే కానీ చేతికి సున్నా..ఈ-కుబేర్‌లో మగ్గుతున్న CPS ఉద్యోగుల DA నిధులు..!!

కాగితాల్లో లెక్కలే కానీ చేతికి సున్నా..ఈ-కుబేర్‌లో మగ్గుతున్న CPS ఉద్యోగుల DA నిధులు..!!

CPS Employees DA Arrears e-Kuber: రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డీఏ (DA) బకాయిలు సాంకేతిక, ఆర్థిక ప్రక్రియల మధ్యే నిలిచిపోతున్నాయి.

Reported ByBhoomiEdited ByBhoomi
Published: Oct 01, 2026, 10:35 AM IST|Updated: Oct 01, 2026, 10:37 AM IST
joinshare
కాగితాల్లో లెక్కలే కానీ చేతికి సున్నా..ఈ-కుబేర్‌లో మగ్గుతున్న CPS ఉద్యోగుల DA నిధులు..!!
Image Credit: CPS Employees DA Arrears e-Kuber

About the Author

Bhoomi

Bhoomi

మాధవి లగిశెట్టి (భూమి).. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్ పనిచేస్తున్నారు. ఇక్కడ బిజినెస్, స్పోర్ట్స్, క్రైమ్, రాజకీయ వ్యవహారాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

CPS Employees DA Arrears e-Kuber: రాష్ట్రంలో కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ (CPS) పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు చెల్లించాల్సిన డీఏ (DA) బకాయిలు సాంకేతిక, ఆర్థిక ప్రక్రియల మధ్యే నిలిచిపోతున్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు ట్రెజరీల నుంచి బిల్లులు ఈ-కుబేర్ కు చేరుతున్నప్పటికీ.. అక్కడి నుంచి ఉద్యోగుల ఖాతాల్లో జమ కావడంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.

'ఈ-కుబేర్' అనేది భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) నిర్వహిస్తున్న కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్ సిస్టమ్. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ఉద్యోగుల జీతాలు, పెన్షన్లు, ఇతర బకాయిల చెల్లింపులను నేరుగా లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేయడానికి ఈ పోర్టల్‌ను ఉపయోగిస్తాయి.

ట్రెజరీల నుంచి బిల్లులు ఆమోదం పొందిన తర్వాత అవి ఈ-కుబేర్ కు చేరుతాయి. అక్కడి నుంచి ప్రభుత్వ ఖాతాలోని నిధుల లభ్యత ఆధారంగా ఆర్బీఐ ద్వారా నేరుగా ఉద్యోగుల వ్యక్తిగత ఖాతాల్లోకి నగదు బదిలీ అవుతుంది. అయితే.. బిల్లులు ఈ-కుబేర్ కు చేరినప్పటికీ, ప్రభుత్వ ఖాతాలో తగినన్ని నిధులు లేకపోతే అవి అక్కడే పెండింగ్‌లో ఉండిపోతాయి.

బకాయిల లెక్కలు.. ఈ-కుబేర్ లో పెండింగ్ ఇదీ:
తాజా గణాంకాల ప్రకారం సీపీఎస్ ఉద్యోగులకు సంబంధించిన మూడు జీవోల పరిధిలోని డీఏ బకాయిలు అత్యధికంగా ఈ-కుబేర్ లోనే నిలిచిపోయాయి.

GO.120 (తేదీ: 30.10.2024): దీని కింద మొత్తం 17 వాయిదాలు చెల్లించాల్సి ఉంది. ఈ 17 వాయిదాలకు సంబంధించిన బిల్లులు ఈ-కుబేర్ కు చేరుకున్నాయి. కానీ, అందులో కేవలం ఒక (1) వాయిదా మాత్రమే క్లియర్ అవ్వగా.. మరో 16 వాయిదాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

GO.78 (తేదీ: 13.06.2025): ఈ ఉత్తర్వుల ప్రకారం మొత్తం 28 వాయిదాలు రావాల్సి ఉండగా.. 15 వాయిదాలు ఈ-కుబేర్ కు వెళ్లాయి. వీటిలో 2 మాత్రమే క్లియర్ అయ్యాయి, మిగతా 13 వాయిదాలు పెండింగ్‌లో ఉన్నాయి.

GO.2 (తేదీ: 12.01.2026): దీని ద్వారా మొత్తం 30 వాయిదాలు చెల్లించాల్సి ఉంది. కేవలం 8 వాయిదాలు మాత్రమే ఈ-కుబేర్ కు చేరగా, అందులో ఒక్కటి కూడా క్లియర్ కాలేదు. మొత్తం 8 పెండింగ్‌లోనే ఉండిపోయాయి.

సమగ్రంగా చూస్తే.. ఈ మూడు జీవోలకు కలిపి మొత్తం 75 వాయిదాల బకాయిలు రావలసి ఉంది. అందులో 40 వాయిదాలకు సంబంధించిన బిల్లులు ఈ-కుబేర్ ప్రాసెస్‌లో ఉండగా.. ఇప్పటి వరకు కేవలం 3 మాత్రమే క్లియర్ అయ్యాయి. ఏకంగా 37 వాయిదాలు ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయి.

ఉద్యోగ సంఘాల ఆవేదన ఇదే: 
హక్కుగా రావాల్సిన డీఏ బకాయిలు చేతికి అందకపోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. బిల్లులు ట్రెజరీల్లో పాస్ అయ్యి ఈ-కుబేర్ కు వెళ్లాయని అధికారులు చెబుతున్నప్పటికీ, అకౌంట్లలో మాత్రం పైసా జమ కావడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. సాంకేతికంగా బిల్లులు ప్రాసెస్‌లో ఉన్నట్లు చూపిస్తున్నా.. నెలల తరబడి అవి ఈ-కుబేర్ లోనే మగ్గిపోతుండటంతో ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆందోళన చెందుతున్నారు.

పండుగల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో, పెండింగ్‌లో ఉన్న మొత్తం 37 వాయిదాల బకాయిలను వెంటనే క్లియర్ చేసి తమ ఖాతాల్లో జమ చేయాలని.. కేవలం కాగితాలపై లెక్కలకు పరిమితం కాకుండా వాస్తవ రూపంలో నగదు అందించాలని ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. 

Add Zee News as a Preferred Source
TAGS:
DA Hike
Telangana News
Employees