SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Dasara Special Buses: దసరా సెలవులకు ఊరు వెళ్తున్నారా? ఇలా టికెట్ బుక్ చేస్తే ఇంటికే బస్సు వచ్చేస్తుంది!

Dasara Special Buses 2026: దసరా పండుగ సెలవుల సందర్భంగా స్వస్థలాలకు వెళ్లే విద్యార్థులు, నివాసితుల కోసం టీజీఎస్‌ఆర్టీసీ (TGSRTC) ప్రత్యేక రవాణా సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వివిధ హాస్టల్స్, కాలేజీల్లో ఉండే విద్యార్థులతో పాటు కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీల నివాసితుల కోసం ఈ ప్రత్యేక బస్సులను కేటాయిస్తున్నారు. కనీసం 30 మంది ప్రయాణికులు సిద్ధంగా ఉంటే వారు ఉన్న ప్రాంతానికే నేరుగా బస్సును పంపించే వెసులుబాటు కల్పించారు.

Written By Harish Darla
Published: Oct 07, 2026, 12:03 PM IST | Updated: Oct 07, 2026, 12:25 PM IST
Join

Dasara Special Buses 2026: దసరా పండుగ సందర్భంగా వరుస సెలవుల వేళ స్వస్థలాలకు ప్రయాణమయ్యే విద్యార్థులు, ప్రజల సౌకర్యార్థం తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేక రవాణా ఏర్పాట్లు చేసింది. ఈ వివరాలను గ్రేటర్ హైదరాబాద్ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సి. వినోద్ కుమార్ స్పష్టం చేశారు. దీని కోసం ప్రయాణికులు తమ ప్రాంత పరిధిలోని డెప్యూటీ రీజినల్ మేనేజర్ల (DRM) సంప్రదింపు నంబర్లను అధికారులు విడుదల చేశారు.

విద్యార్థులు, కాలనీవాసులకు ప్రత్యేక బస్సులు..
గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని వసతిగృహాల్లో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థులు దసరా సెలవులకు తమ సొంత ఊళ్లకు వెళ్లేందుకు వీలుగా కాలేజీలు, వసతి గృహాల ప్రాంతాల నుంచే ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే వివిధ కాలనీలు, టౌన్‌షిప్‌లు, గేటెడ్ కమ్యూనిటీలలో నివసించే వారి కోసం ప్రత్యేక వెసులుబాటు కల్పించారు. కనీసం 30 మందికి తగ్గకుండా ప్రయాణికులు ఉంటే, వారు ఉన్న చోటకే బస్సును పంపిస్తామని స్పష్టం చేశారు.

ప్రత్యేక బస్సు సౌకర్యం కోసం ప్రయాణికులు తమ ప్రాంతానికి సంబంధించిన డెప్యూటీ రీజినల్ మేనేజర్లను సంప్రదించవచ్చని సూచించారు. వివిధ ప్రాంతాల వారీగా సంప్రదించాల్సిన డీఆర్‌ఎం (DRM) నంబర్లు ఇక్కడ తెలుసుకోవచ్చు.

కూకట్‌పల్లి డివిజన్ డీఆర్‌ఎం (99562 26148)..
పటాన్‌చెరు, దుండిగల్, బీరంగూడ, కూకట్‌పల్లి, లింగంపల్లి, మియాపూర్, మాదాపూర్, బాలానగర్, గచ్చిబౌలి ప్రాంతాల ప్రజలు బస్సు వివరాల కోసం ఈ నంబరును సంప్రదించాలి

సికింద్రాబాద్ డివిజన్ డీఆర్‌ఎం (99592 26142).. 
సికింద్రాబాద్, ఏఎస్‌రావు నగర్, మల్కాజిగిరి, రేతిఫైల్, ఉప్పల్, తార్నాక ప్రాంతాల నివాసితులు స్పెషల్ బస్సుల వివరాల కోసం ఈ నంబర్‌కు ఫోన్ చేయవచ్చు.

హయత్‌నగర్ డివిజన్ డీఆర్‌ఎం (99892 26136).. 
హయత్‌నగర్, దిల్‌సుఖ్‌నగర్, ఎల్‌.బి.నగర్, ఆదిభట్ల, బడంగ్‌పేట్, మిధాని, సరూర్‌నగర్ ప్రాంతాల వారు ఈ మొబైల్ నంబరు కాల్ చేసి వివరాలను సంప్రదించవచ్చు.

చార్మినార్ డివిజన్ డీఆర్‌ఎం (99592 26129)..
రాజేంద్రనగర్, మెహదీపట్నం, అత్తాపూర్, కోఠి, చార్మినార్, కాచిగూడ, నారాయణగూడ ప్రాంతాల ప్రజలు ప్రత్యేక బస్సుల వివరాల కోసం ఈ నంబరుకు ఫోన్ చేసి సంప్రదించవచ్చు. ఈ ప్రత్యేక సేవల ద్వారా పండుగ ప్రయాణాన్ని ప్రయాణికులు సులభతరం చేసుకోవచ్చని తెలంగాణ ఆర్టీసీ అధికారులు, సిబ్బంది తెలిపారు.

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

దార్ల హరీశ్.. జీ తెలుగు న్యూస్‌లో సీనియర్ కంటెంట్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాను. నాకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ఎంటర్‌టైన్మెంట్, బిజినెస్, టెక్నాలజీ, హెల్త్, క్రీడలు, రాజకీయాలు వంటి వాటికి సంబంధించిన వార్తలు రాస్తున్నాను. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశాను.

ZEENEWS TRENDING STORIES