• हिन्दी
  • English
  • मराठी
  • বাংলা
  • தமிழ்
  • മലയാളം
  • ગુજરાતી
  • తెలుగు
  • ಕನ್ನಡ
  • ଓଡ଼ିଶା
  • Z Bharat
  • PHH
  • Business
  • WION
  • facebookyoutubetwitterwhatsapp
Zee Telugu News
  • వార్తలు
  • ఫోటోలు
  • వీడియోలు
  • ఆంధ్రప్రదేశ్

  • తెలంగాణ

Add Zee Business As A Preferred Source
App
  • Live TV
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
  • వినోదం
  • జీవనశైలి
  • ఆధ్యాత్మికం
  • జీ తెలుగు న్యూస్
  • /తెలంగాణ
  • /Telangana DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్‌ జాక్‌పాట్‌.. దసరాకు రెండు డీఏలు

Telangana DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్‌ జాక్‌పాట్‌.. దసరాకు రెండు డీఏలు

Double Jackpot To Telangana Govt Employees: అర్ధరాత్రి జరిపిన చర్చలు ప్రభుత్వ ఉద్యోగులకు భారీ కానుకను అందించాయి. దసరా పండుగకు రెండు డీఏలు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. అంతేకాకుండా పీఆర్‌సీపై కూడా సానుకూలంగా స్పందించడంతో ఉద్యోగులకు బంపర్‌ జాక్‌పాట్‌ తగిలింది.

Reported By Ravi Kumar SargamEdited By Ravi Kumar Sargam
Published: Sep 24, 2026, 12:28 AM IST|Updated: Sep 24, 2026, 12:28 AM IST
joinshare
Telangana DA: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు డబుల్‌ జాక్‌పాట్‌.. దసరాకు రెండు డీఏలు
Image Credit: Telangana Govt Employees DA

About the Author

 Ravi Kumar Sargam

Ravi Kumar Sargam

సర్గం రవి కుమార్‌. జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి రాజకీయాలు, స్పోర్ట్స్, వినోదం, క్రైమ్, జాతీయ వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.  
Read More

Trending

  • News
  • Photos
  • Videos
Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

Krishna Vamsi: ఛార్మీ టాప్ హీరోయిన్ అయ్యేది.. ఆ ఒక్క నిర్ణయం కెరీర్‌ను మార్చేసిందన్న కృష్ణవంశీ..!

2

YS Jagan: స్థానిక ఎన్నికలపై మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ 9 గంటల సుదీర్ఘ సమీక్ష

3

Prabhas Birthday Surprise: డార్లింగ్ బర్త్‌డేకు మూడు గిఫ్టులు.. ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్న ఆ సర్‌ప్రైజ్ ఇదే!

4

Telangana Cabinet: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు భారీ వరాలు.. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాలు ఇవే!

5

Tomorrow Public Holiday: రేపు స్కూళ్లు, కాలేజీలకు పబ్లిక్ హాలిడే.. ఆ తర్వాత వరుస సెలవులు..?

logo
  • contact us
  • privacy policy
  • legal
  • investor info
  • advertise with us
© 1998-2026 Indiadotcom Digital Private Limited, All Rights Reserved.

Telangana DA Release: తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించింది. అర్ధరాత్రి వరకు జరిగిన చర్చల్లో ఎట్టకేలకు ఉద్యోగుల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకరించింది. రెండు కరువు భత్యం (డీఏ) చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దసరాకు రెండు డీఏలు ప్రకటిస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఇక అంతేకాకుండా ఉద్యోగుల ప్రధాన డిమాండ్‌ పీఆర్‌సీపై కూడా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. నెలాఖరులోపు పీఆర్‌సీ రిపోర్టు తీసుకుంటామని.. సీపీఎస్‌పై ప్రత్యేక కమిటీ ఏర్పాటుచేస్తామని తెలంగాణ ప్రభుత్వం హామీ ఇచ్చిందని ఉద్యోగ సంఘాలు ప్రకటించాయి. దీంతో ఉద్యోగ సంఘాలు తమ భవిష్యత్‌ కార్యాచరణను వాయిదా వేసుకున్నాయి.

దసరా పండుగ కానుకగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలు చెల్లించేందుకు తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. ప్రభుత్వంతో ఉద్యోగ సంఘాల ప్రతినిధుల చర్చల అనంతరం టీజీఈ జేఏసీ ప్రతినిధులు ముఖ్యాంశాలు వెల్లడించారు. ఉద్యోగులకు దసరా పండుగ కానుకగా పెండింగ్‌లో ఉన్న రెండు డీఏలను మంజూరు చేసేందుకు ప్రభుత్వం అంగీకరించిందని ప్రకటించారు. వేతన సవరణ సంఘం (​పీఆర్‌సీ)పై రాబోయే 10 రోజుల్లోపు ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేసి, త్వరితగతిన నిర్ణయం తీసుకుంటామని ప్రభుత్వం హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఇక ​ఉద్యోగ, ఉపాధ్యాయుల 4 ప్రధాన డిమాండ్లపై సమగ్రంగా చర్చించామని, త్వరలోనే పీఆర్‌సీ తదుపరి ప్రక్రియ ప్రారంభమవుతుందని ఉద్యోగ సంఘాల జేఏసీ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు.

ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో జరిగిన సమావేశం అనంతరం మీడియాతో ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ ఏలూరి శ్రీనివాస రావు కీలక విషయాలు వెల్లడించారు. రెండు డీఏలు ప్రకటన.. పీఆర్‌సీపై ప్రభుత్వం సానుకూల నిర్ణయం ప్రకటించడంతో రేపు జరగాల్సిన విస్తృత స్థాయి జేఏసీ సమావేశం తాత్కాలికంగా వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. 

కనీసం రూ.2,000 కోట్ల పెండింగ్ బిల్లులు చెల్లించాలని తాము కోరగా ప్రభుత్వం రూ.1,000 కోట్లకు మించి చేయలేమని తెలిపిందని జేఏసీ ప్రతినిధులు తెలిపారు. సీపీఎస్‌పై కమిటీ వేయాలనే అంశంలోనూ జాబితాను ఇంకా పరిశీలించలేదని చెప్పడంతో ఇంకా స్పష్టమైన సమాధానం రాలేదని చెప్పారు. మొత్తం పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏల్లో మరో డీఏను మార్చిలోపు పరిష్కరిస్తామని చెప్పినట్లు వెల్లడించారు. మిగిలిన డీఏల చెల్లింపు సమయాన్ని పరిశీలిస్తామని తెలిపారు.

పెండింగ్ బిల్లులు, అడ్వాన్సులు, డిపాజిట్లను మార్చిలోపు అందుబాటులో ఉన్న నిధుల మేరకు క్లియర్ చేస్తామని హామీ ఇచ్చినట్లు ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్‌ ఏలూరి శ్రీనివాస రావు తెలిపారు. తమ 64 డిమాండ్లలోని ఆర్థికేతర అంశాలతోపాటు 12.5, 107, జీఓ 190 అమలు, రెసిడెన్షియల్ పాఠశాలలకు సంబంధించిన అంశాలు చర్చకు రావాల్సి ఉన్నాయని పేర్కొన్నారు. చర్చలను పూర్తిగా విజయవంతం కాలేదని.. కొన్ని అంశాల్లో హామీలు లభించడంతో తాత్కాలికంగా సంతృప్తి అని వెల్లడించారు. ప్రస్తుతానికి కొత్త కార్యాచరణ ప్రకటించలేదని స్పష్టం చేశారు.

Add Zee News as a Preferred Source
TAGS:
Employees
Telangana News
DA Hike
Hyderabad