SOCIAL MEDIA

Newsletter

PARTNER SITES
Select Language Select State

Vemulawada: వేముల వాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే శ్మశానంకు తరలించిన కుటుంబ సభ్యులు..

Man shifted in crematorium in vemulawada: బతికుండగానే మర్రిపల్లి రాకేష్ ను కుటుంబ సభ్యులు స్మశానానికి తరలించారు. వేములవాడలో చోటు చేసుకున్న ఈ ఘటన కాస్త వార్తలలో నిలిచింది.

Written By Inamdar Paresh
Published: Nov 06, 2026, 05:33 PM IST | Updated: Nov 06, 2026, 05:44 PM IST
Image Credit: Man shifted in crematorium in vemulawada
Join

Family shifted man in cremation room vemulawada: ఇటీవల సమాజంలో చాలా అమానవీయ ఘటనలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. డబ్బుల కోసం ఎంతకైన దిగజారుతున్నారు. రక్త సంబంధాలు అని కూడా చూడటంలేదు. డబ్బుల కోసం ఎంతకైన దిగజారుతున్నారు. డబ్బుల విషయంలో గొడవలు పడి, హత్యలకు కూడా వెనుకాడటంలేదు. ఈ క్రమంలో కట్టుకున్న వారిపై, కన్నవారిపై దాడుల ఘటనలు ఎక్కువగా వార్తలలో ఉంటున్నాయి. పొరపాటున ఎవరైన ఆస్పత్రిలో చేరితో ఇక వారి వైద్యానికి డబ్బులు లేకుంటే వారి ప్రాణాలు గాల్లో కలవాల్సిందే. ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్లాలోని వేముల వాడలో తీవ్ర విషాదకర ఘటన వెలుగులోకి వచ్చింది.

 

 


రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వైకుంఠధామంలో హృదయవిదారక ఘటన వెలుగులోకి వచ్చింది. చందుర్తి మండలం కిష్టంపేటకు చెందిన అమృత గత ఐదేళ్లుగా వేములవాడలో నివాసం ఉంటున్నారు.  వారి బిడ్డ గత కొన్నేళ్లుగా జాండిస్ తో ఇబ్బందులు పడుతున్నాడు.  ఇప్పటి వరకు రాకేష్ వైద్యం కోసం రూ.10 లక్షలు ఖర్చు చేసి అప్పులపాలయ్యారు.

ఇక చేసిన అప్పులు తీర్చలేక, ఇంటి అద్దె చెల్లించలేని పరిస్థితిలో బతికుండగానే కుమారుడితో కలిసి శ్మశానవాటికకు చేరుకున్నారు. జాండీస్‌తో పాటు శ్వాస సంబంధిత సమస్యలతో తీవ్ర ఇబ్బందులు క్రమంగా తగ్గక పోగా మరీ ఎక్కువైంది. దీంతో  శ్మశాన వాటికలోనే  ఉంటున్నారు. ఈ ఘటన స్థానికంగా వార్తలలో నిలిచింది. దీనిపై ప్రజాప్రతినిధులు, ప్రభుత్వం ఏదైన సాయం చేయాలని స్థానికులు కోరుతున్నారు.

 

 

 

Add Zee News as a Preferred Source
TAGS:

About the Author

పరేష్ జీ తెలుగు డిజిటల్ మీడియాలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నారు. ఇక్కడ 2024 నుంచి నేషనల్, సోషల్ మీడియా వైరల్ న్యూస్, క్రైమ్, తెలంగాణ, ఏపీ రాజకీయాలు, ఆస్ట్రాలజీ, లైఫ్  స్టైల్  వ్యవహరాలకు సంబంధించిన వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో వివిధ రంగాలకు సంబంధించిన వార్తలు అందించారు.

ZEENEWS TRENDING STORIES